India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీన (ఆదివారం) శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణలో జరగనున్న సబ్ జూనియర్ జిల్లా జట్లు ఎంపికలు వర్షం కారణంగా వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఆ సంఘం అధ్యక్షుడు నాగ భూషణరావు తెలిపారు. ఎంపికలు నిర్వహించే తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని క్రీడాకారులు గమనించాలన్నారు.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, భార్య దువ్వాడ వాణీ వివాదం ఎపిసోడ్‌లో శనివారం ఒక బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్‌తో సన్నిహితంగా ఉంటున్న దివ్వెల మాధురి రోడ్డు ప్రమాదానికి గురైన సమయంలో దువ్వాడ శ్రీనివాస్ మాధురికి ఫోన్ చేశారు. “దువ్వాడ వాణీ వేధింపుల కారణంగానే నేనే ఆత్మహత్య ప్రయత్నం చేసానని శ్రీనివాస్ మాధురికి సలహా ఇచ్చిన ఆడియో తాజాగా బయటకు రావడం చర్చనీయాంశమైంది.
శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ ప్రభావం నేపద్యంలో శనివారం సాయంత్రం హిరమండలం బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్ట్ గేట్లను మూసివేసినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ప్రధానంగా వంశధార ఎడమ, కుడి ప్రధాన కాలువల గేట్లను మూసివేసినట్లు ప్రాజెక్ట్ ఎస్ఈ బీ.రాంబాబు తెలిపారు. జిల్లాలోని సాగునీటి కాలువల ద్వారా నీరు సరఫరా అవుతున్న నేపథ్యంలో తుఫాన్ కారణంగా వరద పోటెత్తే ఆవకాశం ఉండడంతో గేట్లను మూసివేసినట్లు తెలిపారు.
భారీ వర్షాల దృష్ట్యా ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. శనివారం ఆయన జిల్లాల ముఖ్య అధికారులతో జరిపిన సమీక్షలో కలెక్టర్లతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాల తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం సూచించారు. తుఫాన్ తీరం దాటేటప్పుడు 55- 65 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశముందని సీఎం ఈ మేరకు సమీక్షలో స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
జి.సిగడాం మండలం వెలగాడ గ్రామంలో డయేరియా, జ్వరాలు విజృంభిస్తున్నాయని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన కోల నాగమ్మ శనివారం డయేరియా బారిన పడి మృతి చెందిందని తెలిపారు. వారం క్రితం నలుగురు మరణించగా, 30 మంది రాజాం, శ్రీకాకుళంలో ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. మరణించిన ఇద్దరిలో ఒకే కుటుంబానికి చెందిన అక్క, తమ్ముడు ఉండడంతో విషాదఛాయలు అలముకున్నాయి. చర్యలు చేపట్టాలని కోరుతన్నారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం పాత కొజ్జిరియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం అంతుపట్టని చర్య చోటుచేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటుతుంటే.. మరోవైపు పాఠశాల ఆవరణంలో ఉన్న చెట్లు నరికి వేసి తొలగించారు. మొక్కలు నాటాల్సిన రోజే చెట్లు కొట్టివేయడంతో విద్యార్థులు స్థానిక ప్రజలు ఉపాధ్యాయుల తీరుపై మండిపడ్డారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మరో 2 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఈ క్రమంలో కింది జాగ్రత్తలు పాటిద్దాం.
☞ శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, గోడలు, స్తంభాల వద్ద ఉండొద్దు.
☞ వర్షం పడేటప్పుడు చెట్ల కిందికి వెళ్లకండి.
☞ నదులు, కాలువలు, మ్యాన్‌హోళ్ల వద్ద జాగ్రత్త.
☞ రోడ్డుపై నీరుంటే జాగ్రత్తగా వెళ్లండి.
➠ కంట్రోల్ రూం నంబర్: 08942240557
రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీలో భాగంగా రాష్ట్రంలోనే ముందుగా పింఛన్లు పంపిణీ చేసి శ్రీకాకుళం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని డీఆర్డీఏ పీడీ పి కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం మంత్రి అచ్చెన్నాయుడితో రావివలసలో పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఉదయం 10 గంటలకే 90.68 శాతం పింఛన్లు పంపిణీ చేసి ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. ఆయన ఉద్యోగులకు అభినందనలు తెలిపారు.
ఎచ్చెర్ల మండలం పొన్నాడ, బొంతలకోడూరు గ్రామాల్లో ప్రారంభమైన ఎన్.టీ.ఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆకస్మికంగా పరిశీలించారు. సచివాలయ ఉద్యోగులు వృద్ధులు, వికలాంగుల ఇంటి వద్దకే వెళ్లి ఫించన్ పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి నేతలు పాల్గొన్నారు.
శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వచ్చే నెల 3న నోడల్ రిసోర్స్ కేంద్రం, ఏపీఎస్ఎస్ఈసీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ కె.సూర్య చంద్రరావు తెలిపారు. అభ్యర్థులు బయోడేటా, మూడు పాస్ పోర్టు సైజు ఫొటోలు, విద్యార్హత జిరాక్సు కాఫీలు తీసుకురావాలని సూచించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.