Prakasam

News November 10, 2024

ప్రకాశం: ‘ఆ SI శ్రమకి ఫలితం దక్కలేదు’

image

ప్రకాశం జిల్లా ఉలవపాడు SI అంకమ్మ శనివారం ప్రాణాలకు తెగించి ఓ సాహసం చేశారు. స్థానికుల వివరాల ప్రకారం.. ఉలవపాడులోని వేణుగోపాలస్వామి ఆలయ కోనేరులో మతిస్థిమితంలేని యువకుడు శనివారం కాలుజారి పడ్డాడు. విషయం తెలుసుకున్న SI అక్కడికి చేరుకున్నారు. తర్వాత తానే స్వయంగా కోనేరులో దూకి యువకున్ని కాపాడే ప్రయత్నం చేయగా దురదృష్టవశాత్తు అతడు అప్పటికే మృతి చెందాడు.

News November 9, 2024

ప్రకాశం జిల్లా నేతలకు కీలక పదవులు

image

రెండో జాబితాలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కూటమి నాయకులకు పలు నామినేటెడ్ పదవులు దక్కాయి. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్‌గా జీవీరెడ్డి నియమితులయ్యారు. ఏపీ కల్చరల్ కమిషన్ ఛైర్మన్‌గా తేజస్వి పొడపాటి ఎంపికయ్యారు. ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ ఛైర్మన్‌గా మరెడ్డి శ్రీనివాస రెడ్డి, ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్‌‌గా డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్‌కు అవకాశం దక్కింది.

News November 9, 2024

BREAKING: ఎమ్మెల్యే తాటిపర్తిపై కేసు నమోదు

image

మంత్రి నారా లోకేశ్‌పై అసత్య ఆరోపణలు చేశారంటూ MLA తాటిపర్తి చంద్రశేఖర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. యర్రగొండపాలెం టీడీపీ కార్యకర్త చేదూరి కిషోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చౌడయ్య తెలిపారు. సెప్టెంబర్ 18న లోకేశ్‌పై వారం వారం పేకాట క్లబ్ ద్వారా లోకేశ్‌కు కమీషన్ అందుతున్నాయని X వేదికగా ఎమ్మెల్యే పోస్టు చేశారు. కార్యకర్త ఫిర్యాదుతో వాట్సాప్ ద్వారా పోలీసులు ఎమ్మెల్యేకు నోటీసులిచ్చారు.

News November 9, 2024

కనిగిరి: వదిన గొంతు కోసిన మరిది

image

బ్లేడుతో ఓ వ్యక్తి మహిళ గొంతు కోసిన ఘటన కనిగిరి పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగింది. పట్టణంలోని గార్లపేట రహదారిలోని హోటల్‌లో టిఫిన్ చేస్తున్న పోలా కోటేశ్వరమ్మ అనే మహిళను మరిది ఆంథోనీ అనే వ్యక్తి బ్లేడుతో గొంతు కోసి గాయపరిచాడు. బంధువులు ఆమెను వెంటనే పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సీఐ ఖాజావలి, ఎస్సై శ్రీరామ్ ఆసుపత్రికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 9, 2024

సోషల్ మీడియా పట్ల జాగ్రత్తలు వహించాలి: ప్రకాశం ఎస్పీ

image

ప్రకాశం జిల్లాలో సోషల్ మీడియా ఉపయోగించే వారు జాగ్రత్తలు వహించాలని ఎస్పీ దామోదర్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, మతాల, కులాల మధ్య రెచ్చగొట్టే విధంగా అసత్యాలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా మార్ఫింగ్ ఫోటోలు, అశ్లీల చిత్రాలు, ఇతరులను ఇబ్బంది పెడితే సహించేది లేదని స్పష్టం చేశారు.

News November 9, 2024

ప్రకాశం జిల్లాలో నేడు ప్రత్యేక శిబిరాలు

image

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్& జిల్లా ఎన్నికల అధికారిణి తమీమ్ అన్సారియా ప్రకటన విడుదల చేశారు. ఈనెల 9, 10, 23, 24వ తేదీల్లో ఉదయం 10గం. నుంచి సాయంత్రం 5గం. వరకు బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. అర్హులైన వారి నుంచి ఫారం-6,7,8 ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు.

News November 7, 2024

ప్రకాశం: 10వ తరగతి విద్యార్థులకు గమనిక

image

ప్రకాశం జిల్లాలోని 10వ తరగతి విద్యార్థులకు డీఈవో కిరణ్ కుమార్ గుడ్ న్యూస్ చెప్పారు. పదో తరగతి పరీక్ష ఫీజు కట్టేందుకు ఈనెల 18వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు చెప్పారు. రూ.50 ఫైన్‌తో 25వ తేదీలోగా, రూ.200 ఫైన్‌తో డిసెంబర్ 3, రూ.500 ఫైన్‌తో డిసెంబర్ 10వ తేదీలోపు ఫీజు కట్టవచ్చని సూచించారు. ఆయా పాఠశాలల HMలు WWW.BSE.AP.GOV.IN ద్వారా చెల్లించాలని చెప్పారు.

News November 7, 2024

ప్రకాశం: మహిళా సాధికారతకు సహాయక సంఘాల కృషి

image

మహిళా సాధికారతకు స్వయం సహాయక సంఘాలు కృషి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. బుధవారం స్వయం సహాయక సంఘాల ప్రొఫైలింగ్ యాప్ నిర్వహణపై జిల్లా స్థాయి వర్క్ షాప్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పధకాలను, స్వయం సహాయక సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News November 6, 2024

ఒంగోలు: జాబ్ మేళాలో ఎంపికైన వారు వీరే.!

image

ఒంగోలు నగరంలోని A-1 ఫంక్షన్ హల్‌లో బుధవారం ఒంగోలు MLA దామచర్ల జనార్ధన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగులు వేలాదిగా వచ్చారు. షార్ప్ ఇండియా వారి సహకారంతో సుమారుగా.. 38 కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కంపెనీలకు 3650 మంది రిజిస్ట్రేషన్ చేసుకొని హాజరయ్యారు. అందులో 1262 మంది ఏంపికయ్యారు. ఎంపికైనా వారి అందరికీ MLA దామచర్ల చేతుల మీదగా ఆఫర్ లెటర్‌ అందజేశారు.

News November 6, 2024

అభ్యంతరం ఉంటే చెప్పండి: ప్రకాశం డీఈవో

image

ప్రకాశం జిల్లాలోని కేజీబీవీల్లో పోస్టులకు ప్రకటించిన మెరిట్ జాబితాపై అభ్యంతరాలు తెలిపేందుకు గడువు పొడిగించినట్లు డీఈవో కిరణ్ కుమార్ చెప్పారు. మొత్తం 51 టీచింగ్, నాన్ టీచింగ్  పోస్టులకు సబ్జెక్టుల వారీగా 1.10 చొప్పున మెరిట్ జాబితా తయారు చేసి జేసీకి సమర్పించారు. వివరాలు నోటీసు బోర్డులో ఉంచారు. దీనిపై అభ్యంతరాలుంటే ఈనెల 6వ తేదీ నుంచి 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తెలపాలని డీఈవో కోరారు.