India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో జరగదని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ప్లాంట్ నష్టాలకు కారణాలను వివరించారు. ఒక టన్ను స్టీల్ ఉత్పత్తి చేయడానికి టన్నున్నర ముడిసరుకు అవసరం అన్నారు. ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేయకపోవడమే నష్టాలకు ప్రధాన కారణం అన్నారు.
VMRDA పరిధిలో తాజాగా 550 అనధికార లేఅవుట్లను గుర్తించామని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. వీటికి ఇన్ ప్రిన్సిపల్ లేఅవుట్ పాట్రన్ (I.P.L.P) తయారు చేయాల్సి ఉందన్నారు. అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు (L.R.S) ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించి, అనధికార లేఅవుట్ల జాబితాలు తీసుకున్నట్లు వెల్లడించారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం విశాఖ వచ్చిన జాతీయ మహిళా కమిషన్ మెంబర్ డా.అర్చనా మజుందార్‌కి కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ స్వాగతం పలికారు. అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్, సీపీ శంఖబ్రత బాగ్చి, ఇతర అధికారులతో కలిసి బాధిత మహిళల నుంచి మజుందార్ వినతులు స్వీకరిస్తున్నారు.
విశాఖను సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేస్తోంది. నగరంలో పలు చోట్ల స్మార్ట్ సిటీ నిధులతో ఆకర్షణీయ చిత్రాలు, బొమ్మలు తీర్చి దిద్దుతున్నారు. ఇక్కడి వరకు అధికారులు ప్రజల నుంచి మన్ననలు అందుకుంటున్నా తర్వాత వాటి అతీగతి పట్టించుకోవడంలేదని విమర్శలు మూటగట్టుకున్నారు. డెయిరీ ఫారం, ఆదర్శనగర్ కూడలిలో ఓ బొమ్మ చేయి విరిగి అధ్వానంగా ఉన్నా పట్టించుకున్న దాఖలాలులేవని మండిపడ్డుతున్నారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్‌లో సోమవారం 110 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్‌లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.
కేంద్ర రక్షణశాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. మ.12.30 నిమిషాలకు I.N.S సర్కార్‌కు చేరుకొని ఉదయగిరి, హిమగిరి అనే నౌకలను ప్రారంభించనున్నారు. ఆయన ప్రసంగించిన తర్వాత సాయంత్రం 5.25 నిముషాలకు తిరిగి బయలుదేరుతారు. V.V.I.P రాక సందర్భంగా విశాఖపట్నం పోర్ట్ రోడ్డులో రేపు భారీ వాహనాలకు అనుమతి లేదని పోర్టు అధికారులు తెలిపారు.
జిల్లాలో సోమవారం 5,616 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశామని జేసీ మయూర్ అశోక్ తెలిపారు. ఈనెల 31 వరకు సచివాలయాల సిబ్బంది ద్వారా స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఇంటి వద్దనే పంపిణీ చేస్తామన్నారు. సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు సంబంధిత రేషన్ దుకాణాల వద్ద పంపిణీ చేస్తామన్నారు. పాత బియ్యం కార్డు, ఆధార్ అనుసంధానమైన మొబైల్ నంబరుతో సచివాలయ సిబ్బంది నుంచి స్మార్ట్ కార్డులు తీసుకోవాలన్నారు.
విశాఖ కలెక్టరేట్ మీటింగు హాలులో సోమవారం ఉదయం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన 329 వినతులు అందాయి. కలెక్టర్ హరేందర్ ప్రసాద్ స్వయంగా అర్జీలను స్వీకరించారు. వాటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 141, జీవీఎంసీకి చెందినవి 72, పోలీస్ శాఖకు సంబంధించినవి 17 ఉండగా ఇతర శాఖలకు చెందినవి 99 ఫిర్యాదులు వచ్చాయి.
ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు 40వ జాతీయ నేత్ర దాన పక్షోత్సవాలు జరుగుతాయని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ మీటింగు హాలులో పోస్టర్‌ను ఆవిష్కరించారు. నేత్రదానంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. డీఎం & హెచ్వో జగదీశ్వరరావు, ప్రాంతీయ నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్ ఉన్నారు.
జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 114 వినతులు వచ్చాయి. ఈ వినతులను జివిఎంసి అదనపు కమీషనరు ఎస్.ఎస్.వర్మ తీసుకున్నారు. ఇందులో అకౌంట్స్ విభాగానికి 4, రెవెన్యూ 19, ప్రజారోగ్యం 08, పట్టణ ప్రణాళిక 55, ఇంజినీరింగు 19, మొక్కల 03, యుసిడి విభాగమునకు 06 కలిపి మొత్తంగా 114 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.