Visakhapatnam

News September 4, 2024

ఉమ్మడి విశాఖ జిల్లాకు ఎల్లో అలర్ట్

image

రానున్న 24 గంటల్లో బంగాళాఖాతం సమీప ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. అల్లూరి, అనకాపల్లి, విశాఖ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. సముద్రతీరం వెంబడి 35-45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరించారు.

News September 4, 2024

ఆలస్యంగా బయలుదేరనున్న గరీబ్‌రథ్, గోదావరి

image

సికింద్రాబాద్ నుంచి విశాఖకు రావాల్సిన గరీబ్‌రథ్ బుధవారం రాత్రి 8:30 కాకుండా 10:30కు, గోదావరి ఎక్స్‌ప్రెస్ నాంపల్లిలో సాయంత్రం 6:35కి బయలుదేరనున్నాయి. గోదావరి ఎక్స్ ప్రెస్‌ను పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ మీదుగా మళ్లించనున్నారు. అలాగే మహబూబ్ నగర్-విశాఖ, ముంబై ఎల్‌టీటీ-విశాఖ రైళ్లను సైతం పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ మీదుగా మళ్లించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

News September 4, 2024

ఢిల్లీ- విశాఖ విమానానికి బాంబు బెదిరింపు కాల్‌

image

ఢిల్లీ నుంచి మంగళవారం సాయంత్రం 5.40 గంటలకు విశాఖ బయలుదేరిన ఏఐ 471 ఎయిరిండియా విమానంలో బాంబు ఉందని ఢిల్లీ విమానాశ్రయానికి ఓ అగంతకుడి నుంచి బెదిరింపు కాల్‌ రావడంతో కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన అక్కడి అధికారులు విశాఖ విమానాశ్రయానికి తెలిపారు. రాత్రి 8.05 గంటలకు ఇక్కడికి చేరుకున్న విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అపాయం లేదని నిర్ధారించిన అధికారులు రాత్రి 12 గంటలు దాటిన తరువాత ఢిల్లీ పంపారు.

News September 4, 2024

గాజువాక: ఉద్యోగులు, కార్మికుల సంఖ్య కుదింపు లక్ష్యం

image

విశాఖ స్టీల్‌ప్లాంటులో ఉద్యోగులు, కార్మికుల సంఖ్య కుదింపునకు యాజమాన్యం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పుడున్న వారిలో మూడో వంతు 2025 మార్చికి తగ్గించాలని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ మేరకు యాజమాన్యం రకరకాల పేర్లతో సిబ్బందిని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. 12 వేల మంది కాంట్రాక్టు కార్మికుల్లో 33 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆంక్షలు పేరిట కొన్ని విభాగాల్లో పనిదినాలు తగ్గించేసింది.

News September 4, 2024

రద్దు చేసిన దూర ప్రాంత ఆర్టీసీ సర్వీసుల పునరుద్ధరణ

image

భారీ వర్షాల కారణంగా రద్దు చేసిన దూర ప్రాంతాల సర్వీసులన్నింటినీ ఆర్టీసీ విశాఖ రీజియన్‌ అధికారులు పునరుద్ధరించారు. వర్షాలు తగ్గుముఖం పట్టడం, రోడ్ల మీద వరద ప్రవాహం తగ్గడంతో విజయవాడ, గుంటూరు జిల్లాలకు వెళ్లాల్సిన 14 బస్సులు, విజయవాడ, ఆపై ప్రాంతాల నుంచి విశాఖ రావలసిన ఆరు బస్సులను పునరుద్ధరించారు. విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్లాల్సిన బస్సును మాచర్ల మీదుగా నడుపుతున్నారు.

News September 4, 2024

విశాఖ: తుప్పల్లో పసికందు మృతదేహం

image

పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో వాడ చీపురుపల్లి జడ్పీ హైస్కూల్ వెనుక తుప్పల్లో మృతదేహం లభ్యం అయింది. అబార్షన్ ద్వారా బయటపడిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు విడిచిపెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. శిశువు మృతదేహానికి చీమలు పట్టి ఉన్నాయి. వీఆర్వో రొంగలి హేమలత మంగళవారం రాత్రి పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మల్లికార్జునరావు తెలిపారు.

News September 4, 2024

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈపీడీసీఎల్ విస్తృత సేవలు

image

విజయవాడ పరిసర ప్రాంతాలలో ఏపీఈపీడీసీఎల్ ఉద్యోగులు విస్తృత సేవలు అందిస్తున్నారు. సీఎండీ పృథ్వీతేజ్ ఆధ్వర్యంలో విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ ఇతర సమస్యలను పరిష్కరించేందుకు సుమారు 60 మంది ఉద్యోగులు విజయవాడ చేరుకున్నారు. వీరు 64 బృందాలుగా ఏర్పడి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదిక మీద చేపడుతున్నారు.

News September 3, 2024

విశాఖ రేంజి పరిధిలో 13 మంది ఎస్ఐలు బదిలీ

image

విశాఖ రేంజి పరిధిలో 13 మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ రేంజి డీఐజీ గోపినాథ్ జెట్టి ఉత్తర్వులు జారీ చేశారు. డుంబ్రిగూడ ఎస్ఐగా కె.పాపినాయుడును నియమించారు. కే.సంతోష్‌ను డుంబ్రిగూడ పీఎస్ నుంచి విశాఖ వి. ఆర్‌కు, సూర్యనారాయణను చోడవరం పీఎస్ నుంచి పాడేరు పీఎస్‌కు, కె.రమణను పెదబయలు పిఎస్ కు, పెదబయలు ఎస్ ఐ మనోజ్‌ను విశాఖ వీ.ఆర్‌కు బదిలీలు చేశారు.

News September 3, 2024

విశాఖ: మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు..!

image

తీవ్ర కడుపునొప్పితో ఆగస్టు 28న ఓ మహిళ విశాఖ కేజీహెచ్‌లో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు కడుపులో 24 వారాల శిశువు ఎముకల గూడు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సర్జరీ చేసి వాటిని తొలగించారు. ఆమె 3 ఏళ్ల క్రితం గర్భం దాల్చగా.. అబార్షన్‌కు మందులు వాడారని అప్పటి నుంచి నొప్పితో బాధపడుతున్నారని వైద్యులు చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులు ఇప్పటివరకు 25లోపే నమోదైనట్లు వైద్యులు తెలిపారు.

News September 3, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌ సీఎండీగా శక్తిమణి

image

విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ పోస్టుకు న్యూఢిల్లీలో నిర్వహించిన ఇంటర్వ్యూలో ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావన్కోర్ కార్పొరేషన్ ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.శక్తిమణి ఎంపికయ్యారు. ఈ పోస్ట్‌కు దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ ఈడీ దీప్తెండు కూడా ఇంటర్వ్యూకి హాజరు కాగా అర్హతులను బట్టి శక్తిమణిని పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు ఎంపిక చేసింది. కాగా ప్రస్తుత సీఎండీ అతుల్‌భట్ నవంబర్‌లో రిటైర్ అవుతున్నారు.