India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇటీవల కాలంలో పలువురు వైసీసీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాళ్లకు అండగా నిలిచేందుకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, శ్యామ్ ప్రసాద్‌కి బాధ్యతలు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాలోని కార్యకర్తలకు వీళ్లు అండగా ఉంటారని చెప్పారు. లీగల్ సెల్‌తో అండగా ఉంటూ క్యాడర్‌కు భరోసా ఇవ్వాలని జగన్ సూచించారు.
షిల్లాంగ్‌లో జరుగుతున్న నార్త్ ఈస్ట్ ఏవియేషన్ సమ్మిట్-2 లో కేంద్ర విమానయాన శాఖ మంత్రి, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం హాజరయ్యారు. పౌర విమానయాన శాఖ కార్యదర్శి వుమ్లున్ మంగ్ వుల్నామ్ అధికారులతో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉందని మంత్రి అన్నారు. గిరిశిఖర ప్రాంతాల్లో సైతం విమాన సేవలు విస్తరించడానికి, ఈశాన్య భారతం యొక్క అపారమైన సామర్థ్యాన్ని పెంపొందించడంపై చర్యలు తీసుకుంటామన్నారు.
నరసన్నపేట పట్టణంలో అతిగా మద్యం తాగి ఒకరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. పోలాకి మండలం జిల్లేడు వలస గ్రామానికి చెందిన లబ్బ శ్రీనివాసరావు (34) గత రెండు రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి స్థానిక పల్లిపేట జంక్షన్ వద్ద మృతి చెంది ఉండడానికి గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
పోస్టుమెట్రిక్ స్కాలర్ షిప్‌కి సంబంధించి కొత్తవారు, రెన్యువల్ చేసుకునేవారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 30లోగా పూర్తి చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖాధికారి విశ్వమోహన్ తెలిపారు. కళాశాలలో చదువుతున్న వారిలో పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలకు అర్హత గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ కళాశాల యాజమాన్యంతో సంప్రదించి జ్ఞానభూమి వెబ్ సైట్లో అప్లై చేసుకోవాలన్నారు.
పత్తి కొనుగోళ్లపై వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గురువారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు. పత్తి కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. పత్తి రైతులకు మేలు చేసే విధంగా కార్యక్రమాలు ఉండాలని అన్నారు. ఆయన వెంట కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు ఉన్నారు.
సినీ నటుడు పోసాని మురళీకృష్ణపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పాతపట్నం పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. మురళీకృష్ణ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్, టీటీడీ అధ్యక్షులు బిఆర్ నాయుడుతో పాటు పలు సంస్థల అధినేతలపైన తప్పుగా మాట్లాడినందుకు ఫిర్యాదు చేసినట్లు కలమట తెలిపారు. ఫిర్యాదును ఎస్ఐ లావణ్యకు అందజేశారు. టీడీపీ నాయకులు ఉన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు పరీక్ష ఫీజు మరో నాలుగు రోజుల్లో చెల్లించాలి. ఈ సందర్భంగా తొలుత ప్రభుత్వం అక్టోబర్ 28వ తేదీ నుంచి నవంబర్ 11వ తేదీ లోపు చెల్లించాలని ప్రకటించగా దాన్ని ఈ నెల 18వ తేదీ వరకు గడువు పొడిగించింది. దీనితో 10వ తరగతి విద్యార్థులు 18వ తేదీ వరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజును ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
YCP నేత, నటుడు పోసాని కృష్ణ మురళీ TTD ఛైర్మన్ బి.ఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు, అసభ్య కరమైన పదజాలంతో దూషించడంపై పాలకొండ టీడీపీ నేతలు పోలీసు స్టేషన్‌లో గురువారం ఉదయం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గతంలో సీఎం, డిప్యూటీ సీఎంలపై గతంలో పోసాని తీవ్ర పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సై ప్రయోగ మూర్తిని కోరారు. కార్యక్రమంలో మండల కూటమి నాయకులు పాల్గొన్నారు.
కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం సాయంత్రం రైలు ఢీకొని గుర్తుతెలియని వృద్ధురాలు మృతిచెందింది. ఈ మేరకు రైలు పట్టాలపై మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పలాస జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. కాగా వృద్ధురాలు వివరాలు తెలియరాలేదు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామానికి చెందిన మొదలవలస చిన్నారావు (33) అనే ఆర్మీ జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజస్థాన్‌లోని బికనీర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. తాను ఉన్న గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డినట్లు ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు ఫోన్‌లో సమాచారం అందించారు. స్వగ్రామానికి మృతదేహం తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. జవాన్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
Sorry, no posts matched your criteria.