India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెందుర్తి కేంద్రంగా గల విశాఖ శ్రీ శారదా పీఠానికి గత ప్రభుత్వం కారుచౌకగా భూములను కేటాయించినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఎకరం రూ.20 కోట్ల ధర పలికే భూమిని కేవలం రూ. లక్ష రూపాయలకే కేటాయించినట్లు పేర్కొన్నారు. అందుకనే భూముల కేటాయింపును రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
విశాఖ పోలీసు శాఖలో హోమ్ గార్డుగా విధులు నిర్వర్తించిన మహమ్మద్ హాసం న్యూరో సమస్యలతో అకాల మరణం చెందారు. ఈ సందర్భంగా కాంట్రిబ్యూషన్ ఫండ్ నుంచి సదరు హోంగార్డ్ భార్య జరీనా కౌషర్ కి బుధవారం ఆర్థిక సహాయం కింద చెక్ అందించారు. అనంతరం ఆమెకు కారుణ్య నియామకం క్రింద హోమ్ గార్డు ఉద్యోగం నియామక పత్రాన్ని కమిషనర్ శంఖబ్రాత భాగ్చి అందజేశారు.
ఏయూ విద్యార్థుల వినతిని అధికారులు పరిశీలించి ప్రస్తుతం ఉన్న సెమిస్టర్ పరీక్ష ఫీజులో రూ.450 తగ్గించి నిర్ణయం తీసుకున్నారు. ఏయూ ఆర్ట్స్ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు అధికారులను కలిసి లిఖిత పూర్వకంగా పరీక్ష ఫీజును తగ్గించాలని, పరీక్ష ఫీజు చెల్లించే గడువును నవంబర్ 2వ తేదీ వరకు పొడిగించాలని వీసీ ఆచార్య జి.శశిభూషణరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్.ధనంజయరావులకు వినతిపత్రం అందజేశారు.
అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ యాగాన్ని నవంబర్ 18 నుంచి జనవరి 1 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.
అల్లూరి జిల్లా హుకుంపేట మండలం తడిగిరి పంచాయతీ ఉక్కుర్భకి చెందిన పరదాని రమణమూర్తికి అరుదైన అవకాశం లభించింది. పర్యావరణ అధ్యయనం కోసం అంటార్కిటికా ఖండంలో 2నెలల పాటు అధ్యయనం చేసేందుకు ఎంపికైన ఐదుగురు భారత శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించే గౌరవం దక్కింది. రమణమూర్తి ఏయూలో మాస్టర్ డిగ్రీలో బయోఫిజిక్స్ పూర్తి చేశారు. విశాఖపట్నం భూ అయస్కాంత పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్నారు.
విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 724 కి.మీ. దూరంలో ‘దానా’ తుఫాన్ కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇది క్రమేపి ఒడిశా వైపు కదులుతోందని పేర్కొన్నారు. ఈ ప్రభావంతో వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, జాగ్రత్తలు పాటించాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.
ఈ నెల 28వ తేదీన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె రద్దయింది. ఈ మేరకు మంగళవారం స్టీల్ ప్లాంట్ లో జరిగిన అఖిల పక్ష కార్మిక సంఘాల సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ప్లాంట్ పరిస్థితి దృష్ట్యా యజమాన్యం అభ్యర్థన మేరకు సమ్మె చేయకూడదని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఆ రోజు సమ్మెకు బదులుగా అడ్మిన్ బిల్డింగ్ వద్ద ధర్నా నిర్వహించాలని తీర్మానంలో పేర్కొన్నారు.
పలురైళ్లు బయలుదేరే సమయాలను మార్పు చేసినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె. సందీప్ తెలిపారు. అల్పూజా-ధన్బాద్(13352) బొకారో ఎక్స్ ప్రెస్ ఈరోజు ఉదయం 6 గంటలకు బదులు 4.10గంటలు ఆలస్యంగా ఉదయం 10.10 గంటలకు బయలుదేరేలా మార్పు చేశారు. ప్రయాణీకులు ఈ మార్పును గమనించి తదనగుణంగా తమ ప్రయాణాన్ని మార్పు చేసుకోవాలని సూచించారు.
విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్ అన్ని న్యాయస్థానాల్లో నిర్వహించనున్నారు. కోర్టుల్లో పెండింగ్ కేసులు, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్ట వ్యవహారాల కేసులు, బ్యాంక్ మనీ రికవరీ కేసులు, కార్మిక, కుటుంబ తగాదాలు, పారిశ్రామిక వివాదాల కేసులు పరిష్కరించుకోవచ్చునని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తెలిపింది.
రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ సూచించారు. మంగళవారం ఢిల్లీ పార్లమెంట్ భవనంలో రైల్వే స్టాండింగ్ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ఇతర అంశాలపై ఆయన సమీక్షించారు. రైల్వే వ్యవస్థ కార్యకలాపాల్లో భాగంగా భద్రతను పెంపొందించాలన్నారు.
Sorry, no posts matched your criteria.