India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రహదారులు అధ్వానంగా ఉన్నాయి. పలు మార్గాల్లో ఏర్పడిన గుంతలతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. నెల్లూరు, కావలి, గూడూరు పరిధిలో 60 KM రాష్ట్ర రోడ్ల బాగుకు రూ.1.14 కోట్లు, 220 KM జిల్లా రోడ్ల మరమ్మతులకు రూ.2.90 కోట్లు అవసరమని గుర్తించారు. మొత్తంగా రూ.4.04 కోట్లు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలోని నర్రవాడ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వెంగమాంబ అమ్మవారి 16 రోజుల పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేక పుష్పాలంకరణతో గ్రామంలో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కార్య నిర్వహణ అధికారి ఉషశ్రీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
వారిది సాధారణ రైతు కుటుంబం. చిన్నప్పుడే తండ్రి మృతి చెందాడు. తల్లి, సోదరుడి ప్రోత్సహంతో మనుషా రాష్ట్ర స్థాయి PG లాసెట్‌లో ఐదో ర్యాంకు సాధించింది. పొదలకూరు(M) లింగంపల్లి గ్రామానికి చెందిన గుండ్రా మస్తాన్‌రెడ్డి, మాధవిల కుమార్తె పదో తరగతి వరకు పొదలకూరు బాలికల ZP హైస్కూల్‌లో చదివింది. తిరుపతి SV యూనివర్సిటీలో LLB పూర్తి చేసి న్యాయవాదిగా పనిచేస్తోంది. న్యాయమూర్తి కావడమే లక్ష్యమని మనుషా పేర్కొంది.
అంధ్రవిశ్వవిద్యాలయంలోని జనాభా అధ్యాయన కేంద్రం గ్రోత్ రేట్ ఆధారంగా రాష్ట్రంలో ప్రస్తుత జనాభాను అంచనా వేసింది. దీని ప్రకారం రాష్ట్ర జనాభా 5,78,92,568 మంది ఉండగా 24,69,712 మంది జనాభాతో నెల్లూరు జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రతి 1000 మంది మగవాళ్లకు 985 మంది మహిళలు ఉన్నారు. అక్షరాస్యత 68.90 శాతంగా ఉంది.
నెల్లూరులోని బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు 70 మందితో కూడిన కమిటీని వక్ఫ్ బోర్డు సీఈవో అబ్దుల్ ఖాదర్ నియమించారు. కమిటీ అధ్యక్షులుగా ఎస్.కె ఖాదర్ బాషా, ఉపాధ్యక్షులుగా మహమ్మద్ రఫీ, షేక్ న్యాయమతుల్లా, ప్రధాన కార్యదర్శిగా ఎండి. కరిముల్లా, కార్యదర్శి షేక్ మునీర్ బాష, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా అక్బర్, మోహిద్, కరిముల్లా షరీఫ్ తో పాటు పలువురు సభ్యులుగా ఉంటారు.
నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు వచ్చే భక్తుల సౌకర్యం మేరకు ఆర్టీసి బస్సులు తిప్పనున్నట్లు ఆర్ఎం విజయరత్నం తెలిపారు. జిల్లా బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ ఈ నెల 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లా నలుమూలల నుంచి దర్గా వరకు 44 ప్రత్యేక బస్సులను తిప్పనున్నట్లు ఆర్ఎం చెప్పారు. ఈ బస్సుల్లో సాధారణ చార్జీలే వసూలు చేస్తామని ప్రకటించారు.
విజయవాడలోని శ్రీ కనకదుర్గ అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మకూరు ఎమ్మెల్యే, రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బుధవారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రములు, చిత్రపటం అందజేశారు. ఆలయం నందు జరుగుతున్న అభివృద్ధి పనులు గురించి ఈవో వివరించారు.
నాయుడుపేట మండల పరిధిలోని అత్తల పాలెం గ్రామానికి చెందిన పొట్టేలు వెంకటేశ్ (34) భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని క్షణికావేశంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్సలు చేయించి మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్సలు పొందుతూ మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశారు.
నెల్లూరు నగరంలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను నవాబ్ పేట పోలీసులు ఆట కట్టించారు. ఏఎస్పీ సిహెచ్ సౌజన్య మాట్లాడుతూ.. రాబడిన సమాచారం మేరకు ఐదుమంది ముద్దాయిలను అరెస్ట్ చేసి 2 కేజీల 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చి దిద్దటమే లక్ష్యంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిఘా బృందాలతో నవాబ్ పేట ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.
చేజర్ల మండల పరిధిలోని ఆదూరుపల్లి గ్రామంలో ఆత్మకూరు ఎమ్మెల్యే, రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జన్మదినం సందర్భంగా టీడీపీ నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మంత్రి ఫ్లెక్సీని ఓవ్యక్తి చించుతుండగా టీడీపీ నేత చీర్ల వెంకటేశ్వర్లు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తిపై చర్యలు తీసుకొని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
Sorry, no posts matched your criteria.