India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో అపరిశుభ్రత ఉండకూడదని, డ్రెయిన్లు సాఫీగా పని చేసేలా చూడాలని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచించారు. ట్రక్ పార్కింగ్ సమీపంలో ఆహారపు ప్యాకెట్లు వేయకుండా డ్రైవర్లకు అవగాహన కల్పించాలని, పక్షుల ఆకర్షణ నివారించాలన్నారు. పూడిక, చెత్తను తొలగించాలన్నారు. ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ పురషోత్తం పర్యావరణంపై గమనించిన సమస్యలను వివరించారు. అధికారుల సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి 50 ఓట్లతో గెలుపొందడంపై విశాఖలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. కూటమి కార్పొరేటర్లే వైసీపీకి ఓటు వేయడం చంద్రబాబు పాలనపై వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. 32 మంది బలంతో 50 ఓట్లు రావడం విశేషమని, ఇది కూటమిపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని చూపుతోందన్నారు. సభలో పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.
GVMC స్థాయీ సంఘం ఎన్నికల ఫలితాలను కమిషనర్ కేతన్ గార్గ్ ప్రకటించారు.
➣నీలిమ కొణతాల – 58 ➣గంకల కవిత – 57 ➣దాడి వెంకట రామేశ్వరరావు- 57
➣మొల్లి హేమలత 57 ➣సేనాపతి వసంత – 54 ➣ గేదెల లావణ్య – 53
➣మాదంశెట్టి చినతల్లి – 52 ➣రాపర్తి త్రివేణి వరప్రసాదరావు – 52
➣మొల్లి ముత్యాలు – 51 ➣పద్మా రెడ్డి 50 ఓట్లతో గెలిచారు.
వీరికి కమిషనర్ శుభాకాంక్షలు తెలిపారు.
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో ఆల్బెండజోల్ మాత్రలు వైద్యుల సమక్షంలోనే వేయాలని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. ఆగస్టు 12న 1-19 ఏళ్ల పిల్లలకు ఉచితంగా మాత్రలు పంపిణీ చేయనున్నారు. ఆరోజు అందుబాటులో లేని వారికి 20న పంపిణీ చేస్తారు. ఖాళీ కడుపుతో మాత్రలు వేయకూడదని, ప్రాణాంతక రియాక్షన్లు నివారించేందుకు మెడికల్ కిట్, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచాలని సూచించారు.
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ గెలిచిన స్థానాన్ని అధికారికంగా ప్రకటించాలంటూ బుధవారం సాయంత్రం జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే.రాజు జీవీఎంసీ కమిషనర్‌ను కలిసి కోరారు. ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయని, తీర్పును ఆలస్యంగా ప్రకటించటం సరైంది కాదని అన్నారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు తక్షణమే ఫలితాలు వెల్లడించాలన్నారు.
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 9 స్థానాలు కైవసం చేసుకోగా.. వైసీపీ ఒక స్థానం దక్కించుకుంది. క్రాస్ ఓటింగ్ కారణంగా కూటమి అభ్యర్థి రౌతు శ్రీనివాస్ ఓడిపోగా.. వైసీపీకి చెందిన పద్మారెడ్డి విజయం సాధించినట్లు సమాచారం.
కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో రేపు జాబ్ మేళా నిర్వహించనున్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ చదివిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. మేళాలో మొత్తం 9 కంపెనీలు పాల్గొననున్నాయి. కావున పై అర్హతలు కలిగిన ఆసక్తి గల అభ్యర్థులు https://employment.ap.gov.in & www.ncs.gov.in వెబ్ సైట్ నందు తమ పేర్లను నమోదు చేసుకొని రేపు ఉదయం 10 గంటలకు ధ్రువపత్రాలతో హాజరు అవ్వాలి. >Share it.
బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన బాధితులకు విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో అత్యంత ఖరీదైన ఇంజెక్షన్లను ఉచితంగా అందిస్తున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ బాధితులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఖరీదైన ఈ ఇంజెక్షన్ల (టెనెక్ట్ ప్లస్)ను ఉచితంగానే సరఫరా చేస్తోంది. ఈ ఇంజెక్షన్ ధర రూ.40 వేల నుంచి రూ.50 వేలు మధ్యలో ఉంటుందని విమ్స్ డైరెక్టర్ డా.కె.రాంబాబు తెలిపారు.
GVMCలో నిర్వహిస్తున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోలింగ్ ముగిసింది. కూటమి నుంచి 10 మంది, వైసీపీ తరఫున 10 మంది పోటీలొ ఉన్నారు. 14 మంది జనసేన కార్పొరేటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోగా.. పీతల మూర్తి ఓటింగ్‌లో పాల్గొనలేదు. GVMC మేయర్ అవిశ్వాస తీర్మానం సమయంలో పరోక్షంగా కూటమికి మద్ధతు తెలిపిన బెహరా భాస్కరరావుతో పాటు అతని కుటుంబానికి చెందిన మరో ఇద్దరు కూడా ఓటింగ్‌లో పాల్గొనలేదు.
పెదగంట్యాడ మండలం అప్పికొండ గ్రామంలోని స్థలం విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాల వారు ఆయుధాలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో రౌడీ షీటర్ గరికిన గంగరాజు, అతని కుమారుడు కోటేశ్వరరావు, గంగరాజు అక్క బంగారమ్మ అతని భర్త కోటేశ్వరరావు గాయపడ్డారు. గాయపడ్డవారిని దువ్వాడ పోలీసులు హాస్పిటల్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.