India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సోషల్ మీడియా వేదికగా ఓ మహిళ ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధిస్తున్న ఇద్దరిని శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితులను జైలుకు తరలించారు. ఈ మేరకు గురువారం టూ టౌన్ పట్టణ స్టేషన్ సీఐ పీ.ఈశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. యువతి ఫొటోలు మార్ఫింగ్ చేసి యువతిని వేధించినందకు గాను నిందితులను అరెస్టు చేశామని సీఐ చెప్పారు.
సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచేలా అసభ్యకరమైన పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి హెచ్చరించారు. ఈ విషయాన్ని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో సమాజంలోని వ్యక్తులపై, సంస్థలపై గాని హేయమైన, అసత్య ప్రచారాలు, ట్రోలింగ్ చేసిన బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేస్తామన్నారు. తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
శ్రీకాకుళం జిల్లా DM&HO కార్యాలయంలో ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్(IGD) ఆధ్వర్యంలో అయోడిన్ లోపంపై ఆశావర్కర్లతో జరుగుతున్న రెండు రోజుల శిక్షణా కార్యక్రమం గురువారంతో ముగిసింది. ఆశా వర్కర్లకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ టీవీ బాలమురళీకృష్ణ ప్రశంసా పత్రాలను అందించారు. ఆశా కోఆర్డినేటర్ రవిప్రసాద్, డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ వాన సురేశ్ కుమార్ ఉన్నారు.
APUWJ రాష్ట్ర కౌన్సిల్‌కు జిల్లాకు చెందిన నలుగురు సీనియర్ జర్నలిస్టులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు గురువారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి డీ.సోమసుందర్ వివరాలు వెల్లడించారు. జిల్లాకు చెందిన జర్నలిస్టులు బెండి నర్సింగరావు (టెక్కలి), ఎం.వి మల్లేశ్వరరావు(శ్రీకాకుళం), కొంచాడ రవికుమార్(పలాస), జీ.శ్రీనివాసరావు(పాతపట్నం)లు ఎన్నికయ్యారు. వీరి ఎంపిక పట్ల పలువురు జర్నలిస్టులు అభినందించారు.
శ్రీకాకుళం జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు గురువారం జరగనున్నాయి. ఉదయం 10.30 గంటల నుంచి జడ్పీ సమావేశ మందిరంలో సమావేశాలు ప్రారంభం అవుతాయని జడ్పీ సీఈవో ఎల్ఎన్ఏవీ శ్రీధర్ రాజా తెలిపారు. 10.30 గంటల నుంచి 6వ స్థాయీ, 11.30 గంటలకు 3వ, 12.30 గంటల నుంచి 5వ, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి వరుసగా 2వ, 4వ, 1వ, 7వ స్థాయీ సంఘ సమావేశాలు జరుగుతాయని ప్రకటించారు.
పెళ్లి డెకరేషన్ చేస్తూ యువకుడు చనిపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. సోంపేట మండలం బ్రాహ్మణ కొర్లాంలో పెళ్లి డెకరేషన్ కోసం పలాసకు చెందిన కొంతమంది యువకులు వెళ్లారు. నిన్న రాత్రి క్లాత్ డెకరేషన్ చేస్తుండగా చల్లా తిరుపతి(22) అనే యువకుడికి కరెంట్ వైర్ తగిలింది. తీవ్ర గాయాలు కావడంతో సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే తిరుపతి మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మందస మండలం లోహరిబంధలో బుధవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ బాలిక స్థానికంగా 8వ తరగతి చదువుతుంది. మధ్యాహ్నం పాఠశాలలో భోజనం అనంతరం సమీపంలోని జీడీ తోటలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.
తగ్గించిన ఆవుపాలు ధర పెంచాలని.. కనీస వెన్న శాతాన్ని 2.8 శాతం నుంచి 3.1 శాతానికి పెంచడాన్ని వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మర్రాపు సూర్య నారాయణ డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని రైతు సంఘ కార్యాలయంలో బుధవారం పాల రైతులతో సమావేశం జరిగింది. 30 లీటర్ల కంటే తక్కువ పాలు పోసిన సెంటర్లను ఆపే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.
పొందూరు మండలం పెనుబర్తి గ్రామానికి చెందిన కూన రాంజీ విజయవాడలోని కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు విడుదలయ్యాయి. గతంలో ఆయన ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనివర్సిటీ వీసీగా పనిచేశారు. ఈయన నియామకంపై పొందూరు వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరెన్నో పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.
శ్రీకాకుళంలో గంజాయి కలకలం రేపింది. పాత్రునివలస టిడ్కో కాలనీలో మంగళవారం సాయంత్రం ఆరుగురు సీక్రెట్‌గా గంజాయి తాగుతుండగా రూరల్ పోలీసులు దాడులు చేశారు. దొరికిన వారంతా ఎంబీఏ, ఎంటెక్ విద్యార్థులుగా గుర్తించారు. ఇందులో వైజాగ్‌కు చెందిన ఇద్దరు, శ్రీకాకుళానికి చెందిన నలుగురు ఉన్నారు. సీఐ పైడపునాయుడు మాట్లాడుతూ.. ఇంకా కేసు నమోదు చేయలేదని.. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
Sorry, no posts matched your criteria.