India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశాఖలో 10 రోజులుగా రవాణా శాఖ అధికారులు కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై 16 కేసులు నమోదు చేసినట్టు ఉప రవాణా కమిషనర్ ఆర్‌సీహెచ్.శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అనుమతులు లేకుండా నడపడం, పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించడం, పన్నులు చెల్లించకపోవడం వంటివి డ్రైవ్‌లో గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన 16 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.6,94,000 ఫైన్ విధించారు.

విశాఖ జిల్లా కలెక్టర్‌గా హరేంధిర ప్రసాద్ అందించిన సేవలు అభినందనీయమని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కొనియాడారు. 20 నెలల్లో ఎన్నో రకాలుగా ప్రజలకు ఉత్తమమైన సేవలందించారని ఆయన గుర్తు చేశారు. పరిపాలనా పరమైన అంశాల్లో, ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైన ముద్ర వేసుకున్నారని ప్రశంసించారు. ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఎమ్మెల్యేలు అన్నారు.

తణుకు పురపాలక సంఘం 2021-22లో భూముల స్వాధీనం పేరుతో TDR బాండ్లు జారీ చేయడం వివాదానికి దారి తీసింది. సుమారు 21 ఎకరాల భూమికి గజాల లెక్కన రూ.800 కోట్ల విలువైన బాండ్లు ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. మార్కెట్ విలువ కంటే 4 రెట్లు ఎక్కువగా బాండ్లు జారీ చేసినట్టు విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం ప్రభుత్వం బాండ్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టగా, కొనుగోలుదారులు హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది.

తణుకు TDR బాండ్ల వివాదానికి ముగింపు లభించింది. హైకోర్టు ఆదేశాలతో బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న బాండ్లపై ఆంక్షలు తొలగాయి. స్టాంపులు & రిజిస్ట్రేషన్ శాఖ మెమో జారీ చేయడంతో రిజిస్ట్రేషన్లు మళ్లీ ప్రారంభమయ్యాయి. బ్యాంకులు కూడా రుణాలు మంజూరు చేయడం ప్రారంభించాయి. గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్న బిల్డర్లకు ఇది పెద్ద ఊరటగా మారింది. ముఖ్యంగా విశాఖలో సుమారు 800 మంది బిల్డర్లకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగించింది.

ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభమైన నేపథ్యంలో బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపనున్నట్టు విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి సోమవారం తెలిపారు. నగరంలో బెట్టింగ్ నిర్వాహకులపై, ఆన్‌లైన్ బుకీలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలన్నారు. ఎక్కడైనా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100, 112 నంబరుకు గానీ సీపీ నంబర్ 7995095799కి సమాచారం ఇవ్వాలన్నారు.

జనన, మరణ ధ్రువపత్రాల జారీ ప్రక్రియను సచివాలయాలు, మీసేవ కేంద్రాల్లో నిలుపుదల చేసినట్టు GVMC ప్రధాన వైద్యాధికారి నరేశ్ కుమార్ సోమవారం తెలిపారు. ఇకపై సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పోర్టల్ ద్వారా GVMC అన్ని జోనల్ కార్యాలయాల్లో జారీ చేయబడతాయన్నారు. సచివాలయలకు వచ్చిన ప్రజలకు జోనల్ కార్యాలయాలకు వెళ్లాలని సిబ్బంది సూచించాలన్నారు.

Sorry, no posts matched your criteria.