Nellore

News August 9, 2024

మంత్రి నారాయణ‌తో వైసీపీ కీలక నేతల భేటీ

image

మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణతో ఆయన క్యాంపు కార్యాలయంలో వైసీపీ నేత, కేంద్ర సహకార బ్యాంకు మాజీ ఛైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ భేటీ అయ్యారు. వారు పలు విషయాలపై చర్చించారు. ZP సమావేశానికి హాజరుకావాలని కోరినట్లు ఆనం దంపతులు తెలిపారు. మంత్రి నారాయణతో వారు భేటీ కావడంతో జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది.

News August 9, 2024

గూడూరు: KG నిమ్మ రూ.130

image

గూడూరు నిమ్మ మార్కెట్‌లో నిమ్మ ధరలు ఊపందుకున్నాయి. గత 4 రోజులుగా అత్యధికంగా రూ.90 నుంచి రూ.100 పలికాయి. గురువారం రూ.100పైగా అమ్ముడుపోవడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. బస్తా లూజు మొదటి రకం KG రూ.100 నుంచి రూ.130 చొప్పున, రెండో రకం KG రూ.60 నుంచి రూ.100 చొప్పున అమ్మకాలు జరిగాయి. శ్రావణమాసంలో దక్షిణ ప్రాంతాల వారు అధికంగా కొనుగోలు చేయడంతో నిమ్మధరలు పెరిగి ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

News August 8, 2024

నెల్లూరు ఎస్పీతో జడ్పీ ఛైర్‌పర్సన్ అరుణమ్మ భేటీ

image

నెల్లూరు జిల్లా కొత్త ఎస్పీ జి.కృష్ణకాంత్‌ను జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ ఎస్పీ క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం జిల్లా శాంతి భద్రతలపై వారు చర్చించారు. ఆమె వెంట నెల్లూరు జిల్లా మాజీ కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మెన్ ఆనం విజయకుమార్ రెడ్డి ఉన్నారు.

News August 8, 2024

గూడూరు: RTC కార్యాలయం వద్ద ఎన్ఎంయు ధర్నా

image

గూడూరులోని ఆర్టీసీ కార్యాలయం వద్ద నేడు NMUA ఆధ్వర్యంలో పలువురు నేతలు ధర్నా చేశారు. ఆ సంస్థ స్టేట్ సెక్రటరీ చెంచులయ్య మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల పట్ల డిపో మేనేజర్లు అనుచితంగా వ్యవహరిస్తున్నారని, వారిని వేధింపులు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ విధానాలను మానుకోవాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు.  

News August 8, 2024

నెల్లూరు జిల్లాలో దొంగలు బాబోయ్ దొంగలు

image

ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లా ప్రజలకు దొంగలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. బుధవారం రాత్రి రూరల్ పరిధిలోని దర్గామిట్టలోని ఓ ఇంట్లో సుమారు 2.3 లక్షల నగదు దోచుకెళ్లారు. అదేవిధంగా వేంకటేశ్వర పురంలోని విజయ డెయిరీ మాజీ ఉద్యోగి గోళ్ళ సుబ్బారావు ఇంట్లో బంగారం, వెండి, నగదు మొత్తం కలిపి రూ.10 లక్షల విలువ గల సొత్తు చోరీ జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

News August 8, 2024

గుంటూరు రేంజ్ పరిధిలో పలువురు సీఐలు బదిలీ

image

గుంటూరు రేంజ్ పరిధిలో పలువురు సీఐలు బదిలీపై నెల్లూరు జిల్లాకు వచ్చారు. నెల్లూరు నవాబుపేటకు అన్వర్ బాషా, దర్గామిట్టకు ఎం.రోశయ్య, ఆత్మకూరుకు జి.గంగాధర్ రావు, గూడూరు సర్కిల్ కు జి. మంగారావు, గూడూరు వన్ టౌన్‌కు కే. శేఖర్ బాబు, వాకాడుకు ఎస్.హెచ్ హుస్సేన్ బాషా, నాయుడు పేటకు ఎం.బాబీ, సుళ్లూరుపేటకు ఎం.మురళీకృష్ణ బదిలీ అయ్యారు. ఈ మేరకు గుంటూరు రేంజ్ ఐజి ఉత్తర్వులు జారీ చేశారు.

News August 8, 2024

కమ్మవారిపల్లిని దత్తత తీసుకొంటా: కురుగొండ్ల సింధు

image

డక్కిలి మండలం కమ్మవారిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సతీమణి సింధు బుధవారం ప్రకటించారు. కమ్మవారిపల్లి గ్రామంలో నిర్వహించిన టీడీపీ విజయోత్సవ సభలో మాట్లాడుతూ.. తన భర్త కురుగొండ్ల రామకృష్ణ జన్మించిన కమ్మవారిపల్లి (పాతనాలపాడు) గ్రామంలో మౌళిక వసతులు కల్పించడంతో పాటు జిల్లాలోనే ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతామన్నారు.

News August 8, 2024

నెల్లూరు: డీఎస్సీ గిరిజన అభ్యర్థులకు శుభవార్త

image

జిల్లాలో డీఎస్సీకి సిద్ధమవుతున్న గిరిజన అభ్యర్థులకు సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పరిమళ తెలిపారు. శిక్షణ సమయంలో భోజన వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 12వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నెల్లూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో వివరాలు ఇవ్వాలని తెలిపారు. వివరాలకు ఆఫీసు కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

News August 8, 2024

ప్రతిఒక్కరూ చేనేత వస్త్రాలను విరివిగా ధరించాలి: కలెక్టర్

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను చేనేత కార్మికులకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్‌ వద్ద మహత్మ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతిఒక్కరూ చేనేత వస్త్రాలను విరివిగా ధరించి, చేనేత కార్మికులకు అండగా నిలవాలన్నారు.

News August 7, 2024

రైల్వే మంత్రి అశ్విన్‌ను కలిసిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి

image

నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని కోరుతూ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ కి విజ్ఞప్తి చేశారు. బుధవారం కేంద్ర మంత్రిని ఎంపీ కలిసారు. ఈ మేరకు నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట రైల్వే సెంటర్‌ ప్రాధాన్యాన్ని వివరిస్తూ లేఖ అందించారు. అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను అందులో వివరించారు.