India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జగన్ పెట్టిన బకాయిలకు ఆయనే ధర్నాలకు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని మంత్రి స్వామి విమర్శించారు. ‘ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.4,271 కోట్ల బకాయి పెట్టింది జగన్ కాదా? ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని చెప్పడానికి.. ఇలా ధర్నాకు పిలుపు ఇవ్వడమే నిదర్శనం. వైసీపీ హయాంలో ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు కూడా లేదు. మేము ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తుండటంతో ధర్నాలు చేసుకుంటున్నారు’ అని మంత్రి అన్నారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. మార్కెట్లు, దుకాణాల వద్ద ఇందుకు అవసరమైన ప్రత్యామ్నాయాలు కల్పించాలని చెప్పారు. బుధవారం అమరావతి సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా టంగుటూరు మండలానికి చెందిన గడ్డం కవిత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గ్రామీణ అభివృద్ధి సంస్థ జిల్లా డైరెక్టర్ నారాయణ తెలిపారు. ఒంగోలులోని టీటీడీసీ కార్యాలయంలో బుధవారం జరిగిన జిల్లా సమాఖ్య అధ్యక్షురాలి ఏన్నికల్లో 38 మండలాలకు చెందిన మండల సమాఖ్య అధ్యక్షులు, ఆఫీస్ బేరర్స్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ.. ఎన్నికకు కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల పున: పరిశీలన ప్రక్రియ ఎలాంటి తప్పులు లేకుండా నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. బుధవారం జిల్లాలో జరుగుతున్న నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల పున: పరిశీలన ప్రక్రియ పురోగతిపై మండలాల రెవెన్యూ అధికారులతో సమీక్షించి, వారికి దిశానిర్దేశం చేశారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఎస్పీ ఏఆర్ దామోదర్ తనిఖీ చేశారు. కంట్రోల్ రూమ్‌లో అత్యవసర సేవలు అందిస్తున్న శక్తి యాప్ పనితీరు గురించి ఆరా తీశారు. ఎస్పీ స్వయంగా తన ఫోన్ నుంచి SOSకు కాల్ చేసి సిబ్బంది ఎలా స్పందిస్తున్నారని పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చే అన్ని కాల్స్‌కు రెస్పాండ్ కావాలని సిబ్బందికి సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని చెప్పారు.
గిద్దలూరులోని స్థానిక రైల్వే స్టేషన్‌లో బుధవారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలు పైకి ఎక్కాడు. అనంతరం పైన ఉన్న హై వోల్టేజ్ కరెంట్ వైర్‌ను పట్టుకున్నాడు. దీంతో షాక్ తగిలి కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రైల్వే పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
ప్రకాశం జిల్లాలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నూతనంగా 57 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను నెలకొల్పుతున్నట్లుగా, విద్యాశాఖ ప్రతిపాదనలు పంపగా జిల్లా కలెక్టర్ వాటిని ఆమోదించారు. మరో నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా ఇప్పటికే ఎంఈఓలు, డిప్యూటీ ఈఓలు నివేదికను తీసుకొని ఎక్కడెక్కడ పాఠశాలలను నెలకొల్పాలో, ఓ అంచనాతో విద్యాశాఖ నివేదిక రూపంలో వాటిని అధికారులకు సమర్పించనున్నారు.
నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూముల పున: పరిశీలన పటిష్టంగా చేపట్టాలని సీసీఎల్‌ఏ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు. అమరావతి నుంచి ఆమె అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. జయలక్ష్మి మాట్లాడుతూ.. నిషేధిత భూముల జాబితాలో నుంచి తొలగించిన భూములు చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయ్యాయా లేదా పూర్తిస్థాయిలో పరిశీలన జరగాలన్నారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లాలో సైబర్ నేరగాళ్లు కొత్తరకం స్కాములకు పాల్పడుతున్నారు. తాజాగా గిద్దలూరులో కొందరికి సైబర్ నేరగాళ్లు స్పీడ్ పోస్ట్‌లో లక్కీ డ్రా గెలుచారని పోస్టు పంపించారు. కొరియర్ తెరిచి చూడగా లక్కీ డ్రాలో రూ.14,49,000 గెలుచుకున్నారని, ఈ డబ్బు అకౌంట్లో బదిలీ చేయాలంటే రూ.15వేల అమౌంట్ బదిలీ చేయాలని కోరుతున్నట్లు సమాచారం. ఇలాంటి వాటిపై స్పందించి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని అధికారులు సూచిస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో సైబర్ నేరగాళ్లు కొత్తరకం స్కాములకు పాల్పడుతున్నారు. తాజాగా గిద్దలూరులో కొందరికి సైబర్ నేరగాళ్లు స్పీడ్ పోస్ట్‌లో లక్కీ డ్రా గెలుచారని పోస్టు పంపించారు. కొరియర్ తెరిచి చూడగా లక్కీ డ్రాలో రూ.14,49,000 గెలుచుకున్నారని, ఈ డబ్బు అకౌంట్లో బదిలీ చేయాలంటే రూ.15వేల అమౌంట్ బదిలీ చేయాలని కోరుతున్నట్లు సమాచారం. ఇలాంటి వాటిపై స్పందించి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని అధికారులు సూచిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.