India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశాఖలో మంగళవారం ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేశారు. డ్రైవర్ హెల్మెట్ లేకుండా-1,132, పిలియన్ రైడర్-293, ట్రిపుల్ రైడింగ్-57, ఓవర్ స్పీడ్-225, సెల్ఫోన్ డ్రైవింగ్-19, డ్రైవింగ్ లైసెన్స్-6, మైనర్ డ్రైవింగ్-4, రాంగ్ పార్కింగ్-148, డ్రంకెన్ డ్రైవ్-34, మోటర్ చట్టం ఉల్లంఘించిన వాహనాలు-630, సీజ్ చేసినవి-63, 34 బస్సులు తనిఖీ చేసి రూ.1.40 లక్షల జరిమానాతో పాటు 2,434 కేసులు నమోదు చేశారు.

మద్యం విక్రయాల్లో రాష్ట్రంలో విశాఖ ప్రథమ స్థానంలో నిలిచింది. విశాఖలో 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.2010.95 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. ఇందులో మద్యం బాక్సులు 23.63 లక్షలు, బీర్ బాక్సులు19.78 లక్షలు ఉన్నాయి. 2024-25లో రూ.1943.58కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా.. 2025-26లో దీనిపై 3శాతం పెరిగాయి.

ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ విభజనపై రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. భీమిలి, పద్మనాభం, ఆనందపురం మండలాల్లోని 64 గ్రామాలు మినహా మిగతా ప్రాంతం జీవీఎంసీ పరిధిలో ఉంది. ఈ గ్రామాలను జీవీఎంసీలో విలీనం చేయాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. అయితే అలా చేస్తే ZPTC, MPTCలు లేని జిల్లాగా మారే పరిస్థితి ఉంది. విలీనం చేయకపోతే ఈ 3 మండలాలతోనే జిల్లా పరిషత్ కొనసాగిస్తారా? అన్నదానిపై అనిశ్చితి నెలకొంది.

జీవీఎంసీ 2025 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను వసూళ్లలో రికార్డు సృష్టించింది. మొత్తం రూ.620.08 కోట్లు వసూలు చేసి గత ఏడాదితో పోలిస్తే గణనీయమైన వృద్ధి నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి రూ.510.15 కోట్లు వసూలు కాగా, ఈసారి సుమారు రూ.109 కోట్లు అధికంగా రావడం విశేషం. ముఖ్యంగా మార్చి 31 లోపు బకాయిలు (అరియర్స్) చెల్లిస్తే వడ్డీపై 50% రాయితీ ప్రకటించడంతో చెల్లింపుదారులు ముందుకు వచ్చారు.

విశాఖ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. సోమవారం ట్రాఫిక్ పోలీసులు నమోదు చేసిన కేసుల వివరాలు.. హెల్మెట్ ధరించని వారిపై-1217, రైడర్ హెల్మెట్-235, ట్రిపుల్ రైడింగ్-69, సెల్‌ఫోన్ డ్రైవింగ్-28, విత్ అవుట్ లైసెన్స్ -2, మైనర్ డ్రైవింగ్ -3, రాంగ్ పార్కింగ్-103, డ్రంకెన్ డ్రైవ్-34, సీజ్ చేసిన వాహనాలు-56తో కలిపి మొత్తం 2,388 కేసులు నమోదు చేశారు.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, పోలీస్ శాఖ కలిసి పని చేయాలని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి అన్నారు. మంగళవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో 35 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లతో సమావేశం నిర్వహించారు. తక్కువ మార్కులతో కుంగిపోతున్న విద్యార్థులకు భరోసా, ఐపీఎల్ బెట్టింగ్‌లతో నష్టపోతూ ప్రాణాలు తీసుకుంటున్న వారికి, డ్రగ్స్ మత్తులో ఉన్నవారికి ధైర్యం కలిగించేలా సందేశాలు ఉండాలన్నారు.

అచ్యుతాపురం (M) మనోహర్ హాస్టల్ పైనుంచి పడి యువకుడు మృతి చెందాడు. ఆనందపురం ప్రాంతానికి చెందిన అలబాని రామకృష్ణ (22) మంగళవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు హాస్టల్ పైనుంచి పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి తండ్రి సూర్యనారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు CI చంద్రశేఖర్ చెప్పారు.

విశాఖ పోర్టు కార్గో హ్యాండ్లింగ్‌లో 2025-26ఆర్థిక సంవత్సరానికి రికార్డు నెలకొల్పింది. ఈనెల 28 నాటికి 90.29 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ చేసి రికార్డు నెలకొల్పినట్లు పోర్ట్ అథారిటీ అధికారులు తెలిపారు. రాక్ ఫాస్పేట్, స్టీల్ ప్లేట్స్, గ్రానైట్, ఆయిల్, తదితర ముఖ్య సరకులు వీటిలో ఉన్నాయి. కేంద్ర నౌకాయన మంత్రిత్వశాఖ ఇచ్చిన టార్గెట్‌ను పూర్తి చేసి ప్రగతిపథం వైపు దూసుకుపోతోందని అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.