India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజా ఫిర్యాదులను పరిష్కారించుటకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్, పోలీస్ అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 81 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. అనంతరం ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేలా చూడాలని ఆదేశించారు.
త్రిపురాంతకం మండలం దీవెపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం టైర్ పగిలి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. స్థానికులు వారిని 108 వాహనంలో త్రిపురాంతకం వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఢిల్లీలో జరిగిన ఖోఖో ప్రపంచ కప్‌లో భారత్ జట్టు విజేతగా నిలిచింది. జట్టు విజయంలో పోతిరెడ్డి శివారెడ్డి కీలక పాత్ర పోషించాడు. అతనిది ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం ఈదర గ్రామం. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన శివారెడ్డి భారత జట్టుని విజేతగా నిలపడంతో ముండ్లమూరు వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
గృహ, పట్టణ వ్యవహారాల కమిటీ పర్యటనలో భాగంగా ఆ కమిటీ ఛైర్మన్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బృందం ఆదివారం సిమ్లాలోని పలు ప్రాంతాలను సందర్శించారు. అక్కడి పరిస్థితులు, వసతులపై స్థానిక ప్రజలతో ఆరా తీశారు. పలు అంశాలపై అధ్యయనం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి త్వరలో నివేదికను అందజేయనున్నట్లు వారు తెలిపారు.
ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం యధావిధిగా నిర్వహింనున్నట్లు కలెక్టర్ తమిమ్ అన్సారియా తెలిపారు. గత సోమవారం భోగి పండుగ సందర్భంగా “గ్రీవెన్స్ డే” ను తాత్కాలికంగా రద్దు చేశామని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చే అర్జీదారుల కోసం సోమవారం అధికారులు కలెక్టర్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారన్నారు.
రోడ్డుపై తమ పనుల నిమిత్తం కాలిబాట పట్టిన ముగ్గురు వ్యక్తులు మృత్యు ఒడిలోకి జారుకున్నారు. మార్టూరు మండలం ఇసుక దర్శి గ్రామ సమీపంలో నాగిరెడ్డి నడుస్తూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. జరుగుమల్లి మండలం కే.బిట్రగుంట సమీపంలో ప్రసన్నకుమార్‌ను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. కొనకనమిట్ల మండలం చౌటపల్లి వద్ద నాగయ్యను ట్రాలీ ఆటో ఢీ కొనడంతో మృతి చెందాడు.
పాకల బీచ్‌లో 2 రోజుల క్రితం సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. పాకల బీచ్‌లో ఉన్న చిన్నచిన్న గుంతల కారణంగా కడ్సలు (సుడిగుండాలు) ఏర్పడుతాయని, వీటిలో చిక్కుకున్న వారు బ్రతకడం కష్టమని మత్స్యకారులు తెలిపారు. శివన్నపాలెం గ్రామానికి చెందిన నవ్య సమయస్ఫూర్తితో వ్యవహరించి కడ్సల బారి నుంచి తప్పించుకుందని వారు తెలిపారు.
కొండపి నియోజకవర్గానికి చెందిన వరికూటి అశోక్ బాబుకు వైసీపీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ను వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినట్లు పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో కొండపి వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన ఆయన ప్రస్తుతం వేమూరు వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. అశోక్ బాబు నియామకం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రకాశం జిల్లాలోని ప్రతి గ్రామంలో జనవరి 20వ తేదీ నుండి 31 వరకు ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ శిబిరాలలో పశువులకు, దూడలకు, గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ మందులను అందజేయనున్నట్లు తెలిపారు. అన్ని పశువులకు గొంతువాపు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం కూడా ఉంటుందన్నారు.
వివిధ కారణాలతో ఒకేరోజు జిల్లాలో నలుగురు మృత్యువాత పడ్డారు. మార్కాపురం మండలం గొబ్బూరు గ్రామానికి చెందిన నారాయణ మార్కాపురం రైల్వే స్టేషన్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోగా, కనిగిరికి చెందిన అనంతమ్మ క్యాన్సర్‌తో బాధపడుతూ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రహదారి ప్రమాదంలో ప్రతాప్ మృతిచెందగా, కురిచేడులో యశ్వంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
Sorry, no posts matched your criteria.