Srikakulam

News September 30, 2024

శ్రీకాకుళం: అక్టోబర్ మూడు నుంచి టెట్ పరీక్షలు

image

జిల్లాలో అక్టోబర్ 3 నుంచి టెట్ పరీక్షలు ఉంటాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఎచ్చెర్లలో 2 పరీక్ష కేంద్రాలు, నరసన్నపేటలో ఒక పరీక్ష కేంద్రం బరంపురంలో 3 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షలు ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)లో ఉంటుందన్నారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలు ఉంటాయని తెలిపారు.

News September 30, 2024

SKLM: ఈవీఎం గోదాంల‌ను త‌నిఖీ చేసిన క‌లెక్ట‌ర్‌

image

త్రైమాసిక తనిఖీలలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఈవీఎం గోదాంల‌ను క‌లెక్ట‌ర్ స్వప్నిల్ దినకర్ సోమవారం త‌నిఖీ చేశారు. గోదాముల‌కు వేసిన సీళ్ల‌ను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సిబ్బందితో తెరిపించి ప‌రిశీలించారు. అనంత‌రం వాటికి తిరిగి సీళ్లు వేయించారు.ఎన్నిక‌ల్లో వినియోగించిన, రిజ‌ర్వులో ఉంచిన‌ ఈవిఎంల‌ను సీరియల్ నెంబర్.. నియోజకవర్గాల వారీగా డిఆర్ఓని అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.

News September 30, 2024

పాలకొండ: విద్యుత్ వైర్ తగిలి మహిళా కూలీ రైతు మృతి

image

పాలకొండ మండలం పెద్దమంగళాపురం గ్రామానికి చెందిన మహిళా కూలీ రైతు సోమవారం మృతి చెందిన ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ సమీపంలో చెరుకు తోటలో విద్యుత్ వైరు ప్రమాదవశాత్తు తగలడంతో విద్యుత్ షాక్‌కు గురైన లంక పార్వతి(58) మృతి చెందారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News September 30, 2024

SKLM: ఈసీసీఈ డిప్లొమా కోర్సుల ప్రవేశాల దరఖాస్తుకు నేడే లాస్ట్

image

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో విద్యా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరు నెలల డిప్లొమా కోర్సు ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ)లో దరఖాస్తు సోమవారంతో ముగియనుంది. ఈ సందర్భంగా అభ్యర్థులు www.brau.edu.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుని, రూ.250 ఫీజు చెల్లించాలని రిజిస్ట్రార్ పి.సుజాత తెలిపారు. అనంతరం పూర్తి వివరాలు కోసం విద్యా విభాగాన్ని సంప్రదించాలని సూచించారు.

News September 30, 2024

జాతీయస్థాయి హాకీ శిక్షకుడిగా సిక్కోలు వాసి

image

జాతీయ స్థాయి హాకీ పోటీల్లో పాల్గొననున్న రాష్ట్ర మహిళల జట్టు కోచ్‌గా శ్రీకాకుళం జిల్లాకు చెందిన అల్లు అనిల్ కుమార్‌ను నియమించినట్లు ఏపీ హాకీ సంఘ అధ్యక్షుడు బి.ఎం. చాణక్యరాజు ఆదివారం తెలిపారు. రాష్ట్రానికి హకీ క్రీడలో మంచి పేరు తీసుకురావాలని కోరారు. జిల్లా వాసికి అరుదైన గౌరవం దక్కిందని జిల్లా హాకీ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు అప్పలనాయుడు, రమేశ్ అభినందించారు.

News September 30, 2024

జాతీయస్థాయి హాకీ శిక్షకుడిగా సిక్కోలు వాసి

image

జాతీయ స్థాయి హాకీ పోటీల్లో పాల్గొననున్న రాష్ట్ర మహిళల జట్టు కోచ్‌గా శ్రీకాకుళం జిల్లాకు చెందిన అల్లు అనిల్ కుమార్‌ను నియమించినట్లు ఏపీ హాకీ సంఘ అధ్యక్షుడు బి.ఎం. చాణక్యరాజు ఆదివారం తెలిపారు. రాష్ట్రానికి హకీ క్రీడలో మంచి పేరు తీసుకురావాలని కోరారు. జిల్లా వాసికి అరుదైన గౌరవం దక్కిందని జిల్లా హాకీ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు అప్పలనాయుడు, రమేశ్ అభినందించారు.

News September 30, 2024

అరసవెల్లి ఆలయంలో సూర్యకిరణ దర్శనం

image

అరసవెల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో ఉత్తరాయణ, దక్షిణాయణ కాలమార్పుల్లో భాగంగా తొలి సూర్యకిరణాలు నేరుగా మూలవిరాట్టును తాకనున్నాయి. ఆ అరుదైన క్షణాలు అక్టోబర్ 1, 2 తేదీల్లో సాక్షాత్కరించనున్నాయని EO భద్రాజీ ఆదివారం తెలిపారు. సూర్యోదయ సమయంలో నేరుగా సూర్యకిరణాలు గర్భాలయంలోని స్వామి వారి మూలవిరాట్టును తాకడం ఇక్కడి క్షేత్ర మహత్యంగా చెబుతుంటారు. భక్తులు దర్శించుకోవాలని కోరారు.

News September 30, 2024

సారవకోట: అత్యాచార కేసులో నిందితుడి అరెస్ట్

image

సారవకోట మండలంలో ఓ గ్రామానికి చెందిన 9వ తరగతి బాలికపై అత్యాచారం చేసిన కేసులో అదే ప్రాంతానికి చెందిన బుద్దల హేమసుందరరావును శనివారం రాత్రి అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శ్రీకాకుళం మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రాజశేఖర్ విచారణ చేశారన్నారు. యువకుడి అరెస్ట్ అనంతరం పాతపట్నం కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.

News September 29, 2024

శ్రీకాకుళం: హోంమంత్రిని కలిసిన కేంద్ర మంత్రి రామ్మోహన్

image

భారత విమానయాన రంగ పురోగతిపై సమీక్షించడంతో పాటు పలు అంశాలపై చర్చిండానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదివారం ఢీల్లిలో సమావేశం అయ్యారు. ఈ మెరకు శ్రీకాకుళం నగరంలోని కేంద్రమంత్రి క్యాంపు కార్యాలయము నుంచి ఓ ప్రకటనను విడుదల చేశారు. భారత విమానయాన రంగ పురోగతిపై పూర్తిస్థాయిలో సహకరిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారని ప్రకటనలో పేర్కొన్నారు.

News September 29, 2024

సండే స్పెషల్: సిక్కోలు కళారూపం ‘తప్పెటగుళ్లు’

image

శ్రీకాకుళం జిల్లా యాదవులు కళారూపంగా “తప్పెటగుళ్లకు” ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికీ జిల్లాలోని పల్లె ప్రాంతాల్లో తప్పెటగుళ్ల సంప్రదాయ నాగరికతను పూర్వీకులు నుంచి కొనసాగిస్తున్నారు. యాదవ కుటుంబాలకు పశువులు, గొర్రెలు, మేకలు పెంపకం జీవనాధారం. పశుగ్రాసం కష్టతరమైన సమయంలో దైవానుగ్రహం కోసం తప్పెటగుళ్లతో పూజలు చేస్తారు. ఇక పండగలు, గావు సంబరాల్లో ఈ కళకు ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది.