Andhra Pradesh

News March 17, 2024

జిల్లా వ్యాప్తంగా 11,587 మంది అభ్యర్థులకు గ్రూప్-1 పరీక్ష

image

ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఆదివారం గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 33 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ గౌతమీ తెలిపారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 11,587 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. ఆ నంబర్‌కు ఫోన్‌ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చన్నారు.

News March 17, 2024

విజయనగరం: సిట్టింగులకే ఛాన్స్

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలనే వైసీపీ మళ్లీ అభ్యర్థులుగా ప్రకటించింది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో గెలిచిన 9 మందిలో బొత్స సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి, పీడిక రాజన్నదొరకి జగన్ కేబినెట్‌లో చోటు ఇచ్చారు. కోలగట్ల వీరభద్రస్వామికి డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం ఇచ్చారు. శంబంగి చినఅప్పలనాయుడు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో వీరి గెలుపుపై మీ కామెంట్

News March 17, 2024

కోనసీమ గడ్డ నుంచి సీఎం జగన్ ప్రచారం.. 19న సభ

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తొలిసారిగా కోనసీమ గడ్డ నుంచి సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ నెల 19వ తేదీన కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో నిర్వహించనున్న వైసీపీ బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. స్థానిక ఆకుల వీర్రాజు విగ్రహం వద్ద మహాత్మాగాంధీ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సభ జరగనుందని కొత్తపేట MLA, వైసీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు.

News March 17, 2024

ప.గో.: నేతలకు పరీక్ష.. పాస్ అయ్యేదెవరు..?

image

ఎన్నికల్లో బరిలో నిలిచే నాయకుల జీవితాన్ని జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థితో పోలిస్తే..ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు (జాబ్ నోటిఫికేషన్). నిన్నటి నుంచి 57రోజుల పాటు ప్రిపరేషన్‌ (ప్రచారానికి) సమయం. మే 13న పరీక్ష(ఓటింగ్). ఆ తర్వాత 22 రోజులకు జూన్ 4న ఫలితాలు. ఉమ్మడి ప.గో. జిల్లాలో 15 స్థానాలకు(పోస్టులకు) ఎంతమంది పరీక్ష రాస్తారన్నది తేలాలి. ఏప్రిల్ 25 వరకు పరీక్షకు అప్లై (నామినేషన్) చేసుకోనున్నారు.

News March 17, 2024

పది పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు : ఎస్పీ

image

అనకాపల్లి జిల్లాలో సోమవారం నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పటిష్ఠ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్టు ఎస్పీ కేవీ మురళీకృష్ణ శనివారం తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పదో తరగతి పరీక్షలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాల న్నారు.పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ పక్కాగా అమలయ్యేలా పోలీస్ అధికారులు దృష్టి కేంద్రీకరించాలన్నారు.పరీక్షా కేంద్రాలు వద్ద జన సమూహాలు ఉండకూడదన్నారు.

News March 17, 2024

చిలకలూరిపేట సభకు మోదీ పర్యటన వివరాలు

image

మండలంలోని బొప్పూడి వద్ద నేడు జరగనున్న టీడీపీ కూటమి బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. సభకు ప్రధానమంత్రి మోదీ హాజరవుతారు. ఆదివారం సాయంత్రం 4. 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడకు వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 5 నుంచి 6 గంటల వరకు ప్రసంగిస్తారు. 6.10 గంటలకు తిరుగుపయనమవుతారు. 6.55 గంటలకు గన్నవరం చేరుకొని, 7:00 గంటలకు హైదరాబాద్ వెళతారు.

News March 17, 2024

విశాఖ: పలు రైళ్ల రద్దు.. కొన్ని దారి మళ్లింపు

image

దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు కొన్నింటిని దారి మళ్లించినట్లు వాల్తేరు డీసీఎం ఏకె. త్రిపాఠి తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 28వ తేదీ వరకు మచిలీపట్నం-విశాఖ (17219), విశాఖ- గుంటూరు- (22701), గుంటూరు-విశాఖ (22702) ఉదయ్ ఎక్స్‌ప్రెస్, ఏప్రిల్ 2 నుంచి 29 వరకు విశాఖ- మచిలీపట్నం (17220) రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. మరికొంటిని దారి మళ్లించారు.

News March 17, 2024

శింగనమల: మాజీ ఎంపీపీ ఉమాపతి నాయుడు టీడీపీకి రాజీనామా

image

తెలుగుదేశం పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎంపీపీ నల్లపాటి ఉమాపతి నాయుడు తెలిపారు. ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ.. శింగనమల నియోజకవర్గం టీడీపీలో మితిమీరిన గ్రూపు తగాదాల కారణంగా పార్టీలో పనిచేయ లేని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. పార్టీ అధినేత చంద్రబాబు అందరినీ కలుపుకొని తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని చెబుతున్నా.. ఇక్కడ నాయకులు విస్మరిస్తున్నారన్నారు.

News March 17, 2024

వాలంటీర్లు రూల్స్ అతిక్రమిస్తే ఇంటికే: కడప కలెక్టర్

image

గ్రామ/వార్డు వాలంటీర్లు రాజకీయ నేతలతో తిరిగిన, పార్టీలకు అనుకూలంగా ప్రచారం చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ విజయరామరాజు హెచ్చరించారు. కడపలో శనివారం ఎస్పీ, కమిషనర్‌తో కలిసి ఈ వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్నారు. వాలంటీర్లు రూల్స్ అతిక్రమించినట్లు ఎవరైన ఫిర్యాదు చేస్తే వారిని తక్షణమే విధుల నుంచి తొలగిస్తామన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలన్నారు.

News March 17, 2024

కర్నూలు: ఈనెల 20న సీఎం జగన్ రాక

image

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 20న సీఎం జగన్ ఆలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు పార్టీ కార్యాలయం వెల్లడించింది. ఆలూరు నియోజకవర్గంలో రెండు దఫాలుగా వైసీపీ విజయం సాధిందించి. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను కాదని విరుపాక్షికి టికెట్ కేటాయించడంతో మూడోసారి వైసీపీ జెండా ఎగరాలని సీఎం పర్యటిస్తున్నట్లు నాయకులు చర్చించుకుంటున్నారు.