India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన చాలా బాధకు గురి చేసిందని ఎచ్చెర్ల టీడీపీ నాయకులు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సాయంత్రం అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని TTD ఛైర్మన్ బి.ఆర్.నాయుడు, EO శ్యామలరావును కలిసి వినతిపత్రం ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దేవాలయాల్లో, కళ్యాణ మండపాలలో టోకెన్లను జారీ చేసే విషయాన్ని పరిశీలించాలన్నారు.
రణస్థలానికి చెందిన లారీ డ్రైవర్ ఈశ్వరరావుకు 6 నెలలు జైలు, రూ.5 వేలు జరిమానా విధించినట్లు జేఆర్ పురం ఎస్సై చిరంజీవి తెలిపారు. 2019 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దేరసాం గ్రామానికి చెందిన రాము మృతి చెందారు. ఆ ప్రమాదంలో నిందితుడైన డ్రైవర్ ఈశ్వరరావుకు శిక్ష విధిస్తూ.. ఏఎంఎఫ్ సీ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శ్రీకాకుళం కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది.
సంక్రాంతి పండుగ సంప్రదాయ పద్ధతిలో ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జూదం, కోడి పందాలు, డొక్కు ఆట వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఈవిటీజింగ్, ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కల్పించిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.
వీరఘట్టం మండలం సంత నర్సిపురం గ్రామంలో గురువారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. స్థానికుల కథనం మేరకు ఇంత రామకృష్ణ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన కిరణ్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. విషయం తెలియడంతో పాలకొండ సీఐ చంద్రమౌళి, వీరఘట్టం ఎస్సై కళాధర్ శుక్రవారం ఉదయం పోలీస్ సిబ్బందితో వెళ్లి ఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి జనవరి 19 వరకు పాఠశాలలకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. దీనితో విద్యార్థులు ఊళ్లకు పయనమయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు 3 లక్షల 20 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలు కచ్చితంగా సెలవులు అమలు చేయాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. పాఠశాలలు తెరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
శ్రీకాకుళం పట్టణ ప్రజలకు రెండో పట్టణ సీఐ పలు సూచనలు చేశారు. సంక్రాంతి పండగకు గ్రామాలకు వెళ్లే పట్టణ ప్రజలు మీ విలువైన బంగారు ఆభరణాలు నగదు తీసుకుని వెళ్లాలని అన్నారు. లేకుంటే బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సీఐ చెప్పారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆయా స్టేషన్ పరిధిలోని గురువారం ప్రచారం రథాల ద్వారా పట్టణ ప్రజలను అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించారు.
శ్రీకాకుళం జిల్లా అన్ని పాఠశాలలకు రేపటి నుంచి సంక్రాతి సెలవులు 10వ తేదీ నుంచి 19 వరకు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డా. తిరుమల చైతన్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు . అనంతరం పాఠశాలలు తిరిగి 20వ తేదీన తెరుచుకుంటాయన్నారు. రివిజన్ కోసం SSC, ఇంటర్మీడియట్ విద్యార్థులకు హోమ్ వర్క్ ఇవ్వాలని ప్రిన్సిపాల్‌లకు సూచించారు.
భారత వాయుసేన 12 ఎయిర్ మెన్ సెలక్షన్ సెంటర్ ద్వారా క్లరికల్, టెక్నికల్ క్యాడర్‌లలో అగ్నివీర్ వాయుసేన పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదలైందని జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్, ఐ.టి.ఐ, డిప్లొమా (పాలిటెక్నిక్) పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. జనవరి 27, 2025 వరకు ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్: https://agnipathvayu.cdac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
పాతపట్నం మండలం కొరసవాడ శ్మశాన వాటిక సమీపాన గురువారం మధ్నాహ్నం స్కూటీ- లగేజీ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పాతపట్నం మండలం చాకిపల్లి గ్రామానికి చెందిన మారెడ్ల కృష్ణారావు (53) గా స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.
సంక్రాంతి సెలవుల నేపధ్యంలో గురువారం శ్రీకాకుళం జిల్లాలో వసతిగృహాల విద్యార్థులు ఇళ్లకు బయలుదేరారు. శుక్రవారం నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో టెక్కలిలో మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, బీసీ, ఎస్సీ, ఎస్టీ బాలురు, బాలికల వసతిగృహ విద్యార్థులు ఇళ్లకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో వసతిగృహాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. మళ్లీ పండుగ అనంతరం విద్యార్థులు వసతిగృహాలకు రానున్నారు.
Sorry, no posts matched your criteria.