India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పలాస పోలీస్ స్టేషన్‌లో దాడులకు గురైన వైసీపీ నాయకులను పరామర్శించేందుకు వెళ్తున్న వైసీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పేరాడ తిలక్‌ను నందిగాం వద్ద సోమవారం పోలీసులు అడ్డుకున్నారు. టెక్కలి సీఐ శ్రీనివాసరావు, నందిగాం ఎస్సై అలీ సిబ్బందితో నందిగాం సమీపంలో అడ్డుకున్నారు. గాయపడిన కార్యకర్తలను పరామర్శించే నైతిక హక్కు కూడా పార్టీ నాయకులకు లేకుండా చేస్తున్నారని పేరాడ మండిపడ్డారు.
పలాస పోలీస్ స్టేషన్‌లో దాడులకు గురైన వైసీపీ నాయకులను పరామర్శించేందుకు వెళ్తున్న వైసీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పేరాడ తిలక్‌ను నందిగాం వద్ద సోమవారం పోలీసులు అడ్డుకున్నారు. టెక్కలి సీఐ శ్రీనివాసరావు, నందిగాం ఎస్సై అలీ సిబ్బందితో నందిగాం సమీపంలో పలాస వెళ్లకుండా అడ్డుకున్నారు. గాయపడిన కార్యకర్తలను పరామర్శించే నైతిక హక్కు కూడా పార్టీ నాయకులకు లేకుండా చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు.
ఓ గుర్తు తెలియని వ్యక్తి సోమవారం ఉదయం ఇచ్ఛాపురం – జాడుపుడి మధ్య రైలు పట్టాలపై శవమై కనిపించాడు. కాగా బ్రహ్మాపూర్ నుంచి విశాఖ పట్టణానికి వెళ్లే ఇంటర్సిటీ రైలు లోకో పైలెట్ సిబ్బంది మృతుడిని గమనించి రైలు నిలిపివేశారు. యువకుడి(26) బాడీని పట్టాలపై నుంచి పక్కకు జరిపి అనంతరం RPF సిబ్బందికి సమాచారం అందజేసినట్లు వారు వెల్లడించారు.
శ్రీకాకుళం జిల్లాలో కార్తీకమాస మహోత్సవాలకు ఆలయాలు సిద్ధమయ్యాయి. జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలు..అరసవల్లి- సూర్యనారాయణ స్వామి ఆలయం, టెక్కలి- రావివలస ఎండల మల్లన్న స్వామి దేవాలయం, గార- శ్రీకూర్మం, సాలిహుండం,జలుమూరు- శ్రీముఖలింగం,మందస- మహేంద్ర గిరి పాదాలు.ఆలయాలు సుందరంగా ముస్తాబు అవుతున్నాయి. దర్శనాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు చర్యలు చేపట్టామన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 31వ తేదీన జిల్లా పర్యటనకు రానున్నారు. పర్యటన ఏర్పాట్లకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జిల్లా అధికారులకు సమాచారం వచ్చినట్లు ఆదివారం తెలిపారు. గురువారం ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని సోంపేటలో ప్రారంభించనున్నారు. CM పర్యటన సభాస్థలిని పరిశీలించేందుకు MLA బెందాళం అశోక్, ఇన్‌ఛార్జి RDO కృష్ణమూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రజా రాజధాని అమరావతి – ఆర్థిక రాజధాని విశాఖపట్నం మధ్య అనుసంధానాన్ని మరింత పెంచడం ఆనందంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం విశాఖపట్నంలోని ఎయిర్ పోర్టులో కొత్తగా 2 విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకు వచ్చారు. సామాన్యుడు కూడా విమానం ఎక్కే కళా త్వరలోనే నెరవేరుతుందన్నారు. ఆయన వెంట విజయవాడ ఎంపీ కేశినేని శివనాద్, అధికారులు ఉన్నారు.
నవంబర్ మొదటి వారం నుంచి జిల్లాలో నైపుణ్య గణన (స్కిల్ సెన్సెస్)కు శ్రీకారం చుడుతున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఈనెల 29వ తేదీన జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు, దీని కోసం మాస్టర్ ట్రైనర్ల ఎంపిక ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలిపారు.
అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఇస్కాన్ సభ్యులు దుర్మరణం పాలైన విషాదకర ఘటన తెలిసిందే. ఈ ఘటనలో మందస మండలం బాహడపల్లి గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి బి షణ్ముఖరావు (21) మృతి చెందారు. ఇస్కాన్ ఆలయంలో భక్తునిగా ఉంటూ సంకీర్తనలకు వెళ్లి వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆలిండియా ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం అతుసూరి కవిటి గ్రామానికి చెందిన శాన్వీ లట్టాల సత్తాచాటింది. అస్సాం వేదికగా ఈ నెల 24వ తేదీ నుంచి జరుగుతున్న ఆలిండియా ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ పోటీల్లో శనివారం శాన్వీ మెయిన్ డ్రాకు అర్హత సాధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున కేవలం ఇద్దరు మాత్రమే ఈ పోటీలకు ఎంపిక కాగా అందులో శాన్వీ ఒకరు కావడం విశేషం.
అర్హులైన పేద కుటుంబాలకు చెందిన వారు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పొందడానికి ఈ నెల 31వ తేదీ నుంచి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం అర్హులు ఆధార్ కార్డ్‌తో పాటుగా రేషన్ కార్డు, ఆధార్ నంబర్‌తో బ్యాంక్ ఖాతా లింక్ అయ్యి, గ్యాస్ కనెక్షన్ నంబర్ కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.