India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నెల్లూరు నగరం ఆకు తోటలోని ఓ ప్రభుత్వ మద్యం దుకాణంలో దొంగలు రెచ్చిపోయారు. సోమవారం రాత్రి మద్యం దుకాణంలోకి ప్రవేశించి సుమారు రూ.2.80 లక్షలు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా చోరీల పరంపర సాగుతుంది. పోలీసులు బదిలీలు, నియామకాల్లో బిజీగా ఉండగా దొంగలు చోరీల్లోనూ బాగా బిజీ అయ్యారన్న విమర్శలు ఉన్నాయి
దివ్యాంగురాలిపై అత్యాచారానికి యత్నంచిన ఘటన విడవలూరులో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన దివ్యాంగురాలు(17) తల్లిదండ్రులు చనిపోవడంతో తాత వద్ద ఉంటోంది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదే గ్రామానికి చెందిన Y శీనయ్య అత్యాచారానికి యత్నించాడు. దివ్యాంగురాలి బంధువుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI సాయిప్రసాద్ తెలిపారు.
జిల్లాలో నగదు మోసాలే అధికంగా జరుగుతున్నాయి. ఉమేష్ చంద్ర పోలీసు కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 119 మంది వారికి జరిగిన అన్యాయాలపై ఫిర్యాదులు చేశారు. వీటిలో రూ. 12 కోట్ల విరాళం ఇస్తామని రూ.18 లక్షలు కాజేసారని, స్నేహితులతో భాగస్వామిగా ఉన్న కంపెనీలో కుమారుడు చనిపోతే డబ్బులు ఇవ్వకుండా బెదిరిస్తున్నట్లు, రూ.8 లక్షలకు పసుపు అమ్మితే డబ్బులు ఇవ్వడంలేదని ఫిర్యాదులు వచ్చాయి.
నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి అప్పజెబుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. సోమవారం ఆయన మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డిని కలవడం ఇందుకు బలం చేకూరుతోంది. అధ్యక్ష పదవికి కాకాణి జిల్లా వ్యాప్తంగా మద్దతు కూడగడుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డికి రాష్ట్ర పదవి ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధావన్ స్సేస్ సెంటర్ షార్(శ్రీహరికోట)కు ఈ నెల 13న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నారు. ఇస్రో ఆధ్వర్యాన గత నెల 14 నుంచి ఈ నెల15 వరకు జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఒడిశా, పుదుచ్చేరి, తమిళనాడు, గుంటూరులలో ఈ కార్యక్రమాలు జరిపారు. షార్ వేదికగా ఈనెల 13న నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హజరుకానున్నారు.
నాయుడుపేట పట్టణంలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన చేపల అక్వేరియం దుకాణ యజమాని షేక్ నౌషాద్ పై పోలీసులు పొక్సో కేసు నమోదు చేసినట్లు సోమవారం రాత్రి పోలీసులు తెలిపారు. చిన్న దర్గా వీధిలో ఉంటున్న అక్వేరియం షాప్ వద్దకు వచ్చిన మైనర్ బాలికకు తినుబండరాలు ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి ఓ పాఠశాల ఆవరణంలో తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడినట్లు బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మొదటిసారి జరిగిన జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశంలో నెల్లూరు కలెక్టర్ ఓ ఆనంద్ పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా పరిధిలోని పలు అభివృద్ధి పనులు పెండింగ్ కార్యక్రమాల గురించి ఆయన కలెక్టర్ల సమావేశంలో ప్రస్తావించారు. నెల్లూరు జిల్లా అభివృద్ధి పనులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.
‘దిల్ దివానే’ ద్వారా హీరోగా పరిచయమైన సినీ హీరో రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలను నెల్లూరులో ఘనంగా నిర్వహించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ వేడుకలకు అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. రోహిత్ రెడ్డి తండ్రి, న్యాయవాది ఎం.రవీందర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ భానుశ్రీ, దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, మదన్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
ఇతర వెనుకబడిన తరగతుల (OBCs)సంక్షేమ పార్లమెంటు కమిటీకి జరిగిన ఎన్నికలలో రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు ఎన్నికయ్యారు. సోమవారం రాజ్యసభ పార్లమెంటరీ బుల్లెట్ అధికారికంగా ధ్రువీకరించిందని బీదా మస్తాన్ రావు తెలిపారు. మొదటి సిట్టింగ్ తేదీ నుంచి ఒక సంవత్సరం ఈ కమిటీలో సభ్యత్వం ఉంటుందన్నారు. బీద మస్తాన్ రావుతోపాటుగా 9 మంది పార్లమెంటు సభ్యులు కూడా ఈ కమిటీకి ఎంపికయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన విజయవాడలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లకు పరిపాలనకు సంబంధించి దిశా నిర్దేశం చేశారు. ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించాలని తెలియజేశారు.
Sorry, no posts matched your criteria.