Prakasam

News April 2, 2025

దివావకరపల్లిలో మంత్రి నారా లోకేశ్ పర్యటన సాగేదిలా

image

పెదచెర్లపల్లి మండలం దివాకరపల్లిలో మంత్రి నారా లోకేశ్ రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్‌కు నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.. ఉదయం 7:15 నిమిషాలకు ఉండవల్లి నుంచి బయలుదేరుతారు. 9:15కు దివాకరపురం హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 9: 25 నిమిషాలకు బయోగ్యాస్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం 11:45 వరకు సభలో పాల్గొంటారు. 11:55 నిమిషాలకు అక్కడ నుంచి బయలుదేరి వెళ్తారు.

News April 1, 2025

ప్రకాశం: పింఛన్ నగదు మాయం

image

పింఛన్ నగదు మాయం కావడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కేతగుడిపి సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లిక మార్కాపురంలోని బ్యాంక్‌లో శనివారం పింఛన్ నగదు రూ.15.38 లక్షలు విత్ డ్రా చేశారు. ఆటోలో వస్తుండగా పింఛన్ నగదు మాయమైంది. ఈ మేరకు ఆమె మార్కాపురం పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. సంబంధిత సచివాలయం వద్ద లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు.

News April 1, 2025

పెదచెర్లోపల్లి: అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

పెద చెర్లోపల్లి మండలంలో దివాకరపురం గ్రామంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మంగళవారం పర్యటించారు. గ్రామంలో బుధవారం రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపనకు మంత్రి నారా లోకేశ్, అనంత్ అంబానీలు వస్తున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ఉగ్రతో కలసి ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కార్యక్రమానికి తరలి వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, సమన్వయంతో పనిచేసి కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు.

News April 1, 2025

రేపు ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన

image

ఒంగోలు కలెక్టరేట్ వద్ద బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు జిల్లా ఫ్యాఫ్టో చైర్మన్ ఎర్రయ్య మంగళవారం తెలిపారు. ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలని, అలాగే 30% ఐఆర్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. సీపీఎస్, జీపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పద్ధతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు

News April 1, 2025

ప్రకాశం: నేటి నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం

image

జిల్లాలో నేటి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం తరగతులు ప్రారంభిస్తున్నట్లు ప్రకాశం జిల్లా అధికారులు తెలిపారు. ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఏప్రిల్ 7 నుంచి మే 31వ తేదీ వరకు ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చని తెలిపారు. జూన్ 1 నుంచి ప్రారంభం కావలసిన ఇంటర్ తరగతులు ఈ ఏడాది 2 నెలల ముందే ప్రారంభమయ్యాయి.

News April 1, 2025

ప్రకాశం: నేడు సోషల్ పరీక్ష

image

ప్రకాశం జిల్లాలోని 10వ తరగతి విద్యార్థులకు సోషల్ స్టడీస్ పరీక్షను షెడ్యూల్ ప్రకారం మంగళవారం నిర్వహిస్తున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. విద్యార్థులు ఎలాంటి అనుమానాలు లేకుండా పరీక్షకు హాజరు కాగలరన్నారు.

News March 31, 2025

ప్రకాశం: ఇవాళ అర్ధరాత్రి వరకే ఛాన్స్

image

ఉగాది సందర్భంగా దోర్నాల-శ్రీశైలం మార్గంలో ఈనెల 27 నుంచి 24 గంటలూ వాహన రాకపోకలకు అటవీశాఖ అధికారులు అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ(సోమవారం)అర్ధరాత్రి 12 గంటలకు మాత్రమే వాహన రాకపోకలకు అనుమతులు ఉంటాయని దోర్నాల ఫారెస్ట్ రేంజర్ జీవన్ కుమార్ తెలిపారు. 12 గంటల తర్వాత వాహనాలను నిలిపివేస్తామని చెప్పారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News March 31, 2025

నేడు YV సుబ్బారెడ్డి తల్లి పెద్దకర్మ.!

image

తన తల్లి పిచ్చమ్మకు సోమవారం పెద్దకర్మ నిర్వహిస్తున్నట్లు ఒంగోలు మాజీ ఎంపీ వై.వీ సుబ్బారెడ్డి తెలియజేశారు. భద్రతా కారణాల దృష్ట్యా స్వగ్రామం మేదరమెట్లలో కాకుండా.. ఒంగోలులో సౌత్ బైపాస్ రోడ్డు దగ్గర ఉన్న ఫంక్షన్ హాల్‌లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమానికి పిచ్చమ్మ అల్లుడు.. మాజీ మంత్రి బాలినేని. శ్రీనివాసరెడ్డి హాజరవుతారా, లేదా అనేది తెలియాల్సి ఉంది.

News March 31, 2025

మార్కాపురంలో క్షుద్ర పూజల కలకలం

image

మార్కాపురం దసరా మండపం సమీపంలో క్షుద్ర పూజలు ఆదివారం కలకలం రేపాయి. ఉగాది పండుగ రోజు అటుగా వెళ్లిన స్థానికులు పసుపు కుంకుమ, నిమ్మకాయలు కొబ్బెర చిప్పలు వేసి పూజలు చేసినట్లుగా గుర్తించారు. శనివారం అమావాస్య కావడంతో క్షుద్ర పూజలు జరిగాయని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పూజలు జరిగిన ప్రాంతంలో పంప్ హౌస్‌లో పని చేసేవారు ఈ విషయం తెలిసి ఆందోళన చెందారు. పోలీసులు పరిశీలించి విచారణ చేపట్టారు.

News March 30, 2025

ఒంగోలులో ఘనంగా ఉగాది వేడుకలు

image

ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి ఆకాంక్షించారు. ఒంగోలులోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఇందులో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, MLA విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

error: Content is protected !!