Srikakulam

News March 31, 2026

శ్రీకాకుళం జిల్లాకి వర్ష సూచన

image

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సోమవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో మంగళవారం మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలు పడినప్పుడు ప్రజలు బయట తిరగకూడదన్నారు.

News March 30, 2026

వజ్రపుకొత్తూరు: మావోయిస్టు కీలక నేత లొంగుబాటు

image

మావోయిస్టు కీలక నేత చెల్లూరు నారాయణరావు (సురేశ్) సోమవారం ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఎదుట లొంగిపోయారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన నారాయణరావు సుమారు 36 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో కీలకమైన వ్యక్తిగా వ్యవహరించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యునిగా, ఏఓబీ జోనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. ప్రభుత్వ సరెండర్, పునరావాస విధానం ప్రకారం నారాయణరావుకు ఆర్థిక సహాయం అందించారు.

News March 30, 2026

SKLM:’ CM ప్రవేశపెట్టిన P4 కార్యక్రమం దిక్సూచిగా మారింది’

image

దేశంలోనే తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత దూరదృష్టితో ప్రవేశపెట్టిన ‘పి4’ కార్యక్రమం పేదరిక నిర్మూలనకు దిక్సూచిగా మారిందని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం శ్రీకాకుళంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ‘పి4’ కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా, ఉత్తమసేవలు అందించిన ‘మార్గదర్శులకు’ సన్మానం చేశారు. 20% కుటుంబాలకు సంపన్న పౌరులు ఆర్థికసాయం అందించారన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో 1112 గృహాలకు రూ.13.22 కోట్లు: కలెక్టర్

image

శ్రీకాకుళం జిల్లాలో 1112 గృహాలకు రూ.13.22 కోట్లు మంజూరైనట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. నగరంలోని 44వ వార్డులో పీఎం ఆవాస యోజన 2.0 కింద మంజూరైన గృహాన్ని సోమవారం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలసి ఆయన గృహ ప్రవేశం చేసి మాట్లాడారు. ఈ ఇల్లు మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాదిగా, మీ కుటుంబానికి భద్రతగా ఉండాలన్నారు. మీ జీవితాల్లో ఆనందం, ఆత్మవిశ్వాసం, అభివృద్ధి తీసుకురావాలన్నారు.

News March 30, 2026

శ్రీకాకుళం: ‘వేసవిలో పరిశ్రమలు అగ్నిప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి’

image

జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కె.రాంబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫార్మా, రసాయన పరిశ్రమలోని రియాక్టర్లు, స్టోరేజ్ ట్యాంకుల వద్ద ఉష్ణోగ్రతలు పెరగకుండా శీతలీకరణ వ్యవస్థలు నిరంతరం పనిచేసేలా చూడాలని యాజమాన్యాలను ఆదేశించారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు.

News March 30, 2026

SKLM: గల్ఫ్ యుద్ధం ఎఫెక్ట్ : భారీగా పెరిగిన వంట నూనెల ధరలు

image

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం సామాన్యుల వంటింటి బడ్జెట్పై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధర రూ.60 పెరగ్గా.. వంట నూనెల ధరలు ఓవైపు భారీగా పెరుగుతున్నాయి. ఫలితంగా పేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని రకాల వంట నూనెలు లీటరు ప్యాకెట్లపై రూ.30 వరకు పెరిగాయి. ఇక కొన్ని రకాల నిత్యావసర ధరలు సైతం పెంచి వ్యాపారులు ఇష్టారాజ్యంగా అమ్ముతున్నట్లు వినియోగదారులు తెలిపారు.

గార: రాజులమ్మ జాతరకు వెళ్తుండగా ప్రమాదం.. మహిళ మృతి

image

గార మండలం తండ్యాల పేట వద్ద బైకు అదుపుతప్పి ఆర్టీసీ బస్సు కింద పడి మహిళ మృతి చెందింది. జి.సిగడాం మండలానికి చెందిన ముగడ కనకమ్మ(51) తన కుమారుడు కవిలేష్ తో కలిసి ద్విచక్ర వాహనంపై వత్స వలస గ్రామంలోని రాజులమ్మ జాతరకు ఆదివారం బయలుదేరారు. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి బైక్ అదుపుతప్పి పడిపోయారు. అదే సమయంలో కనకమ్మ బస్సు వెనక చక్రాల కింద పడిపోవడంతో తీవ్ర గాయాలై మృతి చెందింది. కేసు నమోదయింది.