India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉద్యోగం పేరుతో ఓ పంచాయితీ కార్యదర్శి రూ.13.50లక్షలు కాజేసిన ఘటన మందస మండలంలో సోమవారం వెలుగుచూసింది. లోహరిబంద పంచాయతీ కార్యదర్శి సతీశ్ బాబు కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ పలువురి నుంచి నగదును డిమాండ్ చేశాడు. ఇది నిజమే అని నమ్మిన కొందరు నిరద్యోగులు అతనికి నగదును ముట్టజెప్పారు. అప్పటి నుంచి ఆయన సరిగా స్పందించకపోవడంతో బాధితులు సోమవారం కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
విజయవాడ డివిజన్‌లో నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నందున పలాస, శ్రీకాకుళం రోడ్ మీదుగా వెళ్లే పూరి- ఓఖా ఎక్స్‌ప్రెస్‌ను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.20819 ట్రైన్‌ను ఆగస్టు 4 నుంచి విజయవాడ మీదుగా కాక గుణదల, రాయనపాడు మీదుగా నడుపుతామన్నారు. ఆగస్టు 4 నుంచి ఈ రైలు విజయవాడ మీదుగా వెళ్లదని, సమీపంలోని రాయనపాడులో ఈ రైలుకు స్టాప్ ఇచ్చామని రైల్వే అధికారులు తెలిపారు.
➣ ఈనెల 23 నుంచి జిల్లా వ్యాప్తంగా ఆధార్ క్యాంపులు➣ టెక్కలిలో టీడీపీ ఫ్లెక్సీల చించివేత➣ వరద నీటిపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ స్వప్నిల్ ➣ కేసులకు భయపడేవారు ఎవరూ లేరు: స్పీకర్ తమ్మినేని➣ఎచ్చెర్లలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య➣ మీకోసం పరిష్కార వేదికకు 151 అర్జీలు➣ పోటీ పరీక్షల్లో రాణించి జిల్లా ఖ్యాతిని పెంచాలి: రామ్మోహన్➣ ఐటీడీఏ పీవోగా రాహుల్ కుమార్ రెడ్డి➣ జలుమూరులో రూ.9 లక్షల నగదు చోరీ
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రజలు నుంచి 55 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుల విషయంలో అలసత్వం లేకుండా చట్ట ప్రకారం తక్షణ చర్యలు చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.
కళాశాలకు వెళ్లడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. ఎచ్చెర్ల మండలం పొన్నాడ గ్రామానికి చెందిన గరుగు పవన్ కుమార్(17) కళాశాలకు వెళ్లకుండా ఇంట్లో ఫోన్లో ఆటలు ఆడుకుంటున్నారని మందలించడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని మరణించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎచ్చెర్ల పోలీసులు తెలిపారు.
ఆధార్ స్పెషల్ క్యాంపులు అందరు వినియోగించుకోవాలి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఆధార్ స్పెషల్ క్యాంపులను ఈనెల 23 నుంచి 27 తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందరూ ఆధార్ స్పెషల్ క్యాంపులు వినియోగించుకోవాలన్నారు.
కొత్తవలస-కిరండూల్ రైల్వే మార్గంలో భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లు దారి మళ్లించారు. నం.18514 విశాఖపట్నం-కిరండూల్ ఎక్స్‌ప్రెస్, నం.18513 కిరండూల్ -విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లు అరుకు మీదుగా వెళ్లేవి. వీటిని ముందస్తు జాగ్రత్తగా రాయగడ, విజయనగరం మీదుగా ఈనెల 24 వరకు కొనసాగిస్తారు. రైళ్లు కిరండూల్ వరకు వెళ్లకుండా దంతేవాడ నుంచి రాకపోకలు సాగిస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ ఏయూ విశ్వవిద్యాలయం పరిధిలో న్యాయవిద్య LLB 3,6,7 సెమిస్టర్‌ల ఫలితాలను ఎగ్జామినేషన్స్ డీన్ ఉదయ్ భాస్కర్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫలితాలను వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. అనంతరం మూడో సెమిస్టర్‌లో 20 మంది, ఆరో సెమిస్టర్‌లో 18 మంది, 7 సెమిస్టర్‌లో 21 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ ITIలో మొదటి విడత కౌన్సిలింగ్‌లో మిగిలిన సీట్లకు రెండో విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ప్రవేశాల కన్వీనర్ సుధాకర్ రావు తెలిపారు. ఈ మేరకు అర్హులైన 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈనెల 24వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దీని కోసం ముందుగా https://iti.ap.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు 826 ప్రవేశాలు జరగగా 2782 సీట్లు ఉన్నాయి.
జలుమూరు మండలం సురవరంలో ఆదివారం చోరీ జరిగింది. సురవరం గ్రామానికి చెందిన శివప్రసాద్ వృత్తిరీత్యా శ్రీకాకుళంలో నివాసం ఉంటున్నారు. ఆయన తల్లి గ్రామంలో ఉండేది. ఆమె ఇటీవల హైదరాబాద్‌లోని చిన్నకుమారుడి వద్దకు వెళ్లింది. శివప్రసాద్ ఆదివారం ఇంటికి వచ్చి చూసేసరికి బీరువా తలుపులు తెరచి ఉండటాన్ని గుర్తించారు. బీరువాలోని రూ.9 లక్షల నగదు, వెండి వస్తువులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Sorry, no posts matched your criteria.