India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో పరిశ్రమల హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం భూసేకరణను వేగవంతం చేస్తోంది. మొత్తం 4,800ల ఎకరాల్లో ఇప్పటి వరకు 672.279 ఎకరాలకు భూవార్డులు పాస్ అయ్యాయి. రైతులు ప్రభుత్వానికి సహకరించినందుకు కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుతో స్థానిక యువతకు వేలాది ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు జిల్లాకి ఆర్థిక బలం ఏర్పడనుందన్నారు.

ఉలవపాడు(M) కరేడులో తాజాగా 80 ఎకరాల భూ సేకరణకు అవార్డ్ పాస్ చేసినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం తెలిపారు. ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు కోసం కరేడులో 4,800 ఎకరాల భూ సేకరణ లక్ష్యంగా కాగా ఇప్పటి వరకు 672 ఎకరాలకు పరిహారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. భూ సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. పరిశ్రమల ఏర్పాటుతో కరేడు రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

గుడ్లూరు మండలంలో మంగళవారం రాత్రి నేషనల్ హైవేపై దారుణం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న ఓ కంటైనర్ వాహనం గొర్రెల మందను ఢీ కొట్టడంతో 50కి పైగా గొర్రెలు మృతి చెందాయని స్థానికులు తెలిపారు. మోచర్ల – వీరేపల్లి గ్రామాల మధ్య గొర్రెల మందను నేషనల్ హైవేపై క్రాస్ చేయిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వివరించారు. కేసు నమోదు చేయనున్నట్లు గుడ్లూరు పోలీసులు తెలిపారు.

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుధవారం అన్ని జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు RIO వర ప్రసాద్ తెలిపారు. నెల్లూరు కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు అన్నింటికీ సెలవు ప్రకటించినట్లు వివరించారు. ఉత్తర్వులు ఉల్లంఘించిన విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పురమిత్ర యాప్ ద్వారా మున్సిపల్ ఆన్లైన్ సేవలు సులభతరం అవుతాయని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైఓ నందన్
మంగళవారం తెలిపారు. పురమిత్ర ఫోన్ యాప్ ద్వారా వివిధ రకాల టాక్స్‌లు సులభంగా చెల్లించవచ్చన్నారు. https://play.google.com/store/apps/details?id=com.dreamstep.apcmmscitizen ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. దీని ద్వారా ఫిర్యాదులు కూడా చేయవచ్చని పేర్కొన్నారు.

నెల్లూరు కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రాజా బాలాజీ రావు తెలిపారు. వాతావరణ శాఖ వర్ష సూచనలు ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆయా మండలాల విద్యాధికారులు పాఠశాలలకు సమాచారాన్ని తెలియజేయాలని సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

కావలిలోని బుడంగుంట రైల్వే గేటు సమీపంలో మంగళవారం రైలు కిందపడి మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. రైలు పట్టాలపై మహిళ మృతదేహం పడి ఉండడాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలికి సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉంటుందన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు, మృతురాలు పూర్తి వివరాలు తెలియాల్సింది.

కందుకూరులో పోలీసులు చాలా అతి చేస్తున్నారని YCP మండిపడింది. ‘TDPగూండాల చేతిలో దారుణ హత్యకి గురైన లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న YCP నేత అంబటి మురళిని పోలీసులు అడ్డుకున్నారు. నిందితులు టీడీపీ నేతలే కావడంతో ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయట్లేదు. అఖరికి పరామర్శకు సైతం దూరం చేస్తూ కాపులపై కక్ష సాధిస్తున్నావా చంద్రబాబు’ అని వైసీపీ ప్రశ్నించింది.

కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ(VSU) గర్ల్స్ హాస్టల్లో సోమవారం రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో కరెంటు సరఫరా నిలిచిపోయింది. విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే వర్సిటీ అధికారులు స్పందించి ఆడిటోరియం, ఏయూ బిల్డింగ్ ఇతర ప్రాంతాల్లో వసతి కల్పించారు. కరెంట్ లేకపోవడంతో మంగళవారం సెలవు ప్రకటించారు. ఇవాళ ఉదయం మెకానిక్‌లను పిలిపించి సరఫరా పునరుద్ధరించారు. జనరేటర్ లేకపోవడంపై విమర్శలు వచ్చాయి.

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయానికి వరద నీరు చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 77.98 టీఎంసీలు. జలాశయం నిండిన తర్వాత ఒకేసారి నీటిని విడుదల చేయకుండా.. ముందస్తు ప్రణాళికలో భాగంగా కొంతమేర నీటిని విడుదల చేస్తామని సీఈ వరప్రసాద్ వెల్లడించారు. అవసరాన్ని బట్టి నీటి విడుదల ఉంటుందన్నారు. ప్రస్తుతం జలాశయంలో 71 టీఎంసీల నీరు ఉండగా.. ప్రాజెక్టుకు ప్రమాదం లేదని స్పష్టం చేశారు.
Sorry, no posts matched your criteria.