Visakhapatnam

News August 6, 2024

విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు ఓటర్ల వివరాలు ఇలా..

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొత్తం 838 మంది ఓటర్లు జాబితాను విడుద చేసిన సంగతి తెలిసిందే. ఎంపీటీసీలు 636 మంది, జడ్పీటీసీలు 36 మంది, కార్పొరేటర్లు 97 మంది, కౌన్సిలర్లు 53 మంది, ఎక్స్ ఆఫీషియో సభ్యులు 16 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రిటర్నింగ్ అధికారి కె.మయూర్ అశోక్ తెలిపారు.

News August 6, 2024

విశాఖ: 838 మంది ఓటర్లతో ముసాయిదా జాబితా విడుదల

image

ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి 838 మంది ఓటర్లతో ముసాయిదా జాబితా విడుదల చేసినట్లు రిటర్నింగ్ అధికారి కే.మయూర్ అశోక్ తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు తెలియజేయడానికి ఈనెల 10వ తేదీ వరకు గడువు ఉందన్నారు. విశాఖ, అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు, డివిజన్ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. అభ్యర్థిని పదిమంది ఓటర్లు బలపర్చాల్సి ఉంటుందన్నారు.

News August 6, 2024

బొర్రా గుహలను కాపాడాలని  వినతి

image

బొర్రా గుహలను కాపాడాలంటూ అరకు ఎంపీ డా.గుమ్మా తనూజ రాణి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. ఢిల్లీలోని పార్లమెంట్ ఆఫీసులో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. బొర్రాగుహలపై నుంచి వేసే రెండో రైల్వే లైన్ ఎలైన్మెంట్ 40మీటర్లు జరపాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే బొర్రా గుహలకు పెను ప్రమాదం ఉందని, గుహలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజనులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

News August 6, 2024

విశాఖ: ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నేడు నోటిఫికేషన్

image

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల అవుతుందని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. ఉప ఎన్నికకు సంబంధించి విశాఖ కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్స్‌కు ఓటు హక్కు ఉంటుందన్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక జరుగుతుందన్నారు.

News August 5, 2024

విశాఖ: ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీలా?

image

ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి తరఫున అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గాజువాకలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వగృహంలో అభ్యర్థి ఎంపికపై నిర్వహించిన సమావేశంలో పీలాను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

News August 5, 2024

కంచరపాలెం: అదృశ్యమైన యువకుడి మృతి

image

అదృశ్యమైన యువకుడు చనిపోయిన ఘటన డుంబ్రిగుడ మండలంలో వెలుగు చూసింది. విశాఖ కంచరపాలేనికి చెందిన చంద్రకాంత్(17) గత నెల 30న అరకులో అదృశ్యమైనట్లు పోలీసులకు మృతుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ కోణంలో దర్యాప్తు చేస్తుండగా డుంబ్రిగుడ మండలం జాంగుడ సమీపంలోని పొలం గడ్డ వాగులో మృతదేహం దొరికిందని సీఐ రుద్రశేఖర్ వెల్లడించారు. కాళ్లు చేతులు కట్టి ఉండటంతో పథకం ప్రకారం హత్య చేసి ఉంటారని తెలుస్తోంది.

News August 5, 2024

గాజువాక: బైకులు ఢీ.. ఒకరు మృతి

image

గాజువాక పరిధిలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. లంకెలపాలెం జాతీయ రహదారి పెట్రోల్ బంక్ సమీపంలో రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో అలమండ అప్పారావు అనే వ్యక్తి మృతిచెందాడు. మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News August 5, 2024

ఎమ్మెల్సీగా నన్ను గెలిపించండి: బొత్స

image

ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. చోడవరంలో మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ అధ్యక్షతన పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బొత్స మాట్లాడుతూ.. జగన్ తనపై ఎంతో నమ్మకంతో అభ్యర్థిగా ఖరారు చేశారన్నారు. ప్రజా ప్రతినిధులు కలిసిమెలిసి పనిచేసి గెలిపించాలని కోరారు.

News August 5, 2024

మధురవాడలో మరో కొత్త యూనిట్ మాల్

image

విశాఖలోని మధురవాడ ప్రాంతంలో మరో కొత్త యూనిట్ మాల్ ఏర్పాటు కానుంది. రామానాయుడు స్టూడియో వద్ద ఈ మాల్‌ను నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాల్ కోసం ప్రతిపాదించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్ హరేంద్ర ప్రసాద్, రూరల్ ఎమ్మార్వో పాల్ కిరణ్ సోమవారం పరిశీలించారు. క్షేత్రస్థాయిలో అంశాలపై అధికారులతో ఆరా తీశారు.

News August 5, 2024

పారా ఒలింపిక్స్‌కు అనకాపల్లి జిల్లా క్రీడాకారుడు

image

అనకాపల్లి జిల్లా కె.కోటపాడుకు చెందిన రొంగలి రవి పారిస్‌లో ఈనెల 28 నుంచి ప్రారంభమయ్యే పారా ఒలింపిక్స్‌కు ఎంపికయ్యారు. షాట్‌పుట్‌లో రవి భారత్‌కు ప్రతినిధిగా వ్యవహరించనున్నారు. అతణ్ని క్రీడాకారుడిగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు మంగ, బాబు తమ వ్యవసాయ భూమిని సైతం విక్రయించారు. ఆదాయపు పన్ను విభాగంలో అధికారిగా పనిచేస్తున్న రవి పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం అందించడమే తన లక్ష్యమని అన్నారు.