India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సారవకోట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నిర్వహిస్తున్న స్టడీ అవర్స్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు పరిశీలించారు. పదో తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యార్థులు, సక్రమంగా జవాబులు రాయాలని కోరారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పదో తరగతి మార్కులే కీలకమని ఆయన సూచించారు. ఆయనతో పాటు ఉపాధ్యాయులు ఉన్నారు.

సారవకోట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా ఫించన్లను జిల్లా కలెక్టర్ స్వప్నికల్ దినకర్ పుండ్కర్ శనివారం పంపిణీ చేశారు. ప్రతి సచివాలయం సిబ్బంది లబ్ధిదారుని ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేయాలని సూచించారు. ఐవీఆర్ఎస్ కాల్స్ పై అవగాహన కల్పించాలన్నారు. ఎంపీడీఓ మోహన్ కుమార్, పంచాయతీ కార్యదర్శి, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

టెక్కలి ఆధి ఆంధ్రావీధికి చెందిన జోగి మల్లేసు బ్రెయిన్ స్ట్రోక్‌తో శ్రీకాకుళంలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మల్లేసు, సీతమ్మ దంపతులు స్థానికంగా తాళ్లు, కట్టెలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కాగా కుమారుడు గతంలో గుండెపోటుతో మృతి చెందాడు. ఈ మేరకు భార్య సీతమ్మ భర్త చితికి తలకొరివి పెట్టిన ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది.

శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల మొదటి వారంలో కొండెక్కిన కోడి గుడ్ల ధర ఎట్టకేలకు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చింది. న్యూ ఇయర్ సీజన్ ప్రారంభంలో గరిష్ఠంగా ఒక్కో గుడ్డు రూ.10 రికార్డ్ ధరకు చేరింది. డిమాండ్‌కి తగ్గ సప్లై లేకపోవటం, గుడ్ల ఉత్పత్తి తగ్గటం దీనికి కారణం. ప్రస్తుతం గుడ్ల ఉత్పత్తి, సరఫరా మెరుగుపడటంతో ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఒక గుడ్డు రూ. 5.50 – రూ.6 ఉందని వ్యాపారులు తెలిపారు.

అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకల్లో నకిలీ పాసుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇందులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పాత్ర ఉందని పత్రికల్లో కథనాలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారంలో తమకు సంబంధం లేదని సిక్కోలు సోషల్ మీడియా అసోసియేషన్ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో చివరకు పాసులు ముద్రించిన జిరాక్స్ సెంటర్లను దోషులుగా చేస్తారా? అన్న చర్చ నడుస్తోంది.

ఎచ్చెర్లలోని షేర్ మహమ్మద్ పురానికి చెందిన ఎస్. శివనాగ గౌరి గ్రూప్-1కు ఎంపికైంది. ప్రస్తుతం వంశధార జల వనరుల శాఖ ప్రాజెక్టులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తుంది. భర్త చౌదరి అవినాశ్ శ్రీకాకుళం డీసీఎంఎస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈమె విజయం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

నందిగాంలోని దేవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉపాధ్యాయురాలు శుక్రవారం విద్యార్థులపై తన ప్రతాపాన్ని చూపించారని తల్లిదండ్రులు ఆరోపించారు. హోమ్ వర్క్ రాయకుండా అల్లరి చేస్తున్నారనే కారణంతో ఒంటిపై వాతలు కనిపించేలా కర్రతో కొట్టారని మండిపడ్డారు. అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

జగన్నాథ సాగర్ ఆక్రమణలపై పత్రికల్లో వచ్చిన కథనాలపై కలెక్టర్ దినకర్ స్పందించారు. శుక్రవారం ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. చెరువు పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలను జేసీబీలతో తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో 24 గంటల్లోగా ఆక్రమణలన్నీ తొలగిస్తామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, తహశీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి వివరించారు.

అరసవల్లి ఆదిత్యుని రథసప్తమి వీఐపీ పాసులు, తదితర టిక్కెట్ల నకిలీ ముద్రణ అంశాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. ఈ వేడుకల్లో సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లను ప్రచారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రాధాన్యత ఇచ్చారా? అదే అదునుగా ఈ నకిలీ పాస్‌లు ముద్రించారానే ప్రశ్నలు లేవనెత్తున్నాయి. వీరికి అండగా నిలిచిందెవరు? నకిలీ పాసులతో రద్దీ ఎక్కువైందా? పలు కోణాల్లో ఖాకీలు దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీకాకుళం(D) పోలాకి(M) చెందిన ఓ మహిళ గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటానని కుటుంబీకులకు ఫొన్ చేసింది. వారు ఆందోళన చెంది 112 నంబర్‌కు సమాచారం ఇచ్చారు. కంట్రోల్ రూం పోలాకి పోలీసులకు విషయం తెలపగా ఎస్సై రంజిత్ సదరు మహిళకు ఫొన్‌లో కాంటాక్టై ఆమదాలవలస పరిసర ప్రాంతంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. అనంతరం జీఆర్పీ, లోకల్ పోలీసులకు సమాచారమివ్వడంతో మహిళను సురక్షితంగా కాపాడారు.
Sorry, no posts matched your criteria.