Visakhapatnam

News August 12, 2024

ఈస్ట్ కోస్ట్ రైల్వే ఖాతాలో మరో మైలురాయి

image

ఈస్ట్ కోస్ట్ రైల్వే మరో మైలు రాయిని సాధించింది. ప్రజలతో కూడిన మల్టీ మోడల్ లార్జెస్ట్ పార్ట్ అండ్ కంటైనర్‌ను విశాఖ నుంచి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ సెంట్రల్ రైల్వేలో విజయవంతంగా లోడ్ చేసింది. పవర్ వ్యాగన్ లతో కూడిన 1,080 టన్నుల రొయ్యలు ఈ కంటైనర్‌లో ఉన్నాయి. ఈ సందర్భంగా సౌరవ్ ప్రసాద్ మాట్లాడుతూ.. సరుకు రవాణా ద్వారా రైల్వే మరింత ఆదాయ మార్గాలను సమకూర్చుకుంటోందని అన్నారు.

News August 12, 2024

117 జీవోను రద్దు చేస్తాం: ఎమ్మెల్సీ

image

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 22 ఉపాధ్యాయ సంఘాలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను విద్యాశాఖ మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. 117 జీవోను రద్దు చేస్తామని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. వీలైనంత తొందరలో వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు.

News August 12, 2024

యాచ‌కుల‌కు విశాఖలో ప్ర‌త్యామ్నాయ జీవ‌నోపాధి

image

సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న “సపోర్టు ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్‌ప్రైజ్ (SMILE)” పథకం ద్వారా అట్ట‌డుగు వ‌ర్గాల వారైన యాచ‌కులకు మ‌ద్ద‌తు తెల‌పాల‌ని, ప్ర‌త్యామ్నాయ జీవ‌నోపాధి చూపాలని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సూచించారు. సోమవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. యాచక వృత్తిలో ఉన్నవారికి సమగ్ర పునరావాసం కల్పించాలని సూచించారు.

News August 12, 2024

సీఎం చంద్రబాబుకి విశాఖ వ్యక్తి స్పెషల్ గిఫ్ట్

image

విశాఖకు చెందిన చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ మిల్లెట్స్‌తో వేసిన చిత్రపటాన్ని సీఎం చంద్రబాబు నాయుడుకి అమరావతిలో సోమవారం స్వయంగా బహుకరించారు. ఏడాదికాలంగా దేశవ్యాప్తంగా ప్రముఖుల చిత్రపటాలను మిల్లెట్స్‌తో వేసినట్లు తెలిపారు. ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకొని మిల్లెట్స్‌కు ప్రజల్లో అవగాహన పెంచుతూ వందలాది చిత్రాలను తీర్చిదిద్దినట్లు సీఎంకి వివరించారు.

News August 12, 2024

ఉమ్మడి విశాఖ నేతలతో భేటీ కానున్న జగన్

image

స్థానిక సంస్థల ఉప ఎన్నిక నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీకి చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో ఈనెల 13,14 తేదీల్లో ప్రత్యేక సమావేశాలను పార్టీ అధినేత జగన్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఐదు నియోజకవర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులతో జగన్ సమావేశాలు నిర్వహించారు. మిగిలిన వారితో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తారు.

News August 12, 2024

విశాఖ: శిశు విక్రయాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశం

image

అనధికార శిశు విక్రయాలపై లోతైన విచారణ జరిపి నివేదిక అందించాలని ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు నేతృత్వంలో విశాఖ నగర పోలీసు కమిషనర్‌కు సోమవారం ఆదేశించినట్లు కమిషన్ సభ్యులు సీతారాం తెలిపారు. సోమవారం కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులో ప్రత్యేకంగా దృష్టి సారించి మూలాలను శోధించాలని సూచించింది. అనధికార దత్తత స్వీకారాలపై అవగాహన కల్పించాలని కమిషనర్ కోరింది.

News August 12, 2024

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

image

ఏయూ లో ఎంబీఏ, ఎంసీఏ ఫుల్ టైం కోర్సుల్లో సెల్ఫ్ సపోర్ట్ విధానంలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈనెల 17వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రవేశాల సంచాలకులు ఆచార్య డి.ఏ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 19న ఉదయం 10 గంటలకు కౌన్సిలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు. అర్హత ఆసక్తి కలిగిన విద్యార్థులు సత్వరం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులు వెంటనే నిర్ణీత ఫీజును చెల్లించాలి.

News August 12, 2024

విశాఖ పార్టీ నేతలతో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భేటీ

image

పార్టీ ముఖ్యనేతలతో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విశాఖ నగరం తన నివాసంలో భేటీ అయ్యారు. మారుతున్న రాజకీయ పరిణామాలపై వారితో అభ్యర్థి చర్చించారు. కూటమి తరపున ఎవరు పోటీలో ఉన్న వైసీపీ విజయం ఖాయమని పార్టీ నేతలు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ గొల్ల బాబురావు, మేయర్ హరి వెంకటకుమారి, మాజీ మంత్రి గుడివాడ, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఉన్నారు.

News August 12, 2024

ఈనెల 14న అప్పన్న ఆరాధన, సుప్రభాత టికెట్లు నిలుపుదల

image

సింహాచలం సింహాద్రి అప్పన్న సుప్రభాత ఆరాధన టికెట్లు ఈనెల 14న నిలుపుదల చేస్తున్నట్లు ఈవో శ్రీనివాసమూర్తి వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. 13వ తేదీన కొండపై వెలసిన శ్రీఉమా మహేశ్వరి పాదాలమ్మ, బంగారమ్మ పండుగ జరగనున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు తొలేళ్ళ ఉత్సవం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు.

News August 12, 2024

విశాఖ: నాందేడ్-శ్రీకాకుళం మధ్య స్పెషల్ ట్రైన్

image

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నాందేడ్ వయా దువ్వాడ మీదుగా శ్రీకాకుళం రోడ్డుకు ఈనెల 14న ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం కే.సందీప్ తెలిపారు. ఇది మధ్యాహ్నం 2 గంటలకు నాందేడ్‌లో బయలుదేరుతుందన్నారు. 15న శ్రీకాకుళం రోడ్లో ఈ ట్రైన్ సాయంత్రం 5 గంటలకు బయలుదేరి దువ్వాడ మీదుగా మరుసటి రోజు నాందేడ్ చేరుకుంటున్నారు.