India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమిషనరేట్‌కు సోమవారం 125 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్‌లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.

సింహాద్రి అప్పన్నకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు 19 రోజులకు గానూ ఆలయ అధికారులు ఈవో వెంకట్రావు పర్యవేక్షణలో సోమవారం లెక్కించారు. మొత్తం రూ.1,50,15,839 ఆదాయం వచ్చింది. బంగారం 68.200 గ్రాములు, వెండి 6.475 కిలోలు, 9 విదేశాల కరెన్సీ నోట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, సేవా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

పీజీఆర్ఎస్‌లో వచ్చిన అర్జీలకు గడువులోగా పరిష్కారం చూపకపోతే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి హెచ్చరించారు. సోమవారం ఉదయం అర్జీదారుల నుంచి జేసీ వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై సాధారణ పీజీఆర్ఎస్‌కు 294 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ విభాగానికి చెందినవి 50, జీవీఎంసీ 69 ఉన్నాయి. ఇతర అన్ని శాఖలకు సంబంధించినవి 145 వినతులు రాగా పోలీస్ శాఖకు చెందినవి 30 ఉన్నాయి.

మధురవాడ వైజాగ్ కన్వెన్షన్‌లో జీరో పావర్టీ పీ4 కార్యక్రమ తొలి వార్షికోత్సవాన్ని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లాలో 1,05,186 బంగారు కుటుంబాలను గుర్తించగా.. 66,013 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మార్గదర్శులు, బంగారు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించారు.

విశాఖ జిల్లా కోర్టుకు బాంబ్ బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు కోర్టు ప్రాంగణాన్ని పూర్తిగా తనిఖీ చేశాయి. అనుమానాస్పద వస్తువులు ఏవీ లభించలేదు. ఈ మెయిల్ తమిళనాడు నుంచి పంపినట్లు గుర్తించి సైబర్ పోలీస్‌లు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల ఇదే కోర్టుకు రెండోసారి బెదిరింపు రావడం ఆందోళన కలిగిస్తోంది.

ఆస్తిపన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ జీవీఎంసీకి కలిసొచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.552.50 కోట్లు వసూలై, గత ఏడాదితో పోలిస్తే రూ.116.3 కోట్లు అధికంగా నమోదయ్యాయి. మొత్తం లక్ష్యం రూ.569.59 కోట్లు కాగా, చివరి రెండు రోజుల్లో మరో రూ.60 కోట్లు వసూలవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 31లోగా రాయితీ ఉండటంతో పన్ను చెల్లింపులు పెరిగాయి.

సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సర్వేలో నిర్లక్ష్యం వహించడంతో ముగ్గురిని సస్పెండ్ చేస్తూ మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ ఎస్‌ఎస్ వర్మ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త రోడ్డు సచివాలయానికి చెందిన రాజేశ్వరి, రెల్లి వీధి సచివాలయం శ్యామలరావు, దస్పల్ల హిల్స్ సచివాలయం కృష్ణారావులను సస్పెండ్ చేశారు. ఇటీవల నిర్వహించిన ఇంటింటి సర్వేలో కొందరిని చనిపోయినట్లుగా వీరు నమోదు చేశారని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.