Srikakulam

News March 25, 2025

శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్‌కు 50 అర్జీలు

image

ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ఫిర్యాదులు చేశారు. మొత్తం 50 అర్జీలు స్వీకరించామన్నారు

News March 24, 2025

SKLM: గిరిజన రైతుల శ్రమకు జాతీయ గుర్తింపు

image

ఏపీలోని అరకు లోయ నుంచి వచ్చిన స్వచ్ఛమైన, జిఐ ట్యాగ్ పొందిన అరకు కాఫీ ఇప్పుడు పార్లమెంటు ప్రాంగణంలో లభిస్తోందని, 1.5 లక్షల మంది గిరిజన రైతుల కఠోర శ్రమకు, సంప్రదాయానికి ప్రతీకని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. పార్లమెంటులో అరకు కాఫీ అందుబాటులోకి తీసుకురావడానికి పీఎం నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు సహకారం ఎంతో గొప్పదని, వారిద్దరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

News March 24, 2025

శ్రీకాకుళం: జిల్లాలో నేడు ఈ మండలాల వారికి అలర్ట్

image

శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు మండలాల్లో సోమవారం ఎండ తీవ్రత అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని APSDMA తెలిపింది. జిల్లాలోని బూర్జ, హిరమండలం, ఎల్.ఎన్ పేట, సరుబుజ్జిలి మండలాల్లో 37 డిగ్రీలకు పైగా ఎండ తీవ్రతగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆయా మండలాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చిన్నారులు, వృద్ధులు విషయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు.

News March 24, 2025

SKLM: ‘ఉల్లాస్ అక్షరాస్యత పరీక్షకు 39946 మంది హాజరు’

image

శ్రీకాకుళం జిల్లాలోని అన్ని మండలాల్లో ఆదివారం జరిగిన ఉల్లాస్ అక్షరాస్యత పరీక్షకు 39,946 మంది హాజరయ్యారు. ఈ విషయాన్ని డీఆర్డీఏ వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ పెద్దింటి కిరణ్ కుమార్ తెలిపారు. తొలుత అన్ని మండలాల్లోని ఏరియా కోఆర్డినేటర్లు ఏపీఎంలు ఆయా అభ్యర్థులు పేర్లు నమోదు చేశారని ఆయన అన్నారు. ప్రభుత్వం పటిష్ఠంగా చేపడుతున్న వయోజనులకు అక్షరాస్యత కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు.

News March 23, 2025

అరసవల్లి ఆదిత్యుని నేటి ఆదాయం

image

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఆదివారం ఒక్క రోజు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేణా రూ.3,76,300/- లు, పూజలు, విరాళాల రూపంలో రూ.1,41,803/-లు, ప్రసాదాలకు రూ.1,73,720/-లు,శ్రీ స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారు. 

News March 23, 2025

ఎచ్చెర్ల రోడ్డు ప్రమాదంలో టెక్నీషియన్ మృతి

image

ఎచ్చెర్ల హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం పట్టణానికి చెందిన దేశరాజ వెంకట కిరణ్ కుమార్(40) ఆదివారం ఎచ్చెర్ల కేశవరెడ్డి స్కూల్ వద్ద జంక్షన్ దాటుతుండగా రాజాం నుంచి వస్తున్న క్యాబ్ ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎచ్చెర్ల‌లో రూమ్ తీసుకొని రణస్థలం ప్రభుత్వాసుపత్రి CHCలో టెక్నీషియన్‌గా చేస్తున్నాడు. ఎస్సై సందీప్ కేసు నమోదు చేశారు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

News March 23, 2025

ఎచ్చెర్ల: ఆరుగురిపై క్రిమినల్ కేసులు

image

కుప్పిలి ఆదర్శ పాఠశాల విద్యార్థుల మాస్ కాపీయింగ్‌కు ఉపాధ్యాయులు సహకరించారని శ్రీకాకుళం డీఈఓ తిరుమల చైతన్య ఎచ్చెర్ల పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆరుగురు ఉపాధ్యాయులతోపాటు మరికొందరి పాత్ర ఉందని డీఈఓ ఫిర్యాదు చేయగా ఎఫ్ఎఆర్‌లో వారి పేర్లు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ. సందీప్ కుమార్ చెప్పారు.

News March 23, 2025

ఎచ్చెర్ల: టెన్త్ చూచిరాతలో సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్

image

ఎచ్చెర్ల మండలం కుప్పిలి ఏపీ మోడల్ హైస్కూల్ ఏ, బీ కేంద్రాల్లో పదో తరగతి పరీక్షల్లో చూచిరాతల్లో సీనియర్ అసిస్టెంట్ కిషోర్‌ను జిల్లా విద్యాశాఖధికారి తిరుమల చైతన్య సస్పెండ్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 21న స్థానికులు ఫిర్యాదు మేరకు 14 మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేసిన సంఘటన “Way2News” లో వెలువడిన సంగతి తెలిసిందే.

News March 23, 2025

శ్రీకాకుళం జిల్లాలో చికెన్ ధర ఎంతంటే? 

image

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. జిల్లాలో లైవ్ చికెన్ రూ.120 ఉండగా, స్కిన్ రూ.200, స్కిన్ లెస్ రూ.220కి విక్రయాలు చేపడుతున్నారు. ఇటీవల కాలంలో బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ వ్యాపారాలు తగ్గినప్పటికీ ప్రభుత్వం చికెన్ మేళాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడంతో చికెన్ అమ్మకాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే ఎండాకాలంలో మాంసాహారాలు పరిమితిగా తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

News March 23, 2025

శ్రీకాకుళం: 5 నెలల క్రితం లవ్ మ్యారేజ్.. వివాహిత అదృశ్యం

image

హైదరాబాద్ చిలకలగూడ PS పరిధిలో వివాహిత అదృశ్యం అయింది. పోలీసుల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రసాద్, శిరీష 5 నెలల క్రితం విజయవాడలో వివాహం చేసుకున్నారు. సీతాఫల్‌మండీ డివిజన్‌ నామాలగుండులో నివాసం ఉంటున్నారు. ఈ నెల 20న బయటకు వెళ్లిన శిరీష తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్‌ వస్తోంది. తెలిసిన వారి వద్ద వెదికిన ప్రయోజనం లేకపోయింది. దీంతో భర్త చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

error: Content is protected !!