India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ సంబంధిత సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ప్రతి సోమవారం డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి నిర్వహిస్తున్నారు. విద్యుత్ వినియోగదారులు ఫోన్ నంబరు 8688400499 ద్వారా విద్యుత్ సంబంధిత సమస్యలను తెలియజేయవచ్చు. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

విశాఖలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు RTC కాంప్లెక్స్ సమీపంలో వినూత్నంగా ‘స్మోగ్ టవర్’ను ఏర్పాటు చేశారు. సౌరశక్తితో నడిచే ఈ టవర్ చుట్టుపక్కల గాలిలోని హానికరమైన ధూళి కణాలను (PM 2.5, PM 10) ఫిల్టర్ చేసి, స్వచ్ఛమైన గాలిని విడుదల చేస్తుంది. తక్కువ ఖర్చుతో పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా రూపొందించిన ఈ పరికరం నగరవాసుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అధికారులు భావిస్తున్నారు.

విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం ఉదయం ఉత్తర్వులు విడుదల చేసింది. హరేంధిర ప్రసాద్‌ను కాకినాడకు ట్రాన్స్‌ఫర్ చేశారు. అయితే విశాఖ జిల్లా కలెక్టర్‌గా ఎమ్.అభిషిక్త్ కిషోర్‌ను నియమిస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. విశాఖ కలెక్టర్‌గా హరేంధిర ప్రసాద్ అనేక సంస్కరణలు చేపట్టారు.

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

విశాఖలో చికెన్ ధరలు ఆదివారం (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. చికెన్ లైవ్ రూ.140, విత్ స్కిన్ రూ.250, స్కిన్‌లెస్ 260, సొంఠ్యాం కోడి కేజీ రూ.320 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా మటన్ కేజీ రూ.1000, కోడిగుడ్లు డజన్ రూ.55గా పలుకుతున్నాయి. వీటితోపాటు చేపలు, రొయ్యిల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

విశాఖలో చికెన్ ధరలు ఆదివారం (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. చికెన్ లైవ్ రూ.140, విత్ స్కిన్ రూ.250, స్కిన్‌లెస్ 260, సొంఠ్యాం కోడి కేజీ రూ.320 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా మటన్ కేజీ రూ.1000, కోడిగుడ్లు డజన్ రూ.55గా పలుకుతున్నాయి. వీటితోపాటు చేపలు, రొయ్యిల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

విశాఖ నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్లే సమతా ఎక్స్‌ప్రెస్(12807/12808)ను APRలో కొన్నిరోజులు రద్దు చేశారు. గోండియా స్టేషన్‌లో పనుల కారణంగా, రైలు సర్వీసులను క్యాన్సిల్ చేశారు. APR 5, 7, 8, 9, 11, 12, 14, 15, 16, 18, 19, 21, 22, 23 తేదీలలో విశాఖ నుంచి నిజాముద్దీన్ వెళ్లే రైళ్లను.. APR 7, 9, 10, 11, 13, 14, 16, 17, 18, 20, 21, 23, 24, 25 తేదీలలో హజరత్ నిజాముద్దీన్ నుంచి విశాఖ వచ్చే రైళ్లను రద్దు చేశారు.

విశాఖ జిల్లా డీఆర్వోగా విశ్వేశ్వర నాయుడును ఇటీవల ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రభుత్వ లక్ష్యాల మేరకు విశాఖ జిల్లా అభివృద్ధిలో భాగస్వామినవుతానని పేర్కొన్నారు.

విశాఖ రోడ్లు రక్తమోడుతున్నాయి. జిల్లాలో 2025లో 1,110 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా 340 మంది మృతి చెందారు. లారీలు, ట్యాంకర్ల వల్ల 140 ప్రమాదాల్లో 80 మంది చనిపోగా 104 మంది గాయపడ్డారు. హిట్ అండ్ రన్ కేసులు 43 నమోదై, 25 మంది మృతిచెందగా 26 మందికి గాయాలయ్యాయి. ప్రమాదాలు 4% తగ్గినా మరణాలు తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్యే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.

విశాఖ జిల్లాలో HPCL, BPCL, IOCL కలిపి 62 గ్యాస్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. సుమారు 8.50 లక్షల గృహ వినియోగదారులు ఉన్నారు. ప్రస్తుతం రోజుకు 22 వేలకుపైగా సిలిండర్లు ఏజెన్సీలకు పంపిణీ చేస్తున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఇంకా 1.70 లక్షల మంది వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉన్నారు. రోజుకు 20 వేల సిలిండర్లు సరఫరా చేసినా పెండింగ్ పూర్తిగా క్లియర్ కావడానికి కనీసం 8 రోజులు పట్టే పరిస్థితి నెలకొంది.
Sorry, no posts matched your criteria.