India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రకాశం జిల్లాలోని యువత ఉపాధి పొందేందుకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రతిష్ఠాత్మకమైన సెంచూరియన్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. ఈ మేరకు సదరు యూనివర్సిటీతో జిల్లా యంత్రాంగం మంగళవారం కలెక్టర్ పీ.రాజబాబు ఆధ్వర్యంలో అవగాహన ఒప్పందం(MOU) చేసుకుంది. జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లలో నిరుద్యోగ యువతీయువకులకు ప్రాధాన్య విభాగాలలో శిక్షణ ఇవ్వనున్నారు. SHARE IT.

వెలిగండ్ల మండలంలో 5 ఏళ్ల బాలికపై అత్యాచారం యత్నానికి పాల్పడిన నిందితుడికి ఒంగోలు POCSO కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించింది. బాధితురాలికి రూ.75,000 పరిహారం DLSA ద్వారా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. పోలీసుల సమర్థవంతమైన దర్యాప్తుతో నేరం నిరూపితమై శిక్ష పడిందని జిల్లా SP హర్షవర్ధన్ రాజు తెలిపారు. పిల్లలు, మహిళలపై నేరాలకు పాల్పడేవారిని చట్టం వదిలిపెట్టదని హెచ్చరించారు.

లారీ టైర్ కింద పడి పసి బాలుడు మృతి చెందిన ఘటన బల్లికురవ మండలం చిన్న జమ్మలమడకలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. పరిమి యేసయ్య, శిరీష కుమారుడు రెడీ పాల్ (3) రోడ్డుపై ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు లారీ టైర్ కింద మృతి చెందాడు. ముక్కుపచ్చలారని పసి బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలోని గుండమాల గ్రామపంచాయతీకి జాతీయ పంచాయతీ రాజ్ అవార్డులో గుర్తింపు లభించింది. ‘సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ విభాగంలో ఉత్తమ గ్రామపంచాయతీగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసినట్లు సంబంధిత అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ విజయానికి సహకరించిన జిల్లా పంచాయతీ అధికారులు, జడ్పీ సీఈవోకు ఎంపీడీవో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్ విజయ సునీతను మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో బీజేపీ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన మార్కాపురం పలకను ఆమెకు అందజేశారు. పలక పరిశ్రమకు ఊతం ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు. అలాగే కొన్ని సమస్యలు వివరించి అవి పరిష్కారమయ్యేలా చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో శాసనాల సరోజినీ, బొంతల కృష్ణ, జీవీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. ప్రకాశం భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో అర్హులైన దివ్యాంగులకు 6 ట్రైసైకిళ్లు, 2 వీల్‌చైర్లు, 4 వినికిడి పరికరాలను పంపిణీ చేశారు. ఈ పరికరాలు వారి దైనందిన జీవనంలో సహాయకరంగా ఉంటాయని పేర్కొన్నారు. దివ్యాంగుల అవసరాలను గుర్తించి మరింత సహాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో సోమవారం రాత్రి కూడా పోలీసులు హైవేలపై తనిఖీలు చేపట్టారు. డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలతో పాటు బస్సులో రక్షణ పరికరాలను పరిశీలించి ప్రమాదాల నివారణకు డ్రైవర్లకు పలు సూచనలు చేశారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి. మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో సోమవారం రాత్రి కూడా పోలీసులు హైవేలపై తనిఖీలు చేపట్టారు. డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలతో పాటు బస్సులో రక్షణ పరికరాలను పరిశీలించి ప్రమాదాల నివారణకు డ్రైవర్లకు పలు సూచనలు చేశారు.

వరికుంటపాడు (M) తిమ్మారెడ్డిపల్లి సమీపంలోని తిరగల దిన్నె వద్ద ఆగి ఉన్న లారీని మ్యాజిక్ వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని హుటాహుటిన కందుకూరు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన సోమవారం రాత్రి ప్రకాశం, నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

బళ్లమిట్టకు చెందిన టి. విజయ ఆటోలో ప్రయాణించి గాంధీ రోడ్ వద్ద దిగేటప్పుడు రూ.50,000 నగదు, తాళాలు ఉన్న పర్సును మర్చిపోయారు. విషయం తెలియజేయగా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది వెంటనే స్పందించి సీసీటీవీ ఆధారంగా ఆటోను గుర్తించారు. ఆటో యజమానిని సంప్రదించగా పర్సు ఆటోలోనే ఉన్నట్లు తెలిసింది. అనంతరం ట్రాఫిక్ సీఐ జగదీష్ సమక్షంలో పర్సును బాధితురాలికి అప్పగించారు.
Sorry, no posts matched your criteria.