India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కోటబొమ్మాలి కొత్తమ్మతల్లి ఉత్సవాలను విజయవంతం చేసిన జిల్లా అధికారులు, పోలీసు యంత్రాంగం,స్థానిక నాయకులు, ప్రజలకు రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ధన్యవాదములు తెలిపారు. ఉత్సవాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించడంలో ముఖ్యపాత్ర పోషించిన సీఎం చంద్రబాబు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది కూడా అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు.
డా.బీఆర్ఏయూలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మిగులు సీట్లకు తక్షణ ప్రవేశాలు జరుగుతున్నట్లు రిజిస్ట్రార్ సుజాత తెలిపారు. ఈ నెల 7వ తేదీ వరకు ప్రవేశాలు కొనసాగుతాయన్నారు. ఐసెట్-2024లో ఉత్తీర్ణత చెంది ఇప్పటివరకూ సీటు లభించిన విద్యార్థులు స్పాట్ అడ్మిషన్లకు హాజరు కావచ్చని చెప్పారు. అన్ని ధ్రువపత్రాలతో యూనివర్సిటీలో హాజరుకావాలన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అన్ని RTC కాంప్లెక్స్‌లలో తల్లిపాలు పట్టే ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటుచేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సీతారాం సూచించారు. శుక్రవారం ఆయన శ్రీకాకుళం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో జిల్లా ప్రజా రవాణాధికారి విజయ కుమార్ నేతృత్వంలో వివిధ ఆర్టీసీ డిపోల మేనేజర్లతో సమీక్ష నిర్వహించారు. ఇందుకు ఆర్టీసీ డిపోల సభ్యులు సహకరించాలని కోరారు.
శ్రీకాకుళంలో ఈ నెల 1వ తేదీన జరిగిన స్కూల్ ఫెడరేషన్ గేమ్స్‌లో ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన పాలేపు సాయి జగదీశ్ అండర్-14 యోగా విభాగంలో రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థిని జ్ఞాన భారతి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సీఈవో జోహార్ ఖాన్ అభినందించారు. రాష్ట్రస్థాయిలో మరిన్ని పథకాలు తెచ్చి ఇచ్ఛాపురం పట్టణానికి జ్ఞాన భారతి పాఠశాలకు మంచిపేరు తేవాలని కోరారు.
యూటీఎఫ్ స్వర్ణోత్సవాల్లో భాగంగా గుంటూరులో జరుగుతున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో శుక్రవారం యూటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు సెమీ ఫైనల్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ట్రెజరర్ తదితరులు జిల్లా క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను సత్వరమే పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గుత్తేదారును ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని శాఖలు ఒకే ప్రాంగణంలో ఉండేలా నూతన కలెక్టరేట్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఒక వ్యక్తి వివిధ శాఖల అధికారులను కలవాలని వస్తే అలాంటి వ్యక్తికి నూతన కలెక్టరేట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా వేరే ప్రాంతాలలో ఉద్యోగాలు, పనులు చేసుకొనే వారు శ్రీకాకుళం జిల్లాలోని సొంతూళ్లకు పయనమయ్యారు. అయితే పండుగకు నెలల కిందటే రైలు, ఇతర ఆర్టీసీ బస్సు సీట్లు బుక్ అయిపోయాయి.ఇదే అదనుగా ప్రైవేటు యాజమాన్యం అధిక రేట్లు పెంచి రెచ్చిపోతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమి రూ.వేలలో చెల్లించి ఊరికి చేరుతున్నారు. దీనిపై రవాణా శాఖా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
జాతీయస్థాయిలో ఢిల్లీలో జరగనున్న ఫుట్‌బాల్ పోటీలకు నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని పుష్పలత ఎంపికైందని ప్రిన్సిపల్ పి లత, పిఈటీ భోగేశ్ గురువారం తెలిపారు. ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో ఆమె గెలుపొందిందని వివరించారు. ఢిల్లీ నోయిడా లో ఈనెల 9 నుంచి 16వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి పోటీలో పాల్గొంటుందన్నారు.
నరసన్నపేట ఎక్సైజ్ ఆఫీసులో కానిస్టేబుల్ మోహనరావు గురువారం (33) ఆకస్మికంగా మృతిచెందిన విషయం తెలిసిందే. కుటుంబీకుల వివరాలు.. అతను ఇటీవలే పాతపట్నానికి బదిలీ అయ్యారు. గురువారం తన కార్యాలయంలో రిలీవ్ అయి పాతపట్నానికి బస్సులో బయల్దేరారు. అప్పటికే అతనికి జ్వరంగా ఉంది. దీంతో అస్వస్థతకు గురయ్యారు. ప్రయాణికులు ఆసుపత్రిలో చేర్పించగా ..చికిత్స పొందుతూ కన్నుమూశాడని తెలిపారు.మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు.
స్వర్ణాంధ్ర-2047 సాధనకు అందరి భాగస్వామ్యం అవసరమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. జిల్లాలో ఆర్థిక, సామాజిక, సాంకేతికంగా వృద్ధి చెందడానికి తగిన సూచనలు సేకరణకు వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. గురువారం కలెక్టరేట్‌లో జేసీతో కలసి ఈ కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 2047 నాటికి సంపన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలవాలని, ఇందుకు అందరి సహకారం అవసరమన్నారు.
Sorry, no posts matched your criteria.