India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
IT, టూరిజం, ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతున్న విశాఖను<<17014802>> ట్రాఫిక్<<>> సమస్య వేధిస్తోంది. యోగాడే, గిరిప్రదక్షిణలో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఫ్లైఓవర్ నిర్మాణంతో NAD వద్ద సమస్య తీరినప్పటికీ కొమ్మాది, PMపాలెం, హనుమంతువాక, వెంకోజీపాలెం, ఇసుకతోట, వేపగుంట, గోపాలపట్నం, తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అవుతోంది. ట్రాఫిక్ నివారణ చర్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాల్సి ఉంది.
విశాఖలో మెట్రోకు సెప్టెంబర్‌లో శంకుస్థాపన చేపట్టనున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జి వెల్లడించారు. శుక్రవారం విశాఖ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఉమ్మడి విశాఖలోని సుమారు 300 గ్రామాల్లో గంజాయి సాగును నిర్మూలించి ఉద్యానవనాల పెంపునకు కృషి చేస్తున్నామన్నారు.
విశాఖపట్నంలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఈసాయ్ ఫార్మాస్యూటికల్స్ నిర్ణయించింది. 2026 ఫిబ్రవరి నాటికి ఈ కేంద్రం పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇప్పటికే జేఎన్ ఫార్మా సిటీలో తయారీ ప్లాంట్‌ను నిర్వహిస్తున్న ఈసాయ్ సంస్థ ఈ కొత్త కేంద్రంతో భారత్‌లో తన ఉనికిని మరింతగా బలోపేతం చేయనుంది.
షీలానగర్ సమీపంలోని మారుతి సర్కిల్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పరవాడకు చెందిన అశోక్ రెడ్డి బైకుపై వెళుతుండగా ట్రాలర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎయిర్ పోర్ట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గతంలో కూడా ఇదే ఏరియాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు.
కైలాసగిరిపై ‘లూజ్ గ్రావిటీ రైడ్’ని ప్రవేశపెట్టాలని V.M.R.D.A. నిర్ణయించింది. సింగపూర్‌లోని సెంటోసా వద్ద ఈ రైడ్ అత్యంత ప్రజాదరణ పొందింది. గురుత్వాకర్షణ ఆధారంగా ఈ వినోదాత్మక రైడ్ ఉంటుంది. అన్ని వయస్సుల వారు ఈ రైడ్‌ను ఆస్వాదించవచ్చని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. కైలాసగిరిపై ఇది మంచి టూరిస్టు ఆకర్షణ అవుతుందని భావిస్తున్నామని ఎంసీ విశ్వనాథన్ తెలిపారు.
కైలాసగిరిపై ‘ఎకో హైట్స్’ కాటేజీలు నిర్మించనున్నామని V.M.R.D.A. ఎంసీ విశ్వనాథన్ తెలిపారు. 360 డిగ్రీ రివాల్వింగ్ ఫైన్ డైన్ రెస్టారెంట్, బే వ్యూ కేఫే కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటి కోసం RFP విడుదల చేయునున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులను V.M.R.D.A., ప్రైవేట్ పెట్టుబడిదారులకు పరస్పర లాభదాయకంగా (విన్-విన్) ఉండేలా నిర్మించనున్నారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అన్ని చోట్లా ఫాగింగ్ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశామయ్యారు. అన్ని వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, పారిశుద్ధ్య చర్యలు పక్కాగా చేపట్టాలని సూచించారు. దోమల నివారణలో భాగంగా వీధులలో క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయాలని చెప్పారు.
విశాఖ జిల్లాలో 1,371 పాఠశాల్లో మెగా పేరెంట్స్&టీచర్స్ మీటింగ్ నిర్వహించినట్లు DEO ప్రేమ్ కుమార్ గురువారం తెలిపారు. తోటగరువు జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎన్జీవో కాలనీలో ఎంపీ శ్రీభరత్, గోపాలపట్నంలో ప్రభుత్వ విప్ గణబాబు, అనందపురం లో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారని వివరించారు.
విశాఖ రైల్వే స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్ ఫారం మొదటి అంతస్తులో త్వరలో క్యాప్సూల్ హోటల్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నట్లు DRM లలిత్ బోహ్ర గురువారం తెలిపారు. మొత్తం 88 రూమ్‌లతో కలిగిన హోటల్లో ప్రత్యేకంగా 18 రూములు మహిళలకు మాత్రమే ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సింగిల్ బెడ్‌లు 3 గంటల వరకు రూ.200, 3-24 గంటల వరకు రూ.400, డబుల్ బెడ్‌లు 3 గంటల వరకు రూ.300, 3-24 గంటలకు రూ.600 అద్దె ఉంటుందన్నారు.
కైలాసగిరిపై కొత్త ‘రోప్ వే’ను V.M.R.D.A. నిర్మించనుంది. ప్రస్తుత రోప్ వే పాతబడింది. ప్రయాణ వ్యవధి తక్కువ. దీంతో కొత్త దారిలో ‘రోప్ వే’ను ప్రతిపాదించామని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. దీని ద్వారా బే ఫ్రంట్, విశాఖ నగరం, కొండల దృశ్యాలను త్రీ డైమెన్షనల్ వ్యూలో చూడొచ్చు. సుమారు 1.5 కిలోమీటర్ల పొడవైన ప్రయాణం ఉంటుంది. కార్ పార్కింగ్, ఇతర దర్శనీయ స్థలాలను ఈ రోప్ వే అనుసంధానం చేస్తుంది.
Sorry, no posts matched your criteria.