India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళంలోని ఓ బ్యాంకులో అప్రైజర్ అవినీతి చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమాచారం మేరకు..గిల్ట్ నగలు తన బంధువుల పేర్ల మీద తాకట్టు పెట్టి రూ.16 లక్షల రుణం తీసుకున్నారు. గుర్తించిన అధికారులు రూ.1.50 లక్షలు రికవరీ చేయగా..మిగిలింది కట్టకుండా కాలయాపన చేస్తుండడంతో సిబ్బంది అతనిపై ఫిర్యాదు చేయాలనుకున్నారు. మంగళవారం పోలీసులను ఆశ్రయించగా పూర్తి వివరాలు లేవని ఫిర్యాదు తీసుకోలేదని ఎచ్చెర్ల సీఐ తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలోని అన్ని పాఠశాలలకు అక్టోబర్ 2 (బుధవారం) నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డా. తిరుమల చైతన్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ దసరా సెలవుల్లో… బీచ్ లకు వెళ్లకుండా చూసుకోవాలన్నారు. అలాగే వారికి బైకు ఇవ్వరాదని దానివల్ల ప్రమాదాలు ఉంటాయని సూచించారు.
క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఉద్యమకారుల్లో స్ఫూర్తి నింపేందుకు మహాత్మా గాంధీ ఆమదాలవలస మండలం దూసి రైల్వే స్టేషన్‌కు 1942లో చేరుకున్నారు. అక్కడ రైల్వే స్టేషన్‌లో దిగి సమరయోధులతో స్వాతంత్ర్య కాంక్షపై మాట్లాడారు. అనంతరం ఒక మర్రి మొక్కను నాటారు. నేడు అది మహావృక్షంగా మారింది. ఈ వృక్షానికి 82 ఏళ్లు వయసైందని దూసి గ్రామస్థులు చెబుతున్నారు.
స్వర్ణాంధ్ర విజన్ రూపకల్పనలో ప్రజలందరూ భాగస్వాములై తమ అభిప్రాయాలను తెలపాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కోరారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ ప్రణాళికను రూపొందించడంలో రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లా తొలిస్థానంలో నిలిచిందన్నారు. ఇంకా సమయం ఉన్నందున స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు అవసరమైన సలహాలు సూచనలు అందించాలని అన్ని వర్గాలను కోరుతున్నట్లు చెప్పారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశమందిరంలో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైన్ షాప్‌లో పనిచేస్తున్న సూపర్వైజర్లు, సేల్స్ మేన్‌లకు ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో ఉదయం నుంచి సేల్స్ మాన్‌లు, సూపర్వైజర్‌లు మద్యం అమ్మకాలు చేపట్టకుండా సమ్మె చేశారు. జిల్లాలో 193 ప్రభుత్వ వైన్ షాపుల్లో పనిచేసిన సేల్స్ మెన్‌లు, సూపర్వైజర్ల కాంట్రాక్ట్ నిన్నటితో ముగిసింది. వీరితో చర్చించి 5వ తేదీ వరకు మద్యం అమ్మకాలు చేపట్టాలని సూచించడంతో 5గంటలనుంచి ప్రారంభించారు.
ఇచ్ఛాపురం నియోజవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ బాబు మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కవిటి, సోంపేట, ఇచ్చాపురం, కంచిలి మండలంలో ప్రధాన సమస్యలపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.
ఎక్సైజ్ Dy కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు జిల్లాలో 12 మంది CI లను నూతనంగా నియమించారు. 21 మంది SIలు బదిలీ జరిగింది. CIలు గోపాలకృష్ణ-శ్రీకాకుళం, సతీష్ కుమార్-ఆమదాలవలస, అనురాధాదేవి-రణస్థలం, రాజు-పొందూరు, రమణమూర్తి-నరసన్నపేట, కృష్ణారావు-పాతపట్నం, కిరణ్మణీశ్వరి-కొత్తూరు, మీరాసాహెబ్-టెక్కలి, గాయత్రి-కోటబొమ్మాళి, మల్లికార్జునరావు-పలాస, బేబీ-సోంపేట, ప్రసాద్-ఇచ్ఛాపురానికి నియమితులయ్యారు.
శ్రీకాకుళం నగరంలోని అక్టోబర్ 2న R&B అతిథి గృహం డచ్ బిల్డింగ్ వద్ద జిల్లాస్థాయి స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిసరాలను, నిర్వహణ ఏర్పాట్లను జిల్లా అధికారులతో సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏ ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు. ఈ సమావేశానికి అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరారు.
దసరా సెలవులు నేపథ్యంలో ఊర్లకు వెళ్లేవారు లాక్డ్ హౌసింగ్ మోనిటరింగ్ సిస్టంను వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సెలవులకు ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్‌కు అందించాలని చెప్పారు. ఎల్‌హెచ్ ఎంఎస్ ద్వారా ఇంట్లోకి దొంగలు ప్రవేశిస్తే ఇంటి యజమానికి, పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తుందన్నారు.
కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఉత్సవాలకు హాజరుకానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం మొదటి రోజున అమ్మవారిని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడులు కుటుంబసమేతంగా దర్శించుకోనున్నారు. సామాన్య భక్తులకు ఉచిత దర్శనం, రూ.20, రూ.50 దర్శనాలను కల్పించనున్నారు.
Sorry, no posts matched your criteria.