India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్కుల ఏర్పాటుకు అవసరమైన భూములను గుర్తించాలని సీఎస్ ఆదేశించారు.
తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీవిత బీమా పాలసీలను సేకరించుటకు ఏజెంట్ల ఎంపిక ప్రక్రియ ఈనెల 22వ తేదీన నిర్వహిస్తున్నట్లు పోస్టల్ సీనియర్ సూపర్డెంట్ జాఫర్ సాదిక్ తెలిపారు. ఒంగోలులోని తపాల శాఖ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. 10వ తరగతి ఉత్తీర్ణులై, 18 సంవత్సరాలు నిండిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు భాగ్యనగర్ రెండవ లైన్‌లో ఉన్న పోస్ట్‌ఆఫీస్ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
ప్రకాశం జిల్లాకు శుక్రవారం మోస్తారు వర్ష సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ గురువారం ప్రకటన జారీ చేసింది. కర్ణాటక నుంచి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ప్రకాశం జిల్లాకు ఉరుములు మెరుపులతో కూడిన వర్ష సూచన ఉన్నట్లు ఆ ప్రకటన సారాంశం. అయితే గురువారం సైతం జిల్లాలోని పలు మండలాలలో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది.
ఒంగోలులోని డాక్టర్ పి. ఆనంద్ మినీ స్టేడియంలో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి టోర్నమెంట్ క్రీడాకారుల ఎంపికకు మొత్తం 600 మంది క్రీడాకారులు హాజరైనట్లు హాకీ అసోసియేషన్ సెక్రటరీ సుందర రామిరెడ్డి తెలిపారు. క్రీడాకారుల ఎంపికై నిర్వహిస్తున్న క్రీడలను డీఆర్వో ఓబులేసు, డీఈఓ కిరణ్ ప్రారంభించారు. జోనల్ లెవెల్ లో ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నారు.
మద్యం మత్తులో వాహనాలు నడిపి జీవితాలను చిత్తు చేసుకోవద్దని ప్రకాశం ఎస్పీ దామోదర్ కోరారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లు చేస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తనిఖీలు కొనసాగిస్తామని చెప్పారు. మైనర్లు వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.
మార్కాపురంలో ప్రభుత్వ అధికారుల తీరుపై చాలా ఆరోపణలు వస్తున్నాయి. పనికి ఆహారం పథకం కింద ఓ కాంట్రాక్టర్‌కు రూ.కోటి పనులు ఇవ్వడంలో మార్కాపురం DLPO బాలూనాయక్ అవకతవలకు పాల్పడినట్లు విచారణలో తేలడంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రి మత్తు డాక్టర్ డ్యూటీకి సరిగా రాకపోవడంపైనా విచారణ జరుగుతోంది. ఓ జడ్పీ స్కూల్ HMకు సైతం ఇటీవల నోటీసులు వచ్చిన విషయం తెలిసిందే.
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్ట్‌కు మరో గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ప్రకాశం జిల్లాలో పొదిలి, పామూరు, కనిగిరి, దర్శి రైల్వే స్టేషన్ల నిర్మాణంపై ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇటీవల ట్రయల్ ట్రైన్ కూడా రావడంతో ఈ ప్రాజెక్టుపై ఆశలు మరింత చిగురించాయి. ఈ పనులకు సంబంధించి ప్రభుత్వ భూములను రైల్వే శాఖకు అప్పగించాలని నిర్ణయించడంతో ప్రాజెక్ట్ మరింత స్పీడ్ కానుంది.
రాష్ట్రంలో నూతన రైల్వే లైన్ల ఏర్పాటు గురించి బుధవారం జరిగిన పార్లమెంట్ సమావేశంలో ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. ఎంపీ ప్రశ్నకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిస్తూ.. నూతన రైల్వే లైన్ల మంజూరు అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం కడప – బెంగళూరు రైల్వే లైను నిర్మాణంలో ఉందని, త్వరలోనే పూర్తవుతున్నట్లు మంత్రి సమాధానమిచ్చారు.
పోక్సో కేసులో ఓ టీచర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. గిద్దలూరు మండలానికి చెందిన బాలిక కలసపాడులో చదువుతుండగా టీచర్ వీరయ్య తరచూ వేధించేవాడు. బాలిక ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించేవాడు. 2018లో పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా నేరం రుజువు కావడంతో 20 ఏళ్ల జైలు శిక్ష, 15 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువడింది. దీంతో సిబ్బందిని ఎస్పీ దామోదర్ అభినందించారు.
ఆ కుటుంబానికి కొత్త కారు కొన్న ఆనంద క్షణాలు గంటలు కూడా నిలవలేదు. జరుగుమల్లి మండలం చిర్రికూరపాడుకు చెందిన ప్రవీణ్ కుమార్ హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. వారం క్రితం కొత్త కారు కొనుగోలు చేసి స్వగ్రామానికి వచ్చారు. ఓ శుభకార్యంలో పాల్గొని అదే కారులో సోమవారం రాత్రి హైదరాబాదుకు వెళ్తుండగా చౌటుప్పల్ వద్ద కారును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తల్లి గోవిందమ్మ మృతి చెందగా, ప్రవీణ్ అతని భార్యకు గాయాలయ్యాయి.
Sorry, no posts matched your criteria.