Prakasam

News August 15, 2024

ఢిల్లీ స్వాతంత్ర్య వేడుకల్లో ప్రకాశం జిల్లా ఉపాధ్యాయిని

image

బల్లికురవ మండలం మల్లాయపాలెం అంగన్వాడీ కార్యకర్త జి నాగమణికి అరుదైన గౌరవం దక్కింది. ప్రధానమంత్రి నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. వేడుకలలో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్త నాగమణికి అవార్డును అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. అవార్డు అందుకున్న నాగమణిని పలువురు అభినందించారు.

News August 15, 2024

స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రకాశం

image

యావత్ భారతావనికి తెల్లదొరల నుంచి విముక్తి కలిగించిన మహా నాయకులు ఎందరో వారిలో ప్రకాశంకు చెందిన టంగుటూరి ప్రకాశం ఒకరు. ఈయన నాగులుప్పలపాడు వినోదరాయుడుపాలెంలో జన్మించారు. తెల్లదొరల పాలనలో వారి తుపాకీకి ఎదురుగా వెళ్లి కాల్చమని సవాలు చేసిన ధీరుడు ప్రకాశం. ఈయనకు ఆంధ్ర కేసరి అనే బిరుదు సైతం దక్కింది. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కూడా ప్రకాశం. అందుకే ఈ మహనీయుని బాటను నేడు స్మరించుకుందాం.

News August 15, 2024

ఒంగోలులో వాట్ నెక్స్ట్.. ఇదే జోరు చర్చ

image

ఒంగోలులో రాజకీయం ఒక్కసారిగా రసవత్తరంగా మారింది. మేయర్, డిప్యూటీ మేయర్, పలువురు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. అయితే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి శిష్యురాలిగా పేరుగాంచిన మేయర్ గంగాడ సుజాత పార్టీ మారడంపై వైసీపీలో కొంత విస్మయం వ్యక్తమైంది. బాలినేనిపై విమర్శలు చేస్తే చాలు రివర్స్ పంచ్ ఇచ్చే మేయర్ పార్టీ మారగా.. మిగిలిన క్యాడర్‌ను కాపాడుకొనేందుకు బాలినేని ఏం చేస్తారన్న చర్చలు జోరందుకున్నాయి.

News August 15, 2024

అంబేడ్కర్ గురించి మాట్లాడే అర్హత YS జగన్‌కి లేదు: గొట్టిపాటి

image

వైసీపీ నేతల తప్పుడు ప్రచారాలపై విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా ఆ పార్టీ నేతల తీరు మారలేదని అన్నారు. పేరుకు అంబేడ్కర్ విగ్రహం పెట్టి పెద్ద పెద్ద అక్షరాలతో తన పేరు రాయించుకుని తన ప్రచార పిచ్చిని చాటుకున్నట్లు తెలిపారు. అంబేడ్కర్ పేరు కన్నా జగన్ పేరు పెద్దగా ఉండటంతో అభిమానులు తొలగించి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

News August 15, 2024

ఒంగోలు: 700 మీటర్ల జాతీయ జెండా ర్యాలీ

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు దేశభక్తిని చాటేలా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. బుధవారం నగరంలో 700 మీటర్ల జాతీయ జెండా రాలీని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావుతో కలసి ప్రారంభించారు.

News August 14, 2024

కొండేపి: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

మండలంలోని దాసరెడ్డిపాలెం గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గురువారెడ్డి తన సొంత పొలంలో విద్యుత్ మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కొండేపి పోలీసులు అక్కడకు చేరుకొని విచారణ చేపట్టారు.

News August 14, 2024

TDP తీర్థం పుచ్చుకున్న YCP కార్పొరేటర్లు వీరే.!

image

ఒంగోలు MLA జనార్దన్ సమక్షంలో నేడు TDPలో చేరిన వారిన వారి వివరాలివే. మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ.. డివిజన్‌ల వారీగా 3వ డివిజన్‌లో షేక్ నూర్జహాన్, 13లో కొప్పర్ల కమలమ్మ, 16లో నాగం వెంకట శేషయ్య, 24లో బేతంశెట్టి శైలజ, 34లో ఆదిపూడి గిరిజ శంకర్, 40లో తేళ్ల చంద్రశేఖర్, 42లో కండె స్వాతి, 33లో పెద్దిరెడ్డి నియంత రెడ్డి, 47లో వేమూరి భవాని, 50వ డివిజన్‌లో అంబటి ప్రసాద్‌లు ఉన్నారు.

News August 14, 2024

వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన ఒంగోలు మేయర్

image

ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత బుధవారం ఒంగోలు MLA దామచర్ల జనార్దన్ సమక్షంలో TDPలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల TDP కండువాను కప్పి మేయర్‌ను పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల పలువురు కార్పొరేటర్లు సైతం టీడీపీలో చేరిన విషయం విదితమే. కాగా మేయర్ టీడీపీలో చేరిన నేపథ్యంలో వైసీపీకి భారీ షాక్ తగిలినట్లయింది.

News August 14, 2024

ఒంగోలు: బాక్సింగ్ పోటీలకు 52 మంది ఎంపిక

image

పీఎం జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థుల ప్రాంతీయ బాక్సింగ్ పోటీలు నగరంలో నేటితో ముగిశాయి. ఈ పోటీలలో 52 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులు సెప్టెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు హర్యానాలో జరుగు నవోదయ విద్యాలయాల జాతీయ బాక్సింగ్ క్రీడా పోటీలలో పాల్గొంటారు. ఈ పోటీలను దిగ్విజయంగా పూర్తి చేసిన పీఈటి పాండురంగారావు అనంతశ్రీని అభినందించారు.

News August 14, 2024

కనిగిరి: ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

image

కనిగిరిలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కనిగిరిలోని మోడల్ స్కూలుకు విద్యార్థులను తీసుకెళ్లే RTC బస్సు బుధవారం మొగుళ్లూరు పల్లి వద్ద ట్రాక్టర్ అడ్డు రావడంతో బస్సు రోడ్డు మార్జిన్‌లోకి ఒరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.