India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇచ్చాపురం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల మద్యం దుకాణాలకు అభ్యర్థులను గురువారం రోజున లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నట్లు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సీఐ దుర్గాప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా.. జిల్లా కేంద్రంలో ఆర్ట్స్ కాలేజీ రోడ్డు అంబేడ్కర్ ఆడిటోరియంలో ఉ.8 గం.లకు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులు చేసుకున్న వారు ఎంట్రీపాస్, ఆధార్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్ తేవాలన్నారు.
వజ్రపుకొత్తూరు పూండి గోవిందపురానికి చెందిన రిటైర్డ్ తెలుగు టీచర్, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ తెలికిచెర్ల ప్రసాదరావు బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆయన పూండి పరిసర ప్రాంతాలలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేశారని గ్రామస్థులు తెలిపారు. ఆయన మృతితో గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి.
గ్యాస్ డెలివరీ ఛార్జీల పేరిట అదనపు ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ ఫర్మాధ్ అహ్మద్ ఖాన్ హెచ్చరించారు. ఇటీవల పొందూరు ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ మీద వచ్చిన ఫిర్యాదుల మేరకు పొందూరు పట్టణంలో గ్యాస్ ఏజెన్సీ డెలివరీ బాయ్స్‌ను జేసీ బుధవారం విచారించారు. అదనపు ఛార్జీలు వసూలు చేయడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అదనపు ఛార్జీలు వసూలు చేస్తే శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేస్తామన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ సంగీత కళాకారుడు, గురువు బండారు చిట్టి బాబు బుధవారం మరణించారు. లలిత సంగీత ప్రపంచంపై తనదైన ముద్ర వేసి ఎంతో మంది శిష్యులకు సంగీత పాఠాలు నేర్పిన చిట్టిబాబు మరణం పట్ల జిల్లాలో సంగీత కళాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విశాఖపట్నం ఆకాశవాణిలో పనిచేస్తూ మత సామరస్య గీతాలు కంపోజ్ చేయడం ఆయన ప్రత్యేకత అని పలువురు తెలిపారు.
మలేరియా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని, సీజనల్, ఇతర అంటువ్యాధులు విజృంభించకుండా తగిన చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను రాష్ట్ర అదనపు సంచాలకులు (మలేరియా) డాక్టర్ బి.సుబ్రహ్మణ్యేశ్వరి, DM&HO డా టివి బాల మురళీకృష్ణ పిలుపునిచ్చారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రి వైద్యాధికారులతో బుధవారం తన కార్యాలయంలో సమావేశం జరిగింది. వ్యాధుల ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 20వేలు అందజేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో బుధవారం జరిగిన చర్చ సందర్భంగా ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మ్యానిఫేస్టోలో చెప్పినట్లుగానే అర్హత కలిగిన రైతులకు సహాయాన్ని అందజేస్తామని ఆయన అన్నారు.
జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్ ద్వితీయ ఇంగ్లిష్ -2 పరీక్షలలో భాగంగా 307 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఆర్ఐఓ ప్రగడ దుర్గారావు తెలిపారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఇంటర్ జనరల్ లో 17,623 మంది విద్యార్థులు, ఒకేషనల్‌లో 1086 మంది విద్యార్థులు పరీక్షలు రాయవలసి ఉందన్నారు. కాగా 18, 079 విద్యార్థులకు 18402 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారని తెలిపారు.
కంచిలి మండలం కుత్తుమ, కొక్కిలి పుట్టుగ గ్రామాల పరిధిలో గురువారం నిర్వహించే జామి జాతరకు సర్వం సిద్ధం చేసినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఈ మేరకు ఆలయాన్ని రంగులు, పూలమాలలతో అలంకరించారు. ఒడిశా సాంప్రదాయం గల ఈ గ్రామాలలో ఈ జాతర ద్వారా పెళ్లికాని యువతీ, యువకులకు చూపులు జరుగుతాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ జాతరలో ఇష్టపడిన వారితో పెద్దల అంగీకారంతో వివాహాలు జరుగుతాయని స్థానికులు నమ్మకం.
మహాత్మాగాంధీ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనేందుకు వచ్చిన సమయంలో నాటిన మొక్క మన ఆమదాలవలస మండలంలో ఉంది.1942లో దూసి గ్రామంలోని రైల్వే స్టేషన్‌లో నాటిన ఆ మొక్కకు ప్రస్తుతం 83 ఏళ్లు ఉంటాయని స్థానికులు తెలిపారు. ఆ వృక్షం ప్రయాణికులకు , గ్రామస్థులకు వేసవి కాలంలో చల్లని నీడనిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.
నిశ్చితార్థమై పెళ్లి జరగాల్సిన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కవిటి (M) కపాసుకుద్దిలో మంగళవారం జరిగింది. ఎస్సై వి. రవివర్మ కథనం.. వడ్డిపుట్టుగకు చెందిన సోనియాకు ఇటీవల నిశ్చితార్థమైంది. కాగా ఆమె పెళ్లి మే నెలలో జరగాల్సి ఉంది. అయితే ఆమె మానసిక స్థితి సరిగా లేదని , ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.