India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పొందూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల్లోకి వెళ్తే స్థానిక మండలంలోని కాజీపేట వద్ద జరిగిన కొట్లాట కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ చర్యలు తీసుకున్నామని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి చెప్పారు. కాగా ఈ కొట్లాటకు సంబంధించి హత్యాయత్నం కేసు నమోదైందన్నారు. కానిస్టేబుళ్ల నిర్లక్ష్యం దీనికి కారణమన్నారు.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతు ఎవరికిస్తుందనే విషయంపై గందరగోళం నెలకొంది. ప్రస్తుత MLC పాకలపాటి రఘువర్మ నామినేషన్ వేసిన సందర్భంగా TDP ఎమ్మెల్సీ చిరంజీవిరావు మాట్లాడుతూ కూటమి మద్దతు రఘువర్మకేనని ప్రకటించారు. అయితే పీఆర్టీయూ, STUల మద్దతుతో పోటీ చేస్తున్న గాదె శ్రీనివాసులు నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవ్ శుక్రవారం హాజరై మద్దతు ప్రకటించారు.
నందిగం మండలం హరిదాసు పేట గ్రామంలో శుక్రవారం తమ్ముడి మృత దేహానికి అక్క అంత్యక్రియలు నిర్వహించిన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన కణితి. సుధాకర్ (24) అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. తన తండ్రి మూడు సంవత్సరాల కిందట మరణించారు. తల్లి కంటి చూపు సమస్యతో బాధపడుతుంది. భార్య విడాకులు తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో సోదరి కృష్ణవేణి తమ్ముడు సుధాకర్‌కు దహన సంస్కారాలు చేసింది.
పొందూరులో రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల అందించిన సమాచారంతో ఏస్.ఐ మధుసూదన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి సుమారు (45)ఏళ్ల వయసు ఉంటుందన్నారు. బిస్కెట్ కలర్ షర్ట్, బ్లూ కలర్ షార్ట్ ఉందని వివరాలు తెలిస్తే 94934 74582 నంబరును సంప్రదించాలని కోరారు.
యాచనకు వచ్చిన ఓ మహిళ గురువారం రాత్రి శ్రీకాకుళం నగరానికి చెందిన గృహిణిపై దాడి చేసింది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. సీమనాయుడుపేటకు చెందిన జయలక్ష్మి కుటుంబం సభ్యులు అందరూ బయటకు వెళ్లారు. ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్న సమయంలో ఒక మహిళ యాచనకు వచ్చి ఒంటరిగా ఉన్న ఆమెపై దాడి చేసింది. ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకునేందుకు ప్రయత్నించగా జయలక్ష్మి ప్రతిఘటించి కేకలు వేసింది. స్థానికులు రావడంతో ఆ మహిళ పరారైంది.
వెంకటాపురం నుంచి సంతబొమ్మాలి మండలం నౌపడ రహదారి నిర్మాణానికి రూ.45 కోట్ల 50 లక్షలు మంజూరైనట్లు సామాజిక కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు గురువారం తెలిపారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గతంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడి ఆధ్వర్యంలో నితిన్ గడ్కరీకి వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఆయన రహదారి నిర్మాణానికి కృషి చేసినట్లు పేర్కొన్నారు.
ఎచ్చెర్ల మండలం చిలకపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కార్తీక్(21), తరుణ్(19) <<15378854>>మృతి చెందిన<<>> సంగతి విదితమే. సరదాగా బైక్‌పై బయటకు వెళ్లిన ఇద్దరినీ మృత్యువు కబళించింది. కాగా చిన్న వయస్సులోనే ఇంటి బాధ్యతలు మోస్తున్న యువకులు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కార్తీక్ తండ్రి కొన్నేళ్ల క్రితం మృతి చెందగా ప్రస్తుతం రవాణా కూలీగా చేస్తున్నారు. తరుణ్ ఓ బట్టల షాపులో పని చేస్తున్నారు.
సుదీర్ఘ ప్రాంత గ్రామాలకు అనుసంధానంగా ఉన్న డీపీఎన్ రహదారి విస్తరణ, తారు రోడ్డు నిర్మాణం పనులకు ఎన్డీఏ ప్రభుత్వం రూ.107 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి కిజరాపు అచ్చెన్నాయుడు గురువారం తెలిపారు. పోలాకి మండలం, డోల గ్రామాల నుంచి సంతబొమ్మాళి మండలం నౌపడ వరకు రెండు లైన్ల రహదారి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. టీడీపీ నాయకులు మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడికి ధన్యవాదాలు తెలిపారు.
సీఎం చంద్రబాబు మంత్రులకు గురువారం ర్యాంకులు ప్రకటించారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఈ ర్యాంకుల్లో శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడికి 17వ ర్యాంక్ వచ్చింది. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సీఎం మంత్రికి సూచించారు.
శ్రీకాకుళం పట్టణం అరసవల్లిలో శ్రీ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుకలు మూడు రోజుల పాటు కనుల పండువగా జరిగాయి. ఈ మేరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని గురువారం జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఓ పత్రికా ప్రకటనలో తెలియజేశారు. పోలీస్ శాఖ చేపట్టిన పటిష్ఠ బందోబస్తు చర్యలు హర్షణీయమని కొనియాడారు.
Sorry, no posts matched your criteria.