India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నెల్లూరులోని పలు మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ దుకాణాలపై అధికారులు దాడులు చేశారు. సరైన బిల్లులు, GST చెల్లించకుండా విక్రయిస్తున్న రూ.49.24 లక్షల విలువైన మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ పరికరాలను సీజ్ చేశారు. ఈ సరుకును వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అప్పగించారు. జై అంబికా, శ్రీ అంబికా, జేపీ మొబైల్స్ షాపుల్లో విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ నరసింహారావు, DCTO విష్ణు రావు దాడులు చేశారు.

సామాజిక మాధ్యమాల్లో meesho ప్రశ్నావళి అని, ప్రశ్నలకు సమాధానం చెబితే లక్ష వరకు గిఫ్ట్ గెలుచుకోవచ్చని ఓ లింకు వైరల్‌గా మారింది. ఈ లింకును క్లిక్ చేస్తే.. వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వస్తుంది. ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఆఫర్ 12వ తేదీ వరకు ఉన్నట్లు చూపిస్తుంది. అయితే ఇలాంటి లింకులను నమ్మవద్దని అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఏపీలో అదనపు మత్స్య పరిశోధన కేంద్రాలను స్థాపించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, గత మూడేళ్లలో కేటాయించిన నిధులపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆరా తీశారు. లోక్‌సభలో మంగళవారం ఈ అంశంపై వివరాలు కోరారు. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఏపీలో నాలుగు ప్రాంతీయ మత్స్య పరిశోధన కేంద్రాలు ఉన్నాయన్నారు.

కావలి రూరల్ మండలం తాళ్లపాలెం గ్రామానికి చెందిన నూకల పాటి శివప్రసాద్ రెడ్డి (65) మంగళవారం మామిడి తోటలో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడని రూరల్ పోలీసులు తెలిపారు. మృతుడి భార్య లక్ష్మి కాంతమ్మ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుమల్ రెడ్డి తెలిపారు. అనారోగ్య కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

నెల్లూరు వనంతోపు సెంటర్‌కు చెందిన వెంకయ్య, తన భార్య హజరత్తమ్మ (41)ను రాయితో తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు. వీరు పల్నాడు జిల్లా నరసరావుపేట(M) ఇసప్పాలెం మహంకాళి తిరునాళ్లకు వెళ్లారు. ఆ సమయంలో ఘర్షణ చోటుచేసుకుని హత్య చేసినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు నరసరావుపేట పోలీసులు స్పందించి, నిందితుడు వెంకయ్యను అదుపులోకి తీసుకున్నారు. పాత సామాన్లు ఏరుకుంటూ జీవనం సాగించేవారని గుర్తించారు.

జిల్లాలోని 52 PHC, 29 పట్టణ PHCలు, 10 CHCలతోపాటు GGH ఆత్మకూరు, కావలి, గూడూరు ఏరియా ఆసుపత్రులలోనూ ఈ HPV వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తున్నట్లు DMHO సుజాత తెలిపారు. ఉచితంగా వేసే ఈ HPV వ్యాక్సిన్‌ను ఎంపిక చేసిన ఆడపిల్లలకు 0.5 ml డోస్‌ను బుధవారం నుంచి ఇవ్వననున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 14 ఏళ్లు పైడి 15 ఏళ్లలోపు ఆడపిల్లలు 25,305 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు.

గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ నివారణకు ముందస్తుగా వేసే వ్యాక్సిన్ HPV జిల్లాకు చేరినట్లు DMHO సుజాత తెలిపారు. 14 సం.లు పైబడి 15 ఏళ్లలోపు ఉన్న ఆడపిల్లలకు ఈ వ్యాక్సిన్ వేస్తారు. రూ.4వేలు విలువ చేసే HPV(హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ మొదటి విడతగా 8,939 డోసులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు చేరుకున్నాయన్నారు. రేపటి నుంచి ఉచితంగా ఆడపిల్లలకు పంపిణీ చేయనున్నట్లు ఆమె తెలిపారు.

భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛహరిత విద్యాలయంలో భాగంగా జిల్లాలోని అన్నీ పాఠశాలలను పరిశీలించారు. ఇందులో భాగంగా నీటి వసతి, మరుగుదొడ్ల పరిశుభ్రత, హ్యాండ్ వాషింగ్, పాఠశాలలో చెట్ల పెంపకం వంటి కార్యక్రమాలను సర్వే చేసి మొత్తం 8 ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ 8 ఉత్తమ పాఠశాలల HMలకు కలెక్టర్ సర్టిఫికెట్లు అందజేశారు.

పిల్లల రక్షణే ధ్యేయంగా నెల్లూరు ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆదేశాలతో ‘ఆపరేషన్ చిన్నారి తల్లి’ కార్యక్రమం జిల్లావ్యాప్తంగా సాగుతోంది. శక్తి బృందాలు పాఠశాలల్లో ఫొక్సో (POCSO) చట్టం, బాల్య వివాహాల నిర్మూలన, డ్రగ్స్ నిరోధంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాయి. అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటూ, ఆపదలో 100, 112, 1098 నంబర్లను సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు.

జిల్లాలో ఏర్పాటవుతున్న పరిశ్రమలకు మౌలిక వసతులను త్వరితగతిన కల్పించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి పరిశ్రమలు, ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. భూ సేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నీటి వసతి, విద్యుత్ మొదలైన కనీస సౌకర్యాలను కల్పించాలన్నారు.
Sorry, no posts matched your criteria.