India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నియోజకవర్గాల పునర్విభజన తెరమీదకు వచ్చిన నేపథ్యంలో జిల్లాలో ఇకపై 2 పార్లమెంటరీ నియోజకవర్గాలు కానున్నాయని రాజకీయ వర్గాల విశ్లేషణ. శ్రీకాకుళం ఒక నియోజకవర్గం కొనసాగుతుందని, మరో నియోజకవర్గం పలాస, లేదంటే టెక్కలి ఉండవచ్చునని భావిస్తున్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత 8 అసెంబ్లీ నియోజకవర్గాలు జిల్లాలో ఉన్నాయి. అయితే జనాభా ఆధారంగా పూర్తిస్థాయిలో రెండు పార్లమెంరీ నియోజకవర్గాలు సాధ్యం కాదనే వాదన సైతం ఉంది.

శ్రీకాకుళం జిల్లా పైనా పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడుతోంది. గ్యాస్ ఇబ్బందులు ఓ పక్క కొనసాగుతుండగా, వంటనూనెల ధరలకు రెక్కలు వచ్చాయి. గత కొన్ని రోజుల క్రితం కిలో ఫామాయిల్ రూ.145, సన్ ఫ్లవర్ రూ.175, కొబ్బరి నూనె రూ.180గా ఉండగా, ప్రస్తుతం ఒక్కసారి రూ.10 నుంచి రూ.20 వరకు ధరలు పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరగటంపై సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.

నగరపాలక సంస్థ కమిషనర్ హనుమంతు కూర్మారావును ప్రభుత్వం మళ్లీ నియమించింది. విధుల్లో చేరిన కొద్ది రోజుల్లోనే తాగునీటి కలుషితం జరిగి డయేరియా ప్రబలిన నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే త్రిసభ్య కమిటీ నివేదికలో ఆయన వైఫల్యం లేదని తేలింది. దీంతో ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేసి పునర్నియామక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.

శ్రీకాకుళం జిల్లా కోర్టు సముదాయంలోని ఫోర్ కోర్ట్స్ భవనం సెల్లార్‌లో ‘మిట్టీ కెఫే’ ఏర్పాటుకు హైకోర్టు ఆమోదం తెలిపింది. సామాజిక బాధ్యతతో ఈ కెఫేను కేవలం దివ్యాంగుల ద్వారానే నిర్వహించేలా జిల్లా ప్రధాన న్యాయస్థానం మంగళవారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి ఉన్న అర్హులు తమ దరఖాస్తులను ఏప్రిల్ 2లోగా సమర్పించాలని కోరారు. నిర్వహకులు విద్యుత్ ఛార్జీలను స్వయంగా భరించాల్సి ఉంటుంది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మంగళవారం కేంద్ర మంత్రి, జిల్లా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు భేటీ అయ్యారు. శ్రీకాకుళం నగరంలోని నాగావళి పరివాహక ప్రాంతంలో రక్షణ గోడలు నిర్మించాలని కోరారు. జిల్లాలో పలుచోట్ల ఫ్లడ్ ప్రొటెక్షన్ వాల్ ఆవశ్యకతను ఆయనకు వివరించారు. శ్రీకాకుళం మండలం పెద్దగనగళ్లవానిపేట వద్ద నాగావళి నది సముద్రంలో కలిసే చోట తీరం కోతకు గురౌతుందని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు.

ప్రజల నుంచి అందిన ఫిర్యాదులపై పోలీసులు త్వరితగతిన స్పందించి, పారదర్శకమైన పరిష్కారం చూపాలని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. PGRS ద్వారా వచ్చే ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో విచారించాలన్నారు. విజిబుల్ పోలీసింగ్‌ను పెంచాలని, ‘నారీ శక్తి’ కార్యక్రమం ద్వారా మహిళా భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు.
Sorry, no posts matched your criteria.