Srikakulam

News June 23, 2024

శ్రీకాకుళం: రేపటి నుంచి ‘మీకోసం’

image

మీకోసం పేరుతో ఈనెల 24 నుంచి ప్రజా సమస్యల పరిష్కార, ఫిర్యాదుల వేదిక నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు తెలిపారు.  సోమవారం ఉదయం10 గంటల నుంచి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఇకపై ప్రతి సోమవారం ఫిర్యాదులు స్వీకరించి వాటికి సత్వర పరిష్కారం చేపడతామని చెప్పారు. సంబంధిత అధికారులు తప్పక హాజరుకావాలన్నారు.

News June 22, 2024

ఈనెల 24, 25 తేదీల్లో పలు రైళ్లు రద్దు

image

పలాస-విజయనగరం లైన్లో వంతెన పునర్నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 24, 25 తేదీల్లో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం కె. సందీప్ తెలిపారు. ఈనెల 24న పలాస-విశాఖ-పలాస ప్యాసింజర్ రైలు, విశాఖ-గుణుపూర్-విశాఖ ప్యాసింజర్ రైలు, 24న విశాఖ-బ్రహ్మపూర్ 25న బ్రహ్మపూర్-విశాఖ ఎక్స్ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 25న భువనేశ్వర్-విశాఖ రైళ్లు రద్దు చేశామన్నారు.

News June 22, 2024

తిరుమల శ్రీవారి ప్రసాదానికి సిక్కోలు బెల్లం

image

ఆముదాలవలస మండలం నిమ్మతోర్లాడ గ్రామంలో స్థానిక రైతులు పూర్తిగా ప్రకృతి సేద్యం ద్వారా బెల్లం తయారు చేస్తున్నారు. శ్రీవారి ప్రసాద పంపిణీలో ఈ బెల్లం వినియోగించేందుకు ఇటీవల అధికారులు దీని నాణ్యతను పరీక్షించారు. పూర్తి నాణ్యతగల బెల్లం కావడంతో శనివారం శ్రీవారి ప్రసాద వితరణకు ఆ బెల్లాన్ని తరలించారు. ఇది యావత్ సిక్కోలు ప్రజానీకానికి గర్వకారణమని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News June 22, 2024

శ్రీకాకుళం: పెరిగిన మద్దతు ధరతో అన్నదాతకు ఊరట

image

కేంద్ర ప్రభుత్వం 14 రకాల ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంచుతూ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వరి పంటకు మద్దతు ధర అధనంగా రూ.117 పెంచడంతో క్వింటాకు రూ.2300 చొప్పున రైతులకు గిట్టుబాటు కానుంది.
@ వేరుశనగ క్వింటాకు రూ.406,
@ మొక్కజొన్న రూ.135,
@ రాగి రూ.444,
@ మినుములు రూ.450 చొప్పున పెంచనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

News June 22, 2024

శ్రీకాకుళం: మంత్రి వెంకటస్వామికి ఆస్ట్రో ఎక్సలెన్స్ అవార్డు

image

నగరానికి చెందిన సంఘ సేవకుడు డాక్టర్ మంత్రి వెంకటస్వామిని ఇంటర్నేషనల్ ఆస్ట్రో ఎక్సలెన్స్ అవార్డు వరించింది. ఆస్ట్రో, మెడికల్, రత్నాల శాస్త్రవేత్తగా వెంకటస్వామి 4దశాబ్దాలుగా అందిస్తున్న సేవలకు గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఇంటర్నేషనల్ వేదిక్ ఆస్ట్రాలజీ ఫెడరేషన్ బృందం ప్రకటించింది. ఈ నెల 23న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో వెంకటస్వామికి ఈ అవార్డు అందజేస్తారు.

News June 22, 2024

నూతన డీజీపీని కలిసిన కేంద్ర మంత్రి రామ్మోహన్

image

ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న సమస్యల గురించి చర్చించారు.

News June 22, 2024

ఉత్తరాంధ్ర నుంచే ఐదుగురు స్పీకర్లు

image

1955లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన రొక్కం లక్ష్మీ నరసింహదొర స్పీకర్‌ అయ్యారు. 1983లో శ్రీకాకుళం ఎమ్మెల్యే తంగి సత్యనారాయణ స్పీకర్ స్థానానికి ఎన్నికయ్యారు. 1999లో ఎచ్చెర్ల ఎమ్మెల్యే కావలి ప్రతిభా భారతి స్పీకర్‌గా వ్యవహరించారు. 2019లో ఆముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం శాసనసభాపతి కాగా.. తాజాగా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

News June 22, 2024

శ్రీకాకుళం: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక దృష్టి సారించి, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా.మనజీర్ జీలాని సమూన్ ఆదేశించారు. నో డయేరియా పట్ల ముందస్తు చర్యలు చేపట్టి అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలన్నారు. శనివారం కలెక్టరేట్లో వైద్యారోగ్యశాఖకు సంబంధించిన పలు విభాగాల అధికారులు చేపడుతున్న సీజనల్ వ్యాధులపై ముందస్తు చర్యల గురించి సమీక్షీంచారు.

News June 22, 2024

శ్రీకాకుళం: గుండెపోటుతో వ్యక్తి మృతి

image

శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలకేంద్రంలోని స్థానిక మైత్రికాలనీలో గొండు రమేష్(38) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. ఇతనికి మూడేళ్ల పాప, రెండు నెలల బాబు ఉన్నారు. కార్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబపోషణ చేసేవారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు వేడుకుంటున్నారు.

News June 22, 2024

శ్రీకాకుళం: ప్రియుడు ఇంటి ఎదుట ప్రియురాలి నిరసన

image

ప్రియుడి ఇంటిముందు న్యాయం కోసం ప్రియురాలు నిరసనకు దిగిన ఘటన సోంపేట మండలంలో జరిగింది. రాజాం గ్రామానికి చెందిన డొక్కరి చిరంజీవి తనని ప్రేమించి, పెళ్లిచేసుకుంటానని నమ్మించి వేరే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడని మందస మండలం జిళ్లందకు చెందిన ఓ యువతి తెలిపింది. శుక్రవారం ప్రియుడి ఇంటి ఎదుట నిరసన తెలిపింది. తనకు న్యాయం చేసి ఆదుకోవాలని వేడుకుంది. ఈ మేరకు మందస పోలీసులకు ఫిర్యాదుచేసింది