India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎచ్చెర్లలోని IIIT క్యాంపస్‌కు నేటి నుంచి ఈనెల 13వ తేదీ వరకు దసరా సెలవులు ఇచ్చినట్లు డైరెక్టర్ బాలాజీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 14వ తేదీ సోమవారం తరగతులు తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
వంగర కేంద్రంలో బంగారువలస నుంచి వైజాగ్ వెళ్లే బస్సును పునరుద్దరించాలని ప్రయాణీకులు విజ్ఞప్తి చేశారు. గత 8 నెలలగా బంగారు వలస వైజాగ్ సర్వీస్‌లను నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి బంగారువలస ద్వారా వంగర, రాజాం, విజయనగరం, మీదుగా ప్రయాణించే ఉద్యోగులు వ్యాపారస్తులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సును పునరుద్దరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజలకు మరింత చేరువగా ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. ప్రతీ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, అదేవిధంగా ప్రతీ శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల ఫిర్యాదులు స్వీకరణ ఉంటుందని ప్రజలకు తెలిపారు.
ఖరీప్‌కు ఈ-పంట నమోదు, ఈకేవైసీ కార్యక్రమాన్ని రైతులు విధిగా చేయించుకోవాలని, ఆరోగ్యవంతమైన, నాణ్యమైన పంటలను పండించే దిశగా వారిని వ్యవసాయ అధికారులు కూడా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. ఆమదాలవలస మండలంలోని తొటాడ గ్రామంలో శనివారం ఖరీఫ్ వరికి ఈ పంట నమోదు కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన సర్వే నంబర్లలోని వరి పంట పొలాలను సంబంధిత అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
అనారోగ్యంతో మరణించిన హోంగార్డు కుటుంబానికి ఆర్థిక చేయూతగా నగదు చెక్కును జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి చేతుల మీదుగా శనివారం ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన హోంగార్డు జి సురేష్ సతీమణి దుర్గ భవానికి తోటి ఉద్యోగుల ఆర్థిక సహాయంగా స్వతహాగా ఇచ్చిన 4.29 లక్షల నగదు చెక్కును అందజేసి మానవత్వం చాటారు. పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.
శ్రీకాకుళంలో శనివారం లీటర్ పెట్రోల్ ధర రూ.109.69గా ఉంది. నిన్నటితో(110.68)తో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. మరోవైపు, లీటర్ డీజిల్ ధర రూ.97.48గా ఉంది. ఇది కూడా నిన్నటి (98.39) ధర కంటే తగ్గింది. ఈనెల తొలి ఐదురోజుల్లో డీజిల్‌కు ఇదే అత్యల్ప ధర.
దసరా రద్దీ దృష్ట్యా ఈనెల 10,11 తేదీల్లో హైదరాబాద్ నుంచి జిల్లాలో వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డీపీటీవో విజయకుమార్ తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళంలో నాలుగు డిపోల మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. ఈనెల 9 నుంచి విశాఖపట్నం నుంచి పగలు ప్రతి 5నిమిషాలకు, రాత్రి వేళల్లో ప్రతి గంటకు బస్సు చొప్పున జిల్లాకు రాకపోకలు ఉంటాయన్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయని చెప్పారు.
డా. బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, అనుబంధ కాలేజీలకు ఈనెల 7 వ తేదీ నుంచి 12 వ తేదీ వరకూ దసరా సెలవులు (6వ తేదీ ఆదివారం సెలవు ) ప్రకటిస్తూ రిజిస్ట్రార్ పీలా సుజాత శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులకు ఈ సెలవులు వర్తిస్తాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, 13వ తేదీ ఆదివారం సెలవు కావడంతో 14 నుంచి తరగతులు పునఃప్రారంభం కానున్నట్లు ఆ ప్రకటనలో సూచించారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం భువనేశ్వర్ విమానాశ్రయం టెర్మినల్-1, 2 భవనాలను పరిశీలించారు. భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్ ప్రస్తుత సామర్థ్యం 4.6 మిలియన్లు ఉండగా.. ఏటా 8 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా విస్తరణ పనులు చేపడతామని అధికారులకు తెలిపారు. విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు.
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర DGP ద్వారకాతిరుమలరావును శుక్రవారం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు రావాలని డీజీపీని ఆహ్వానించారు. అలాగే ఉత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాటుచేసి శాంతిభద్రతలకు ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.