Visakhapatnam

News April 19, 2025

సమిష్టి కృషితో విజయం సాధించాం: గంటా

image

కూటమి ప్రభుత్వంలో ప్రతీ ఒక్కరి సమిష్టి కృషితోనే విజయం సాధించామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు శనివారం మేయర్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీపై పూర్తి వ్యతిరేకతతోనే కూటమిలో ఆ పార్టీ కార్పొరేటర్లు చేరారని అన్నారు. జీవీఎంసీకి మంచి రోజులు రానున్నాయని తెలిపారు. గత ప్రభుత్వంలో జీవీఎంసీలో అభివృద్ధి కుంటిపడిందన్నారు. 

News April 19, 2025

ఆ 27మందిపై అనర్హత వేటు వేయండి: వైసీపీ 

image

జీవీఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్ హరేంద్ర ప్రసాద్‌ను వైసీపీ నేత తైనాల విజయ్ కుమార్ కలిశారు. విప్ ధిక్కరించిన 27 మంది కార్పొరేటర్లపై ఫిర్యాదు చేశారు. జీవీఎంసీ కాన్ఫిడెన్స్ ఇన్ మేయర్ రూల్స్-2008 ప్రకారం వైసీపీ గుర్తుపై గెలిచి కూటమికి మద్దతు ఇవ్వడం ప్రొసీడింగ్స్ ప్రకారం తప్పని.. 27మంది కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని కోరారు. విప్ కాపీని అందజేశారు.

News April 19, 2025

విశాఖ అభివృద్ధే సీఎం లక్ష్యం: మంత్రి డోలా

image

వైసీపీ 5 ఏళ్ల పాలనలో జీవీఎంసీలో జరిగిన అభివృద్ధి శూన్యమని విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి స్వామి అన్నారు. శనివారం ఆయన జీవీఎంసీలో మేయర్‌పై అవిశ్వాసం నెగ్గిన సందర్భంగా కూటమి కార్పొరేటర్లతో కలిసి మాట్లాడారు. వైసీపీ అరాచకాలు అడ్డుకునేందుకే కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారని పేర్కొన్నారు. విశాఖను అన్ని విధాల అభివృద్ధి చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం అన్నారు.

News April 19, 2025

వ్యక్తిగత ప్రయోజనాలకే వైసీపీ పరిమితం: విశాఖ ఎంపీ 

image

వ్యక్తిగత ప్రయోజనాలకే వైసీపీ ప్రభుత్వం పరిమితమైందని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. శనివారం జీవీఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మాన ఓటింగ్‌లో కూటమి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో కలిసి ఎంపీ శ్రీభరత్ పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జీవీఎంసీలో అభివృద్ధి పరంగా ఎలాంటి పురోగతి జరగలేదన్నారు. రానున్న రోజుల్లో కూటమి నాయకత్వంలో జీవీఎంసీని పూర్తిగా ప్రజల అభివృద్ధికి కేటాయించబోతున్నామన్నారు.

News April 19, 2025

విశాఖ కొత్త మేయర్ ఆయనేనా?

image

జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానంలో కూటమి నెగ్గడంతో కొత్త మేయర్ ఎవరన్న సందిగ్ధంలో కార్పొరేటర్లు ఉన్నారు. కూటమిలో పలువురు ఆశావాహులు మేయర్ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న పీలా శ్రీనివాస్‌కే పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. త్వరలోనే డిప్యూటీ మేయర్ పదవికి అవిశ్వాసం జరిగితే ఆ పదవి జనసేనకు కేటాయిస్తారని కూటమి వర్గాల్లో చర్చనడుస్తోంది.

News April 19, 2025

విశాఖ మేయర్ పీఠం.. పార్టీల బలాబలాలు

image

మరికొద్ది గంటల్లో విశాఖ మేయర్ పీఠంపై ఉత్కంఠ వీడనుంది. 2021లో జరిగిన GVMC ఎన్నికల్లో YCP 58 స్థానాలు నెగ్గి మేయర్ పీఠం కైవశం చేసుకుంది. TDP-30, JSP-3, CPM, CPI ఒక్కో స్థానం గెలిచాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమీకరణాలు మారాయి. దీంతో మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. కూటమికి సుమారు 64 మంది, YCPకి 30 మంది కార్పొరేటర్‌లున్నారు. ఈ ఓటింగ్‌కు కమ్యూనిస్ట్ పార్టీలు దూరంగా ఉంటున్నాయి.

News April 19, 2025

ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య

image

సబ్బవరం మండలం గణపతి నగర్‌లో డిగ్రీ చదువుతున్న విద్యార్థి కె.అప్పలనాయుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం అర్ధరాత్రి ఇంటికి వచ్చి గదిలోకి వెళ్లాడు. గంట తర్వాత స్నేహితుడు సుబ్రహ్మణ్యంకు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. స్నేహితుడు గణపతి నగర్‌కు వచ్చి చూడగా అప్పటికే మృతి చెందాడు. తల్లి లీలా కుమారి ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.

News April 19, 2025

మలేషియా నుంచి విశాఖ రాని కూటమి మద్దత్తు కార్పొరేటర్

image

కూటమి కార్పొరేటర్లు విహార యాత్ర నుంచి శుక్రవారం రాత్రి విశాఖ చేరుకున్నారు. వీరిలో 73వ వార్డు కార్పొరేటర్ భూపతి రాజు సుజాత వారితో కలిసి రాలేదు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తనను మాత్రమే పార్టీలో ఆహ్వానించారని, తన భర్తను ఆహ్వానించలేదని అలిగి కూర్చున్నారు. విషయం తెలుసుకున్న పల్లా ఆమెతో ఫోన్‌లో మాట్లాడి బుజ్జగించి శనివారం విశాఖ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సుజాత వైసీపీలో గెలిచి కూటమిలో చేరారు.

News April 19, 2025

కలెక్టర్‌ను కలిసిన జీవియంసీ కాంట్రాక్టర్లు

image

విశాఖ కలెక్టర్, జీవీఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్ హరేంధిర ప్రసాద్‌ను కలిసిన జీవీఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఛైర్మన్ఆధ్వర్యంలో శుక్రవారం కలిశారు. జీవీఎంసీలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలని కోరారు. కోట్లాది రూపాయలు అప్పులు చేసి వడ్డీలు కట్టలేకపోతున్నామని వాపోయారు. కలెక్టర్ వెంటనే స్పందించి రూ.ఆరు కోట్లు రిలీజ్ చేస్తామని హామీ ఇవ్వడం ఇచ్చారు.

News April 18, 2025

గంటాను కలిసిన దేవీశ్రీ ప్రసాద్

image

భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ శుక్రవారం ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. పోర్టు స్టేడియంలో శనివారం రాత్రి జరగనున్న సంగీత విభావరి కోసం దేవీశ్రీ ప్రసాద్ విశాఖ వచ్చారు. సినీ సంగీత కార్యక్రమాలను నగర ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని, ఈ విభావరి కూడా విజయవంతం కావాలని గంటా ఆకాంక్షించారు. తన కొత్త ప్రాజెక్టుల వివరాలను దేవీశ్రీ ప్రసాద్ గంటాతో పంచుకున్నారు.