Srikakulam

News July 19, 2024

పొందూరు ఖద్దరు పై వీడియో పోటీలు

image

గాంధీని ప్రభావితం చేసిన పొందూరు ఖద్దరు తయారీ పై ప్రభుత్వం వీడియో చిత్రీకరణ పోటీలను నిర్వహిస్తుందని రాష్ట్ర చేనేత, జౌలి శాఖ తెలిపింది. భారతీయ చరిత్రలో చేనేత ప్రాధాన్యతను గుర్తించి ఆగస్టు7వ తేదీన నిర్వహిస్తున్న జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. పోటీల్లో పాల్గొనేవారు తాము రూపొందించిన వీడియోను రాష్ట్ర చేనేత కార్యాలయంలో ఆగస్టు 1వ తేదీ లోపు సమర్పించాలన్నారు.

News July 19, 2024

సెంచరీలతో అదరగొడుతున్న సిక్కోలు క్రికెటర్

image

సిక్కోలుకు చెందిన యువ క్రికెటర్ సుశాంత్ అద్భుతంగా రాణిస్తున్నారు. కడప జిల్లాలో మూడు రోజులుగా జరుగుతున్న పోటీల్లో రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో 121, రెండో మ్యాచ్‌లో 107 పరుగులతో వరుసగా సెంచరీలు కొట్టారు. మూడో రోజు కృష్ణా జిల్లాపై 68 పరుగులతో సత్తా చాటారు. పరుగుల వరద పారిస్తున్న సుశాంత్‌ భవిష్యత్తులో ఇండియా టీమ్‌కు ఎంపిక కావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

News July 19, 2024

శ్రీకాకుళం జిల్లాకు భారీ వర్ష సూచన.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

జిల్లాలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్(08942-240557 నంబరు) ఏర్పాటు చేశామన్నారు. ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, మున్సిపల్, పంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

News July 19, 2024

శ్రీకాకుళంలో నేడు జాబ్ మేళా

image

శ్రీకాకుళం నగరంలోని బలగ జంక్షన్ వద్ద స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నేడు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొత్తలంక సుధ తెలిపారు. పలు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలకు 18-35 ఏళ్లలోపు యువతీయువకులు అర్హులన్నారు. అలాగే పదోతరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి ఉండాలన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News July 19, 2024

శ్రీకాకుళం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ ఏర్పాటు

image

3 రోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం వెల్లడించారు. వాతావరణ శాఖ (ఐఎండీ) జిల్లాలో మరింత ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపిందన్నారు. ముందు జాగ్రత్త చర్యగా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 08942-240557 (డిజాస్టర్ మేనేజ్ మెంట్) డీపీఎం ఫోన్ నంబర్ 7794082017ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News July 18, 2024

శ్రీకాకుళం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

➤ రేపు జిల్లాకు రానున్న కేంద్ర మంత్రి రామ్మోహన్
➤ ఆవు పొట్టలో 70 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు
➤ వినుకొండ ఘటన రాజకీయ హత్యే: ధర్మాన కృష్ణ దాస్
➤ శ్రీకాకుళం ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్‌కు దరఖాస్తులు ఆహ్వానం
➤ 9 నెలల్లో శ్రీకాకుళం స్టేడియం పనులు పూర్తి: అచ్చెన్న
➤ ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి: మంత్రి అచ్చెన్న
➤ రాజేశ్ వీర జవాన్ పార్థీవ దేహం కోసం ఎదురుచూపులు
➤ జిల్లా ఎస్పీ రాధికకు ఆత్మీయ వీడ్కోలు

News July 18, 2024

శ్రీకాకుళం: రేపు జిల్లాలో పర్యటించనున్న కేంద్ర మంత్రి

image

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం ఉదయం 9.40 గంటలకు ఇచ్ఛాపురం చేరుకొని స్వేచ్ఛావతి అమ్మవారిని దర్శించుకుని, మున్సిపల్ కార్యాలయంలో 10.30 గంటలకు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం పలు కార్యక్రమాలు పాల్గొంటారన్నారు.

News July 18, 2024

శ్రీకాకుళం: ఈ నెల 21న గ్రూప్-2 మాక్ టెస్ట్ 

image

ఎర్రన్న విద్యాసంకల్పం ద్వారా ఈ నెల 21న గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన మాక్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు తెలిపారు. జిల్లా కేంద్రంలో విద్యాధరి డిగ్రీ కళాశాల, టెక్కలి విశ్వజ్యోతి కళాశాల, పలాస మదర్ థెరిసా పాఠశాలలో ఈ పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు https://bit.ly/YVSexam లింక్ ద్వారా పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. 

News July 18, 2024

శ్రీకాకుళం జిల్లాలో 85.74 శాతం ప్రవేశాలు

image

ఉన్నత విద్యా మండలి ఇంజినీరింగ్ కళాశాల్లో సీట్ల అలాట్మెంట్‌ను బుధవారం ప్రకటించింది. ఏపీ ఈఏపీ సెట్-2024 ఎంపీసీ స్ట్రీమ్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఈ నెల ఒకటి నుంచి 13 వరకు ఆన్ లైన్‌లో నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు ఇంజినీరింగ్ కళాశాల్లో 2154 సీట్లు ఉండగా 1847 సీట్లకు (85.74%) ప్రవేశాలు జరిగాయి. 70 శాతం కన్వీనర్ కోటా, 30 శాతం మేనేజ్మెంట్ కోటాలో సీట్లను భర్తీ చేశారు.

News July 18, 2024

టెక్కలిలో నోటాకు ఓటెత్తారు

image

2024 అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలిలో నోటాకు రాష్ట్రంలోనే అత్యధికంగా 3.79% ఓట్లు పడ్డాయి. మొత్తంగా 7,342 మంది నోటాకు ఓటేశారు. ఈవీఎంలలో 3,660 మంది, పోస్టల్ బ్యాలెట్లలో 3,682 మంది నోటాకు జై కొట్టారు. పోలైన 1,93,713 ఓట్లలో అచ్చెన్న 55.71% ఓట్లు సాధించి టెక్కలిలో గెలిచారు. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తన నివేదికలో వెల్లడించింది.