India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ వన్‌టౌన్ పరధిలో ఆదివారం అర్ధరాత్రి గన్‌తో కాల్పుల ఘటన కలకలం రేపింది. చిలకపేటలో నివాసం ఉంటున్న రాజేశ్‌పై నూకరాజు అనే వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. మద్యం మత్తులో వీరి మధ్య వివాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బాధితుడు ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. అతని ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతని వద్దకు గన్ ఎలా వచ్చిందో తెలియాల్సి ఉంది.
కంచరపాలెంలో ఆగస్టు 12న కారు ఢీకొని <<17386606>>బాలుడు మృతి<<>> చెందిన ఘటనలో తమిళనాడుకు చెందిన నిందితుడు అర్జునన్‌ను పోలీసులు రిమాండ్‌కు పంపారు. అతను విజయవాడలో కారును అద్దెకు తీసుకుని అరకులో21kgల గంజాయి కొని వస్తుండగా యాక్సిడెంట్ అయ్యింది. ఘటన జరిగిన రోజు స్థానికులు అతనికి దేహశుద్ధి చేయగా..తాళాలు పోయాయి. విజయవాడ నుంచి తాళాలు తెప్పించి ఆదివారం తనిఖీ చేయగా కారులో గంజాయి ఉన్నట్లు గుర్తించామని CI రవికుమార్ తెలిపారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం విశాఖ రానున్నారు. ఏలూరు పర్యటన అనంతరం గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని ఉన్నారు. రాత్రి 8 గంటలకు విశాఖ విమానాశ్రయానికి వస్తారు. అక్కడి నుంచి నోవాటెల్ హోటల్‌కి వెళ్లి రాత్రి బస చేయనున్నారు. 19వ తేదీన జిల్లాలో నిర్వహించనున్న పలు కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు.
విశాఖలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లాలోని అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాలలకు సెలవిచ్చినట్లు డీఈఓ ప్రేమ్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల విషయాన్ని గమనించాలని సూచించారు.
విశాఖలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లాలోని అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పాఠశాలలకు సెలవిచ్చినట్లు డీఈఓ ప్రేమ్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల విషయాన్ని గమనించాలని సూచించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నృసింహస్వామి వారి దేవాలయంలో 22వ తేదీన ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో వి.త్రినాథ్ రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆరోజు సుప్రభాతం, ఆరాధన, లక్ష కుంకుమార్చన సేవలు మినహా మిగతా ఆర్జిత సేవలు అయిన నిత్య కళ్యాణం, గరుడ వాహన సేవ, సహస్రనామార్చన మొదలైన సేవలను రద్దు చేసినట్టు తెలిపారు.
సింహాచలం అప్పన్న దేవాలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల 22వ తేదీన మహిళలచే సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వి.త్రినాథ్ రావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 18వ తేదీన కొండపైన PRO ఆఫీసులో ఆధార్ కార్డు చూపించి తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అలా వచ్చిన వారికి వ్రతం రోజు కొండ క్రింద నుండి పైకి, పైనుండి కిందకి ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్ సమీపంలోని వెల్డింగ్ దుకాణంలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఘటన జరిగిన రోజే ముగ్గురు మరణించగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో నిన్న గంగారావు మరణించగా.. ఈరోజు ఎల్లాజీ కన్నుమూశాడు. మరొకరు చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది.
విశాఖ జిల్లాలో అమలవుతున్న శ్రీ శక్తి పథకం అమలుతీరును జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు పరిశీలించారు. ఆదివారం నగరంలోని పలు ప్రాంతాలలో ఆర్టీసీ బస్సులో ఈ పథకం అమలు తీరుపై సమీక్షించారు. ద్వారకా బస్ స్టేషన్లో మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ శక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ప్రజల నుంచి వినతి పత్రాల సేకరించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వాసుల సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.