Prakasam

News September 25, 2024

అభివృద్ధిలో మాగుంట కుటుంబానికి చెరగని ముద్ర: మంత్రి

image

మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ మృతి బాధాకరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. పార్వతమ్మ ఒంగోలు ఎంపీగా నాడు జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని, జిల్లా అభివృద్ధిలో మాగుంట కుటుంబం చెరగని ముద్ర వేసిందని అన్నారు. మాగుంట పార్వతమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

News September 25, 2024

మాగుంట పార్వతమ్మ రాజకీయ నేపథ్యం ఇదే..

image

ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో 1947 జూలై 27న జన్మించారు. 1967న మాగుంట సుబ్బరామ రెడ్డితో వివాహం జరిగింది. 1996 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఒంగోలు నుంచి పోటీ చేసి గెలిచి 11వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కావలి నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

News September 25, 2024

మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలు నెల్లూరులో

image

ఒంగోలు మాజీ MP మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి, కావలి మాజీ MLA మాగుంట పార్వతమ్మ నేడు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె పార్థివదేహాన్ని నెల్లూరు జిల్లా సరస్వతినగర్‌లోని ఆమె స్వగృహానికి తీసుకెళ్లనున్నట్లు కుటుంబీకులు తెలిపారు. మాగుంట అభిమానుల సందర్శనార్థం రేపు మధ్యాహ్నం వరకు వారి స్వగృహంలో ఉంచుతారు. 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

News September 25, 2024

ప్రకాశం జిల్లా నేతలకు కీలక పదవులు

image

ప్రకాశం జిల్లాలో నలుగురు కూటమి నేతలకు కీలక పదవులు దక్కాయి.
1. ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్- దామచర్ల సత్యనారాయణ
2. నూకసాని బాలాజీ – ఏపీ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్
3. లంకా దినకర్ – 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్
4. పాకనాటి గౌతమ్ రాజు- ఏపీ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ సభ్యుడు

News September 25, 2024

కనిగిరి: అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలన్న కలెక్టర్

image

కనిగిరిలోని పామూరు రోడ్డులో అసైన్మెంట్ భూముల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్లను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అసైన్మెంట్ భూముల్లో అక్రమ వెంచర్లు వేసిన వారిపై చర్యలు తీసుకొని, అసైన్మెంట్ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని రెవిన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు.

News September 24, 2024

ప్రకాశం జిల్లాలో మెగా జాబ్ మేళా.. వివరాలివే.!

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ- ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్, సీడప్- ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27న కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 20 కంపెనీలతో.. ‘మెగా జాబ్ మేళా’ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారులు భరద్వాజ్, రవితేజ తెలిపారు. 10వ తరగతి నుంచి ఏదైనా పీజీ పూర్తి చేసి, 18-35 ఏళ్లలోపు యువతీ, యువకులు అర్హులన్నారు. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 9988853335 కు సంప్రదించాలన్నారు.

News September 24, 2024

ప్రకాశం జిల్లాలో మెగా జాబ్ మేళా.. వివరాలివే.!

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ- ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్, సీడప్- ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27న కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 20 కంపెనీలతో.. ‘మెగా జాబ్ మేళా’ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారులు భరద్వాజ్, రవితేజ తెలిపారు. 10వ తరగతి నుంచి ఏదైనా పీజీ పూర్తి చేసి, 18-35 ఏళ్లలోపు యువతీ, యువకులు అర్హులన్నారు. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 9988853335 కు సంప్రదించాలన్నారు.

News September 24, 2024

ప్రకాశం జిల్లాకు అధిక ప్రాధాన్యత

image

రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల జాబితాలో ప్రకాశం జిల్లాకు ప్రాధాన్యం కనిపించింది. జిల్లా నుంచి ఏకంగా ముగ్గురికి నామినేటెడ్ పదవులు వరించాయి. తొలి జాబితాలో ఏ జిల్లాలోనూ ముగ్గురికి పదవులు దక్కలేదు. దామచర్ల సత్యకు AP మారిటైమ్ బోర్డ్ ఛైర్మన్, 20 సూత్రాల ఫార్ములా ఛైర్మన్‌గా లంకా దినకర్, నూకసాని బాలాజీకి AP టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పదవి వరించిన విషయం తెలిసిందే.

News September 24, 2024

ఒంగోలు: 108లో ఖాళీ పోస్టుల భర్తీకి మోక్షం

image

ప్రకాశం జిల్లాలోని 108 వాహనాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మోక్షం లభించింది. జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు 108 జిల్లా మేనేజర్ విజయకుమార్ తెలిపారు. డ్రైవర్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) పోస్టుల భర్తీకి అర్హులైన వారు ఈనెల 29 లోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈనెల 26న పాత రిమ్స్‌‌లోని కార్యాలయం దగ్గర డ్రైవింగ్ పరీక్ష కోసం హాజరుకావాలన్నారు.

News September 24, 2024

ప్రకాశం: ‘మేము వైసీపీలోనే ఉంటాం’

image

ప్రకాశం జిల్లాలో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సోమవారం కొత్తపట్నం మండల వైసీపీ నాయకులు పలువురు స్థానికంగా సమావేశమయ్యారు. ‘మేము వైసీపీ కార్యకర్తలం, ఈ పార్టీలోనే ఉంటాం, జనసేనలో చేరేదే లేదు’ అని తీర్మానం చేసినట్లు సమాచారం. తిరిగి 2029 జగన్‌ను సీఎం చేసుకోవడమే తమ లక్ష్యమని ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి ఈ సందర్భంగా చెప్పినట్లు తెలుస్తోంది.