India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆర్మ్డ్ పోలీస్ విభాగం అధికారులు, సిబ్బంది సంపూర్ణ సహకారం అందించారని ఎస్పీ జీ.ఆర్ రాధిక కొనియాడారు. సోమవారం ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో ఆర్మ్డ్ రిజర్వ్ యాత్రంగం ఆధ్వర్యంలో సెరేమోని పరేడ్ నిర్వహించారు. పరేడ్‌లో భాగంగా ఆమె గౌరవ వందనం సమర్పించారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆమె DGP కార్యాలయంలో రిపోర్ట్ చేయనున్న విషయం విదితమే.
పొలం పని చేస్తూ వీరఘట్టం మండలం చిట్టపులివలసకు చెందిన జక్కు కృష్ణ (65)అనే రైతు సోమవారం మృతి చెందాడు. ఉదయం ఇంటి వద్ద అల్పాహారం తీసుకుని కూలీ పని కోసం గ్రామానికి చెందిన మరో రైతు పొలంలో పార పని చేస్తుండగా ఒక్కసారిగా కృష్ణ కుప్పకూలిపోయాడని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటివరకు చిన్న జ్వరం కూడా రాని కృష్ణ ఒక్కసారి గుండెపోటుతో మృతి చెందడం స్థానికుల్ని కలిచివేసింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పూరి జగన్నాథ స్వామి రథయాత్ర సందర్భంగా ఈ నెల 15, 16, 17వ తేదీల్లో టెక్కలి మండలం నౌపడ స్టేషన్ నుంచి పూరికి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా 15, 16వ తేదీల్లో నౌపడ నుంచి రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ రైలు నౌపడ బయలుదేరి మధ్యాహ్నం 12:05 కి పూరి చేరుకుంటుంది. తిరిగి 15, 17వ తేదీల్లో రాత్రి 11 గంటలకు పూరీలో బయలుదేరి మరుసటి రోజు ఉదమం 6:40కు నౌపడ చేరుకుంటుంది.
ఆర్థిక ఇబ్బందులు ఓ రైతు ప్రాణం తీశాయి. ఎస్సై జనార్దనరావు వివరాల ప్రకారం.. పెద్దరాజులగుమ్మడకు చెందిన ఆర్.కృష్ణమూర్తి (46) రైతు శనివారం సాయంత్రం గ్రామ సమీపంలోని పొలంలో పురుగు మందు తాగాడు. స్థానికులు గమనించి ఓ ప్రైవేటు వాహనంలో పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి విశాఖకు తరలిస్తుండగా మార్గమధ్యలో అదే రోజు రాత్రి మృతిచెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
కాకినాడ జిల్లా గొల్లప్రోలులో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న జి.కృష్ణారావు గుండెపోటుతో మృతి చెందారు. నందిగాం మండలం కల్లాడ గ్రామానికి చెందిన కృష్ణారావు కాకినాడ డీసీఆర్బీలో ఏఎస్సైగా పని చేశారు. కాకినాడలోని రాయుడుపాలెంలో తన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం కృష్ణారావుకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఎస్పీగా కేవీ మహేశ్వరరెడ్డి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఆదివారం రాత్రే ఎస్పీ నగరానికి చేరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది ఎస్పీలు శనివారం బదిలీ అయిన విషయం తెలిసిందే. ఎస్పీగా కేవీ మహేశ్వరరెడ్డి విధుల్లో చేరనుండటంతో ఇంతకు ముందు పనిచేసిన ఎస్పీ జీఆర్ రాధిక సోమవారం రిలీవ్ అయ్యి నేరుగా డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయనున్నారు.
ఒడిశాలోని పర్లాఖెముండి జిల్లా కేంద్రానికి సమీపంలో పాతపట్నం, కె.గోపాలపురం, హెచ్.గోపాలపురం ఉన్నాయి. పర్లాఖెముండికి పెద్ద డ్రైనేజీ వ్యవస్థ ఉంది. ప్లాస్టిక్, ఆసుపత్రిలోని వస్తువులు శివారులోని కాలువలోకి వెళ్లేలా అనుసంధానం చేశారు. వారి సరిహద్దు వరకు కాలువలను చేసి గోపాలపురం వరకు వదులుతున్నారు. ఈ సమస్య కొన్నేళ్లుగా ఉండటంతో ఇరురాష్ట్రాల సరిహద్దు వద్ద అడ్డుగోడ నిర్మించారు. అయినా పరిస్థితి మారలేదు.
మహాశివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి బ్రహ్మ కమలం పుష్పాలు. ఇవి సాధారణంగా హిమాలయ పర్వతాలు, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ మొక్కలపై ఆకులే ఏడాదికి ఒక్కసారి పువ్వులా వికసిస్తాయి. అలాంటి బ్రహ్మ కమలం పుష్పాలు బారువలో కరుమోజు జీవనరావు పెరటిలో నిన్న రాత్రి బ్రహ్మ కమలం చెట్టుకు ఆరు పుష్పాలు విరిసాయి. బ్రహ్మ కమలం చూడటం వలన శివుడిని చూసినంత – ఆనందంగా ఉందని పలువురు భక్తులు అన్నారు.
విజయవాడ డివిజన్‌లో ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా వెళ్లే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (నం.11019) ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ ఆగస్టు 2, 3, 5, 7, 9, 10వ తేదీలలో విజయవాడ-ఏలూరు మీదుగా కాక రాయనపాడు-గుడివాడ- భీమవరం గుండా నిడదవోలు చేరుకుంటుందన్నారు. ఆయా తేదీల్లో ఈ ట్రైన్‌కు ఏలూరు, తాడేపల్లిగూడెంలో స్టాప్ లేదని పేర్కొన్నారు.
టెక్కలి మండలంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. టెక్కలి-శ్రీకాకుళం మార్గంలో బొప్పాయిపురం గ్రామం వద్ద లారీ ఢీకొని వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మొదట నేషనల్ హైవే అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన శివ(52)గా పోలీసులు గుర్తించారు.
Sorry, no posts matched your criteria.