Prakasam

News July 4, 2024

పిన్నెల్లికి జగన్ వంత పాడటం సిగ్గుచేటు: మంత్రి స్వామి

image

సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంను పగలగొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వంతపాడటం సిగ్గుచేటని మంత్రి బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వంలో వైసీపీ శ్రేణులు మారణ హోమం సృష్టించాయని ఆయన మండిపడ్డారు. ఎలక్షన్‌లో ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించినా జగన్ మాత్రం తన బుద్ధి మార్చుకోలేదని విమర్శించారు.

News July 4, 2024

కనిగిరిలో రెండో రోజూ ఆక్రమణల తొలగింపు

image

కనిగిరిలో ఆక్రమణల తొలగింపు కార్యక్రమం రెండో రోజూ కొనసాగుతోంది. పామూరు రోడ్డులో డ్రైనేజీ కాలువలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను జేసీబీతో మున్సిపల్ అధికారులు తొలగించారు. రహదారులకు ఇరువైపులా ఆక్రమణల తొలగింపు కారణంగా పట్టణంలోని రహదారులు విస్తారంగా దర్శనమిస్తున్నాయి. నిన్న చెప్పులబజారు, ఒంగోలు బస్టాండు, పామూరు బస్టాండు సెంటర్లలో రోడ్డు వెంట ఉన్న ఫుట్‌పాత్‌ వ్యాపారులకు సంబంధించిన బంకులను తొలగించారు.

News July 4, 2024

రిలీవ్ అయిన జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శ్రీధర్

image

బాపట్ల జిల్లా కలెక్టర్‌గా వెంకట మురళీ బాధ్యతలు స్వీకరించడంతో ఇప్పటివరకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన చామకూరి శ్రీధర్ రిలీవ్ అయ్యారు. ఇటీవల జరిగిన బదిలీలలో ఆయన అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. త్వరలోనే శ్రీధర్ అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

News July 4, 2024

గిద్దలూరు: కిరోసిన్ పోసుకొని యువతి ఆత్మహత్య

image

గిద్దలూరు మండలం కొంగలవీడు రహదారిలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. బ్రహ్మంగారి గుడి సమీపంలో రవణమ్మ అనే 15 సంవత్సరాల యువతి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో రవనమ్మ శరీరం పూర్తిగా కాలిపోయింది. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరీక్షించగా.. రవణమ్మ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News July 4, 2024

కొండపి: కిలో పొగాకు గరిష్ఠ ధర రూ.362

image

కొండపి వేలం కేంద్రంలో కిలో పొగాకు గరిష్ఠ ధర రూ.362 పలికిందని వేలం నిర్వహణాధికారి జి. సునీల్ కుమార్ తెలిపారు. బుధవారం బోర్డు పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు వేలం కేంద్రానికి 1,183 బేళ్లను అమ్మకానికి తీసుకురాగా.. 1085 బేళ్లను కొనుగోలు చేశారు. మిగిలినవి వివిధ కారణాలతో తిరస్కరించారు. పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.362, కనిష్ఠ ధర రూ. 204, సరాసరి ధర రూ.294.91 పలికిందన్నారు.

News July 4, 2024

కంభం: SIపై SPకి ఫిర్యాదు

image

పల్నాడు జిల్లా మాచర్ల SI బత్తుల గోపాల్‌పై SP మలికాగార్గ్‌కు ప్రకాశం జిల్లా, కంభం మండలం, రావిపాడుకు చెందిన కోట వెంకట సుబ్బయ్య దంపతులు ఫిర్యాదు చేశారు. గతేడాది జూన్‌లో వెంకట సుబ్బయ్యకు చెందిన 3.75 ఎకరాల పొలాన్ని ఎస్సై గోపాల్ తన భార్య వరలక్ష్మి పేరుతో రూ.37లక్షలకు కొన్నారు. రూ.24లక్షలు చెల్లించగా.. మిగతా రూ.13లక్షలు ఇవ్వాలని అడిగితే చంపుతానని బెదిరిస్తున్నారని బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

News July 4, 2024

చీరాల రాజకీయాల్లో పెను విస్ఫోటనం

image

చీరాలకు చెందిన 11 మంది కౌన్సిలర్లు బుధవారం టీడీపీ ఎమ్మెల్యే కొండయ్యకు మద్దతు పలికారు. వీరిలో ఏడుగురు వైసీపీ కౌన్సిలర్లు, నలుగురు ఇండిపెండెన్స్ కౌన్సిలర్లు ఉన్నారు. వార్డుల అభివృద్ధి కోసమే కొండయ్యకు మద్దతు ఇచ్చామని వారు తెలిపారు. దీంతో చీరాలలో వైసీపీకి గట్టి షాక్ తగిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో వారు టీడీపీ కండువాలు కప్పుకునే అవకాశం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు.

News July 4, 2024

మార్కాపురంలో వ్యాపారి కిడ్నాప్?

image

మార్కాపురం మండలం బిరదులనరవకు చెందిన మిర్చి వ్యాపారి రావి వెంకటరెడ్డిని కిడ్నాప్ చేసినట్లు బుధవారం కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వెంకటరెడ్డి గతంలో రైతుల వద్ద మిర్చి కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకపోవడంతో విసుగెత్తి రైతులు కిడ్నాప్ చేశారని ఆరోపిస్తున్నారు. బిరదుల నర్వ గ్రామానికి వచ్చి వ్యాపారి వెంకటరెడ్డిని రైతులు కొట్టి ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యుల వాదన. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

News July 4, 2024

ప్రకాశం: అధికారులతో కలెక్టర్ సమావేశం

image

ఉపాధి హామీ చట్టం క్రింద చేపట్టే పనులలో నాణ్యత సత్వరం పూర్తిచేయుట ఎంతో కీలకమని కలెక్టర్ తమీమ్ అన్సారియా చెప్పారు. బుధవారం ఆమె జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. డ్వామా ఆధ్వర్యంలో వ్యవసాయ – అనుబంధ శాఖల ద్వారా చేపడుతున్న పనులపై ఆరా తీశారు. జిల్లాలోని కూలీలకు లభిస్తున్న రోజువారీ వేతనం, పని దినాల సంఖ్య తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

News July 3, 2024

రాచర్లలో యువకుడి మృతి

image

రాచర్ల ఫారం సమీపంలో గుర్తుతెలియని యువకుడు బుధవారం సాయంత్రం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. అతిగా మద్యం సేవించిన యువకుడు ఫిట్స్ వచ్చి మృతి చెందాడని పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాచర్ల ఎస్ఐ సుబ్రహ్మణ్యం సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియలేదని ఎవరైనా మృతుడిని గుర్తిస్తే తమకు తెలియజేయాలని కోరారు.