Prakasam

News August 5, 2025

ప్రకాశం: మీ కోసం కార్యక్రమానికి 67 ఫిర్యాదులు

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి 67 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటించింది. ఎస్పీ దామోదర్ నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు వచ్చి అర్జీలు అందించారన్నారు. అర్జీదారుల సమస్యలను ఎస్పీ అడిగి తెలుసుకుని, ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత పోలీస్ స్టేషన్‌ల సిబ్బందిన ఆదేశించారు.

News August 4, 2025

ప్రకాశం: బ్రో మీకు ఎన్ని మార్కులొచ్చాయి..?

image

ఏపీ కానిస్టేబుల్ ఫైనల్ స్కోర్ కార్డ్ గురువారం విడుదలైన విషయం తెలిసిందే. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా కానిస్టేబుల్ అభ్యర్థుల్లో ఫుల్ టెన్షన్ నెలకొంది. ఎన్ని మార్కులొచ్చాయి? కటాఫ్ ఎంత ఉండొచ్చనే చర్చ అభ్యర్థుల్లో నడుస్తోంది. మరి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, మన జిల్లాలో కటాఫ్ ఎంత ఉండొచ్చని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News July 11, 2025

ఒంగోలు: రూ.20వేల సాయం.. 2రోజులే గడువు

image

కేంద్రం సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు ఇవ్వనుంది. జిల్లాలో 4.38లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకోగా రూ.2.72లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. ఇందులోనూ కొందరూ ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. అలాగే ఇంకా ఎవరైనా అర్హులుగా ఉంటే ఈనెల 13వ తేదీలోగా రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు సూచించారు

News July 11, 2025

ఒంగోలుకు రావడానికి ఇబ్బందులు..!

image

ప్రకాశం జిల్లాలోని పలు పల్లెల నుంచి ఒంగోలు రావడానికి సరైన సమయాల్లో బస్సులు లేవు. ఉదయం వేళలో స్కూల్‌, కాలేజీకి వెళ్లే విద్యార్థులు సైతం బస్సుల కొరతతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఉదయాన్నే 6 గంటలకు బస్సులు వస్తున్నాయి. ఆ తర్వాత 10పైనే బస్సులు అందుబాటులో ఉంటున్నాయి. 8 గంటల ప్రాంతంలో బస్సులు తిప్పాలని పలువురు కోరుతున్నారు. మీ ఊరికి ఇలాగే బస్సు సమస్య ఉంటే కామెంట్ చేయండి.

News July 10, 2025

కనిగిరి: జనసేనలో చేరిన దేవకి వెంకటేశ్వర్లు

image

కనిగిరికి చెందిన జాతీయ వాసవి సత్ర సముదాయాల ఛైర్మన్ దేవకి వెంకటేశ్వర్లు బుధవారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. వెంకటేశ్వర్లకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు మరి కొంతమంది ఆర్యవైశ్య ప్రముఖులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల వైసీపీకి వెంకటేశ్వర్లు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

News July 9, 2025

10 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నాను: గోపాలకృష్ణ

image

ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గోపాలకృష్ణ గొప్ప మనసు చాటుకున్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో బుధవారం పీ-4 పథకంపై ప్రత్యేక అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను కూడా 10 కుటుంబాలను దత్తత తీసుకోనున్నట్లు ప్రకటించారు. జిల్లాలో సుమారు 75 వేల బంగారు కుటుంబాలు ఉన్నాయని, వారికి మార్గదర్శకులను ఎంపిక చేయాలని ఆయన సూచించారు.

News July 9, 2025

ప్రకాశం జిల్లాలోని ఈ పాఠశాల్లో ఒక్కరు కూడా చేరలేదు.!

image

అత్యధికంగా HMపాడులో 10, కొమరులులో 8, CS పురంలో, కనిగిరి, రాచర్ల మండలాల్లో 5 స్కూళ్లల్లో అడ్మిషన్లు నమోదు కాలేదు. బీపేట, దర్శి, దొనకొండ, మద్దిపాడు, నాగులుప్పలపాడు, పొదిలి, సింగరాయకొండ, త్రిపురాంతంకంలో ఒక్కో స్కూల్లో ఎవరూ చేరలేదు. ఒంగోలు, టంగుటూరు మండలాల్లో 3, చీమకుర్తి, కొండపి, కురిచేడులో రెండేసి సూళ్లల్లో అడ్మిషన్లు లేవు.

News July 9, 2025

ఒంగోలు: 17 నెలల చిన్నారికి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌

image

ఒంగోలులోని సత్యనారాయపురానికి చెందిన చిన్నారి అంబటి ఖశ్విని ఎస్పీ దామోదర్ మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు. 17 నెలల వయస్సులోనే ఖశ్వి 24 వేర్వేరు కేటగిరీల్లో 650కి పైగా ఇంగ్లిష్ పదాలను మాట్లాడడంతో నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది. దీంతో చిన్న వయస్సులోనే అద్భుత రికార్డ్ సృష్టించిన చిన్నారిని, తల్లిదండ్రులను ప్రశంసించారు.

News July 9, 2025

బీఎల్ఓల భాద్యతే కీలకం: ఇన్‌ఛార్జి కలెక్టర్

image

పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించడంలో బీఎల్ఓల భాద్యతలు కీలకమని ఇన్ఛార్జి కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మంగళవారం బీఎల్ఓల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా భాద్యతలు నిర్వర్తించాలన్నారు.

News July 8, 2025

‘ఇళ్ల స్థలాలకు అర్హుల వివరాలు ఆన్‌లైన్ చేయాలి’

image

ఇంటి నివేశన స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మంగళవారం విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి ఇళ్ల స్థలాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ గోపాలకృష్ణ పాల్గొన్నారు. ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి మాట్లాడుతూ.. అర్హులైన వారి వివరాలు ఆన్లైన్ చేసి, ఆ తర్వాత స్థలాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.