India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ దామోదర్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పూజలు చేశారు. అనంతరం పోలీస్ సిబ్బందికి ప్రసాదాన్ని ఎస్పీ అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మెగా DSC-2025 మెరిట్ జాబితా అభ్యర్థులకు DEO కిరణ్ కుమార్ బుధవారం సూచనలు చేశారు.
➤మెరిట్ జాబితా AP-DSC వెబ్సైట్లో చూసుకోవాలి.
➤రేపటి నుంచి ఒంగోలు సరస్వతి జూనియర్ కాలేజీలో వెరిఫికేషన్.
➤అభ్యర్థులు లాగిన్ ఐడీతో కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవాలి.
➤5 ఫొటోలు, 3సెట్ల జిరాక్సులు, ఒరిజినల్ పత్రాలు తేవాలి.
➤సూచించిన తేదీలో హాజరు కాకుంటే అభ్యర్థిత్వం రద్దు చేస్తారు.
NOTE: సందేహాలుంటే కామెంట్లో తెలపండి.
ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ దామోదర్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పూజలు చేశారు. అనంతరం పోలీస్ సిబ్బందికి ప్రసాదాన్ని ఎస్పీ అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
డ్రోన్ కెమెరాలతో శాంతిభద్రతల పరిరక్షణ ఆధునిక పద్ధతులతో సాగుతుందని ఎస్పీ దామోదర్ అన్నారు. ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో మార్కాపురం మండలం కోల భీమినిపాడుకు చెందిన పోలిరెడ్డి డ్రోన్ కెమెరాను జిల్లా ఎస్పీకి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆ డ్రోన్ కెమెరాను మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్‌కు ఎస్పీ అందజేశారు. వెలిగండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడు తప్పిపోయిన ఘటనలో డ్రోన్ కెమెరా ఉపయోగపడిందన్నారు.
ప్రకాశం జిల్లాకు ఓపెన్ కేటగిరిలో కేటాయించబడ్డ 26 బార్ల దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగించినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి అయేషా బేగం తెలిపారు. ఒంగోలులోని జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో మంగళవారం ఆమె మాట్లాడారు. ముందుగా 28వ తేదీ గడువు ఉండగా, ప్రభుత్వం 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు పొడిగించినట్లు తెలిపారు. ఈ బార్లకు 30వ తేదీ ఉదయం 8 గంటలకు లాటరీ తీస్తామన్నారు. ఆసక్తిగలవారు దరఖాస్తులను సమర్పించాలని కోరారు.
ప్రకాశం జిల్లా ప్రజలకు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎస్పీ దామోదర్ మంగళవారం కీలక సూచన చేశారు. ముందుగా వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ, గణేష్ నిమజ్జనాల సందర్భంగా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే అవాంఛనీయ ఘటనలు, అపశృతులకు తావులేకుండా ప్రజలు పండగను ఆనందంగా జరుపుకోవాలన్నారు. ఏవైనా అనుకోని ఘటనలు తలెత్తితే.. 112, 100 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.
ఐదు రోజుల పాపను అమ్మాలని చూసిన కసాయి తండ్రి వద్ద నుంచి ప్రకాశం జిల్లా బాలల సంరక్షణ అధికారులు పాపను రక్షించిన ఘటన ఒంగోలులో మంగళవారం జరిగింది. మద్యానికి బానిసైన ఓ తండ్రి తన పాపను అమ్మాలని ప్రయత్నించాడు. ఈ ఘటనతో సమాచారం అందుకున్న అధికారులు వెంటనే పాపను తమ సంరక్షణలో ఉంచారు. అలాగే మరో ఆరు సంవత్సరాల బాలికను సైతం అధికారులు నేడు రామ్‌నగర్‌లోని శిశు గృహల్లో చేర్పించారు. అధికారులను కలెక్టర్ అభినందించారు.
ప్రకాశం జిల్లాలో విధులు నిర్వహిస్తూ వివిధ కారణాలతో మృతిచెందిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటామని జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. మంగళవారం ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో రిటైర్డ్, మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబాలతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల విధులు నిర్వహిస్తూ మృతి చెందిన కానిస్టేబుల్ మురళి కుటుంబ సభ్యులకు ఇన్సిడెంటల్ చార్జెస్ రూ.25వేల చెక్కును ఎస్పీ అందజేశారు.
ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 30న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు. ఒంగోలులోని ఉపాధి ఆఫీస్‌లో మంగళవారం ఆమె మాట్లాడారు. టాటా ఎలక్ట్రానిక్స్, హీరో మోటో కార్స్, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, రిలయన్స్ జియో ఇన్ఫో కం లిమిటెడ్ వంటి కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటాయన్నారు. 18 నుంచి 35ఏళ్ల యువతీ యువకులు పాల్గొనాలని, ఎంపికైనవారికి రూ.19500 జీతం ఉంటుందన్నారు.
ప్రకాశం జిల్లాలో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. పశ్చిమ ప్రకాశంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ వైరల్ ఫీవర్లు ఎక్కువయ్యాయి. చాలా మంది ఒంగోలు రిమ్స్‌కు తరలి వస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించి గ్రామాల్లో శిబిరాలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.