Prakasam

News August 12, 2024

తమిళనాడులో ఘోర ప్రమాదం.. ప్రకాశం వాసులు సేఫ్

image

తమిళనాడులోని తిరువళ్లూర్‌ జిల్లా తిరుత్తణి సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఐదుగురు మృతి చెందినట్లు వార్తలు రాగా జిల్లాలో విషాదం నెలకొంది. దీంతో చెన్నై SRMలో పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులంతా ఆందోళన చెందారు.<<13831591>> ప్రకాశం వాసులు చనిపోలేదని<<>>, పొదిలికి చెందిన కొల్లూరు చైతన్యకుమార్‌‌కు తీవ్ర గాయాలయ్యాయన్నారు.

News August 12, 2024

ప్రకాశం జిల్లాలో 1116 శివలింగాల ఆలయం ఇదే

image

జిల్లాలోని టంగుటూరు మండలం జమ్ములపాలెంలో 1116 శివలింగాలతో ఆలయం వెలసి ఉంది. ఈ ఆలయంలోనూ 1116 శివలింగాలతో పాటు, ప్రతి శివలింగానికి నాగుల పడగ ఉండడం మరో విశేషం. ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు తరలివస్తారు. ఈ ఆలయంలో ఒక్కసారి శివనామస్మరణ చేస్తే 1116 సార్లు చేసినంత పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

News August 11, 2024

ప్రకాశం జిల్లా TODAY TOP NEWS

image

➤ పొదిలి హత్య కేసులో.. భార్య అరెస్ట్
➤ బల్లికురవ: వాటర్ ట్యాంక్ పైనపడి చిన్నారి మృతి
➤ కొండేపి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
➤ కనిగిరి: మూగజీవాల ప్రాణాలు తీస్తున్న ప్లాస్టిక్ భూతం
➤ వెలిగండ్లలో దొంగల బీభత్సం
➤ తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి.. చివరికి మృతి
➤ కొరిశపాడు: 150 సంవత్సరాల మర్రిచెట్టు విశిష్టత ఇదే!
➤ ప్రతిభ చూపిన పొదిలి విద్యార్థులు
➤ తమిళనాడులో ఒంగోలు విద్యార్థులు ఐదుగురు మృతి

News August 11, 2024

కరాటే పోటీల్లో ప్రతిభ చూపిన పొదిలి విద్యార్థులు

image

విజయవాడలో ఆదివారం జరిగిన జాతీయస్థాయి కుంఫూ, కరాటే పోటీల్లో పొదిలి విద్యార్థులు ప్రతిభ కనపర్చారు. కరాటే మాస్టర్ కఠారి చిన్నరాజు వద్ద శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు పలు విభాగాల్లో కట్టాస్, స్పారింగ్లో బంగారు, రజత పతకాలు సాధించారు. స్పారింగ్లో పలు వయస్సుల విభాగాల్లో చిట్టెం షాలూమ్, జోయల్ జశ్వంత్, షేక్ సూఫియా బంగారం పతకాలు సాధించారు. దీంతో విద్యార్థులను పలువురు అభినందించారు.

News August 11, 2024

అద్దంకి: పాత మాగులూరు వద్ద రోడ్డు ప్రమాదం

image

సంతమాగులూరు మండలంలోని పాత మాగులూరు వద్ద ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బల్లికురవ మండలంలోని కొప్పెరపాలెం గ్రామానికి చెందిన కోటేశ్వరరావు ద్విచక్ర వాహనంపై నరసరావుపేట నుంచి ఇంటికి వస్తుండగా ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అతడిని స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకొని క్షతగాత్రుడిని నరసరావుపేట వైద్యశాలకు తరలించారు.

News August 11, 2024

ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ విభాగాన్ని పరిశీలించిన SP

image

ఒంగోలులో జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీస్ కార్యాలయంలో ఆదివారం జిల్లా ఎస్పీ తనిఖీ చేసి కార్యాలయంలో వివిధ విభాగాల పనితీరు, సిబ్బంది వివరాలు పరిశీలించారు. ఈ క్రమంలో పరేడ్ గ్రౌండ్, ఏఆర్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం, ఆయుధాగారంలో ఉన్న ఆయుధ సంపత్తి, మోటర్ ట్రాన్స్పోర్ట్ విభాగం, వ్యాయామశాల, సిబ్బంది బ్యారాక్, గార్డ్ రూములు తదితర విభాగాలను పరిశీలించి, విభాగాలరికార్డుల నిర్వహణపై ఆరా తీశారు.

News August 11, 2024

తల్లిదండ్రులకు తెలియకుండా పెళ్లి.. చివరికి మృతి

image

తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్న ఓ బీటెక్ విద్యార్థిని మృతి చెందిన ఘటన ఒంగోలులో చోటుచేసుకుంది. ఒంగోలుకు చెందిన ప్రియాంక అనే విద్యార్థిని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదివింది. అక్కడే శివకళ్యాణ్‌‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. గర్భం దాల్చిన యువతి అనారోగ్యంతో ఉండగా, ఒంగోలు తీసుకురాగా మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

News August 11, 2024

ఎన్డీఆర్ఎఫ్‌కి పందిళ్ళపల్లి వాసి సారథ్యం

image

వేటపాలెం మండలం పందిళ్ళపల్లి వాసి ఊటుకూరి వెంకట నాగ ప్రసన్న కుమార్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) విజయవాడ కేంద్రం కమాండెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తన పరిధిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఉంటాయని చెప్పారు. ఎక్కడైనా విపత్తులు జరిగినప్పుడు ప్రాణులను కాపాడటమే తమ ప్రధాన కర్తవ్యమన్నారు. ఎన్డీఆర్ఎఫ్‌లో పనిచేయడం దైవ కృప అన్నారు.

News August 11, 2024

సోషల్ మీడియాలో అనుచిత ప్రకటనలు చేస్తే చర్యలు: SP

image

సోషల్ మీడియా వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ గ్రూపులలో వినియోగదారులు, రాజకీయ నాయకులు పార్టీల మీద పోస్టులు, అనుచిత ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ శనివారం హెచ్చరించారు. అనుచిత ప్రకటనలపై గ్రూప్ అడ్మిన్లలదే పూర్తి బాధ్యతని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనుచిత పోస్టులు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

News August 11, 2024

కొండేపి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

image

కొండేపి మండలంలోని పెద్ద కల్లగుంట గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మరియమ్మ అనే మహిళను కట్టెల ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె ట్రాక్టర్ ట్రాలీ కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో స్థానికులు వెంటనే కొండేపి పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు.